హైదరాబాద్, మేజర్‌న్యూస్: తెలంగాణ బంద్ ప్రభావం ఆర్టీసిపై తీవ్రంగా పడింది. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు జరిగిన బంద్ వల్ల తెలం గాణలోని పది జిల్లాల్లో మొత్తం 6500 బసు సర్వీ సులను ఆర్టీసి రద్దు చేసింది. దీనివల్ల ఒక్క రోజు లోనే రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెల్ల వారుజామున కొన్ని సర్వీసులను నడిపిం చినా, పోలీసుల సలహాతో వాటిని రద్దు చేశారు. హైదరా బాద్‌లో మాత్రం 20 శాతం బస్సుల రాకపోకలు సాగించాయి. కొన్ని ప్రధాన మార్గాల్లో పాత బస్సు లను రోడ్డుపైకి తెచ్చి, నడిపించారు. ఉదయం పూట తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయ కులు బస్‌డిపోల ముందు బైఠాయిం చి, నినాదా లు చేశారు. డిపో గ్యారేజీలకు తాళం వేశారు. ఆర్టీసికి చెందిన జెఎసి నాయకులు కూ డా వారికి మద్దతు పలకడంతో బస్సులు కదల్లేదు.
బంద్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే అప్రమత్తం కావడంతో ఎక్కడా ప్ర యాణికులు ఇబ్బందులు పడిన సమాచారం లేదు. హైదరా బాద్‌లో ఉదయం నుంచీ కొన్ని ప్రధాన మార్గాల్లో ఒకటి, రెండు చొప్పున సిటీ బస్సులు నడిచాయి. పాత సిటీ ఆర్డినరీ బస్సులను అధికారులు రోడ్లపై కి తెచ్చారు. పోలీసుల హెచ్చ రికలతో కొన్నింటిని డిపోలకు మళ్లించినా, అనం తరం పరిస్థితిని బట్టి బస్సులను నడిపించారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగ వచ్చని తెలుస్తోంది.రైళ్లనూ అడ్డుకున్నారు. కొన్ని మార్గా ల్లో జేఏసీ నాయ కులు రైల్‌రోకో నిర్వహించారు.
0 comments:
Post a Comment