రణరంగం
సూర్యాపేట, : తెలంగాణ జేఏసి నాయకుల పై ఎమ్మేల్యే దామోదర్‌రెడ్డి వర్గీయులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఎమ్మేల్యే ప్రధాన అనుచరులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, బైరు వెంకన్న ల ఆధ్వర్యంలో ఈ దాడికి పూనుకొని విచక్షణా రహితంగా చితకబదారు. ఈ దాడిలో జేఏసి కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, టిఆర్‌ఎస్ నాయ కులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి రమేష్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన డిఇఓ పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మేల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హజరుకావల్సి ఉన్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేక్సీలు, బ్యానర్‌లను జేఏసి నాయకులు సీమాంధ్ర వ్యక్తికి సన్మానమా అంటూ వాటిని చింపివేశారు.
ఆ ప్లేక్సీల పై దామోదర్‌రెడ్డి ఫోటోలు ఉండటంతో దామోదర్‌రెడ్డి వర్గీయులు జేఏసి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాహార దీక్ష టెంట్‌ను కూల్చివేశారు. ఈ సంఘటనతో జేఏసి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద నిరసన తెలుపుతుండగా తిరిగి ఎమ్మేల్యే వర్గీయులు అక్కడికి చేరి జేఏసి నాయకుల పై దాడి చేశారు. దీంతో జేఏసి నాయకులు పరారైయ్యారు. తెలంగాణ వాదుల పై దాడికి నిరసనగా నేడు సూర్యాపేట బంద్‌కు జేఏసి పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహాకరించాలని కోరారు. స్వచ్చందంగా బంద్‌లో పాల్గొని తెలంగాణ వాదాన్ని చాటాలని కోరారు.జేఏసి నాయకులు ఇచ్చిన బంద్ పిలుపును అడ్డుకుంటామని దామోదర్‌రెడ్డి అనుచరుడు కొప్పుల వేణారెడ్డి తెలిపారు. వ్యాపార సంస్ధలు మూసివేయవద్దని, బంద్‌లో ప్రజలు పాల్గొనవద్దని కోరారు
0 comments:
Post a Comment