పల్లె పల్లె పట్టాలపైకి ఉద్యమం - మార్చి 1 న పట్టాలపైనే వంటావార్పూ : కోదండరాం పిలుపు
రెండోవారంలో ఈజిప్ట్ తరహాలో హైదరాబాద్ దిగ్బంధం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో మార్చి ఒకటవ తేదీన వినూత్న ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. మార్చి మొదటివారంలో ఈజిప్ట్ తరహా ఉద్యమంతో హైదరాబాద్‌ను దిగ్బంధం చేయనున్నట్టు ్ల తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. మార్చి ఒకటవ తేదీన రైలు మార్గం వె ంట గల పల్లెలనుంచి ప్రజలు తరలివచ్చి పట్టాలపైనే వంటావార్పూ చేస్తారని ఆయన ప్రకటించారు. 24 గంటల పాటు జరిగే ఈ ఉద్యమంలో ఢిల్లీకి ఒక్క రైలును కూడా కదలనివ్వమని ఆయన హెచ్చరించారు.
ఇదివరకు ఎన్నడూ జరగని రీతిలో ఈ రైల్ రోకో ఉద్యమం కోదండరామ్ ప్రకటించారు. జిల్లా జేఏసీలు ఎక్కడికక్కడ మండల జేఏసీ నేతలతో కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుసరించవలసిన పద్ధతులను చర్చించుకోవాలని, ఎక్కడికక్కడ మండలి జేఏసీలు పల్లె పల్లెకి తిరిగి ప్రచారం చేయాలని, ప్రతి పల్లె పట్టాలపైకి తీసుకురావడమనేది ఈ కార్యక్రమ ఉద్దేశంగా కోదండరాం పేర్కొన్నారు.
రైలు పట్టాల వెంట ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలను మార్చి ఒకటినాడు పట్టాలపైకి తీసుకు వస్తామని, 'పల్లె పల్లె పట్టాలపైకి' అనే ఈ కార్యక్రమంతో కేంద్రానికి ఒక సంకేతాన్ని పంపాలనే ఆలోచనతో ఉన్నామని కోదండరాం చెప్పారు. అందరినీ సమన్వయపరుచుకుని విస్తృతస్థాయిలో గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని, పాదయాత్రలు, మోటారు సైకిల్ ర్యాలీలు ఏది వీలైతే ఆ పద్ధతిలో ప్రచార యాత్రలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పుటు తెలంగాణలో అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం తెలంగాణపై ఒన నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి, ఈజిఫ్టులో ఉద్యమం ఏ రీతిలో జరిగిందో అదే మాదిరిగా మార్చి ఒకటిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పట్టాలపైకి కదిలి కేంద్రానికి సంకేతాలు పంపాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
గురువారం సాయంత్రం ఉద్యోగస్తులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ వచ్చేదాకా సహాయ నిరాకరణ సాగిస్తాం. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని ఉద్యోగులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఇది మామూలు నిర్ణయం కాదు, తమ జీతం, జీవితం ఏమైనా పర్వాలేదు. తెలంగాణ వచ్చేవరకు పోరాటానికి నిర్ణయం తీసుకోవడమనేది అత్యంత సాహసోపేతమైనదని, ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉద్యమాన్ని బతికించాలని ఉద్యోగస్తులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు, తెలంగాణా సా«ధనకు కలిసికట్టుగా కదలాలని నిర్ణయించుకున్నందుకు తెలంగాణ ప్రజలందరి తరఫున ఉద్యోగులను అభినందిస్తున్నట్టు ఆయన చెప్పారు.

0 comments:
Post a Comment