విడిపోతే ప్రాంతేతరులకు పూర్తి రక్షణ ఏబీఎన్ 'ఓపెన్ డిబేట్'లో తెలంగాణ నేతల పూచీ
విడిపోతే ప్రాంతేతరులకు పూర్తి రక్షణ
ఏబీఎన్ 'ఓపెన్ డిబేట్'లో తెలంగాణ నేతల పూచీ
విద్వేష వ్యాఖ్యలు వద్దు.. సీమాంధ్ర నేతల సూచన
అపోహల నివృత్తికి కమిటీ: యాదవరెడ్డి సూచన
హైదరాబాద్‌పై రిఫరెండమ్ కోరాలి: జేసీ
ఆస్తుల పంపిణీ జరగాల్సిందే: హరిరామ జోగయ్య
ప్రజాభిప్రాయం తీసుకోండి: కోడెల
భయాలు అవసరం లేదు: హారీశ్
హైదరాబాద్ సమస్య కాదు: కోదండరామ్
సమైక్యాంధ్రే కావాలి: ఆనం వివేకా
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : రాష్ట్ర విభజన జరిగితే.. హైదరాబాద్‌లో ప్రాంతేతరులకు రాజ్యాంగపరంగా ఎటువంటి రక్షణలు ఇవ్వడానికైనా సిద్ధపడతామని తెలంగాణ నేతలు హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగానికి లోబడి ఉంటామని స్పష్టం చేశారు. భయాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తథ్యమని తేల్చి చెప్పారు. పెట్టుబడులు పెట్టినంత మాత్రాన హక్కులు ఉండవని స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా విడిపోదామని సూచించారు. హైదరాబాద్‌పై రిఫరెండమ్ కోరాలి: జేసీ
ఆస్తుల పంపిణీ జరగాల్సిందే: హరిరామ జోగయ్య
ప్రజాభిప్రాయం తీసుకోండి: కోడెల
భయాలు అవసరం లేదు: హారీశ్
హైదరాబాద్ సమస్య కాదు: కోదండరామ్
సమైక్యాంధ్రే కావాలి: ఆనం వివేకా
అయితే, హైదరాబాద్‌పై తప్పనిసరిగా రిఫరెండమ్ నిర్వహించాల్సిందేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అధ్యక్షతన 'ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి' గురువారం ఇక్కడి ఓ హోటల్‌లో 'ఓపెన్ డిబేట్' చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర విభజనకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ అంశంపై అపోహలు, ఆందోళనలు, విద్వేషాలు తొలగిపోయేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు సమావేశమై శాశ్వత పరిష్కారం చూపాలన్న అభిప్రాయం చర్చా వేదికలో వ్యక్తమైంది.
చర్చా వేదికను ప్రారంభిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం క్లైమాక్స్‌కు చేరుకుందని, ఏదో ఒకటి తేలిపోవాలని అంతర్గత సంభాషణల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారని, కానీ, ఏది జరగాలి? అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారని వివరించారు. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు, సెంటిమెంట్ బలంగా ఉందని, అదే సమయంలో సీమాంధ్ర ప్రజలు కూడా తేలిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు.
కానీ, ప్రజల ఆలోచనలకు భిన్నంగా పార్టీలు వేటి వ్యూహాలతో అవి ముందుకు సాగుతున్నాయని, దీంతో సామాన్యు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. "సీఎం నుంచి పార్టీల వరకు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని అంటున్నారు. మరి, కేంద్రం ఏ నిర్ణయం ఎందుకు తీసుకోదు? ఎందుకంటే.. అక్కడ వచ్చిన సమస్య.. హైదరాబాద్ గురించి తేల్చమంటున్నారు'' అని తెలిపారు. అభ్యంతరాలు చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని, ఒక్కో అడుగు ముందుకేస్తే వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చని సూచించారు.
ఈ చర్చలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పౌరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి ఆస్తిగా పంచుకోవాలని ఆంధ్రా ప్రాంత నేతలు సూచించగా.. కుదరదని, అది ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. విభజన అనివార్యమైన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర ప్రాంతాల ప్రజల సందేహాలు, భయాలను నివృత్తి చేసేందుకు ప్రజా సంఘాలు, పౌరులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చేసిన ప్రతిపాదనకు పలువురు నేతలు మద్దతు పలికారు.
0 comments:
Post a Comment