పడగొడితేనే తెలంగాణ
- కిరణ్ సర్కారును కూల్చాల్సిందే.. అప్పుడే యూపీఏకు సెగ తాకేది
- నేడు నిరసన ప్రదర్శనలకు రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్ పిలుపు
ఇది మోసం చేసిన సర్కారు! తెలంగాణ ఇస్తామని చెప్పి.. మాట మార్చిన ద్రోహుల ప్రభుత్వం! తెలంగాణ రావాల్నంటే ఈ సర్కారు పోవాలె! సర్కారు కూలితేనే కేంద్రంలో సెగ తగులుద్ది! తెలంగాణ సెగ తగిలితేనే కేంద్రం దిగి వస్తుంది! మన రాష్ట్రం మనకు ఇస్తుంది! ఇదీ తెలంగాణలో మెజార్టీ ప్రజల అభివూపాయం! నేడు అసెంబ్లీలో చర్చకు, ఓటింగ్‌కు రానున్న అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తమ ప్రాంత ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు చూపిన మార్గం! అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు చేయాల్సిందేమిటి? ప్రభుత్వం ఉండాలా? కూలిపోవాలా? దీనిపై జనం ఏమనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఈ అంశాలు తెలుసుకునేందుకు తెలంగాణలోని పది జిల్లాల్లో టీ న్యూస్ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో నూటికి 80 శాతం మంది సర్కారు పడిపోవాలనే కోరుకున్నారు. ఇటీవల 42 రోజుల పాటు సమరోత్సాహంతో జరిగిన సకల జనుల సమ్మెను ఈ సందర్భంగా అనేక మంది గుర్తు చేశారు. మలి విడత ఉద్యమంలో వివిధ వీరోచిత ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతున్న ద్రోహచింతనలకు నిరసనగా 700 మంది యువత తృణవూపాయంగా అర్పించిన బలిదానాలను ప్రస్తావించారు. ఇంత తీవ్ర స్థాయిలో జనం తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లడించినా.. రాష్ట్రంలో కిరణ్ సర్కారుగానీ, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంగానీ తెలంగాణపై నిర్దిష్ట హామీ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు తమ ఓటు వేసే ముందు ఈ అభివూపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రభుత్వమంటూ వారు అవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ తరఫున అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు.. తమ ఆకాంక్షను నెరవేర్చాలని విన్నవించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఇదే అభివూపాయం వ్యక్తం కావడం విశేషం. తెలంగాణ అంశానికి తోడు.. ప్రజా సమస్యల పరిష్కారంలో, రైతుల కష్టాలు కడతేర్చడంలో కూడా కిరణ్ సర్కారు విఫలమైందని, కనుక ఆ సర్కారుకు అధికారంలో కొనసాగే అర్హత లేదని వాదించిన వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్యేలందరూ చిత్తశుద్ధి చాటుకునే సమయం ఆసన్నమైందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు పలకాలని ఆయన హితవు పలికారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు వచ్చే సమయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపైఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఇదే విషయంలో టీఆర్‌ఎస్ సైతం తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News.Assembly
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)



(హైదరాబాద్):ఇంకా స్పష్టత రాని రాజకీయ లెక్కలు కిరణ్ సర్కారును కూల్చేస్తాయా? జగన్ మంతనాలు ఏ మేరకు ఫలిస్తాయి? చిరంజీవి అసంతృప్తి టీ కప్పులో తుఫానేనా? తెలంగాణవాదులందరూ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కేసీఆర్ పిలుపు ప్రభావమేంటి? అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా? ప్రభుత్వాన్ని కాపాడుకునే యత్నంలో కాంగ్రెస్ సఫలీకృతమవుతుందా?
నల్లగొండ, :తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సోయి ఉన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కిరణ్ సర్కార్‌ను కూల్చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు కాసో జు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నిజమైన తెలంగాణ బిడ్డలుగా నిలబడాలి. ఇప్పుడు మనం పులి మీద స్వారీ చేస్తున్నాం, దిగితే పులి మింగివేస్తుంది. ఉద్యమంపై ఏ మాత్రం వెనకడుగు వేసినా సీమాంధ్ర ప్రభుత్వం మనల్ని దోచుకుంటుంది. ప్రజా వైద్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ జై తెలంగాణ అన్నందుకు పీడీ యాక్టు, నాసా కింద కేసులు నమోదు చేశారు. నల్లచట్టాలు అమలుచేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్ సర్కార్‌ను కూల్చేయాల్సిందే. ఓ డాక్టర్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే కాంగ్రెస్ జిల్లా నాయకులు సిగ్గుపడాలి. నాలుగున్నర కోట్ల ప్రజలు జై తెలంగాణ అంటున్నారు, ఎంత మందిని జైల్లో పెడతారో పెట్టండి. 11 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ హింసా మార్గంలోకి వెళ్లలేదు. ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాధతో కడుపు మండి బస్సులపై రాళ్లు విసిరితే నల్లచట్టాలతో కేసులు పెట్టి సర్కారు వేధిస్తోంది. రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంవూతులు మారినా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఈ సమస్యకు పరిష్కారం. తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెలంగాణలో ఏదో ప్రాజెక్టుకు, రహదారికి పెట్టాలన్న సోయి మన ఎమ్మెల్యేలకు లేదు. సీఎంను చూస్త్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయి. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకైనా పేరు పెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి అర్హులు. ప్రజలు సంఘటితమై పోరాడి తెలంగాణ సాధించుకుందాం.’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
సోమవారం అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఇది తెగదెంపుల సమరం, చరివూతలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది సువర్ణావకాశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో, లేక ఆంధ్ర సర్కాకు అండగా నిలుస్తారో తేల్చుకోవాల్సిన సమయమిది. తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని చెప్పుకున్న నేతలంతా అవిశ్వాసంలో తెలంగాణ పక్షాన నిలబడాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలి. జేఏసీ, కులసంఘాలు, తెలంగాణవాదులు ఎవరికి వారే పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలపై ఒత్తిడి తేవాలి. చరివూతలో కీలకమైన సందర్భంలో మనమంతా ఉద్యమించాలి. శ్రీకాంత్‌చారిలా ఆత్మబలిదానాలు అవసరం లేదు, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేచాలు. జీవితంలో తిరిగి రానిది ఒక్క ప్రాణమే, దాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన శ్రీకాంతాచారి ఈ తరానికి ఆదర్శనీయుడు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (): అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న వేళ.. కాంగ్రెస్‌లో విలీనమైన పీఆర్పీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అధికార పార్టీ తమను గడ్డిపోచల్లా చూస్తున్నదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విషయంలో పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుడు చిరంజీవికి సైతం ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి గుర్తింపునూ ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసతీర్మానంపై గట్టెక్కేందుకు జగన్ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ను ఉరుములేని పిడుగులా వచ్చిన పడిన ఈ వ్యవహారం కలవరపెట్టింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసిన సందర్భంగా కనీసం మూడు మంత్రి పదవులతో పాటు చిరంజీవికి రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఉత్తమ స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ఇంత వరకూ ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే సరైన సమయమని పీఆర్పీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్ నుంచి గెలిచి జగన్ గూటికి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే వారికి కోట్ల రూపాయల పనులు ఇస్తున్నారని, గౌరవంగా ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎలాంటి షరతు లేకుండా విలీనమైన తమకు కనీస విలువ ఇవ్వడం లేదని చిరంజీవి వద్ద వాపోయారు. తమ నేత అమాయకుడని, చంద్రబాబులాగా ఎత్తుగడలు వేయలేడని, అందుకే తమను ఆడుకుంటున్నారని ఒక నేత అన్నారు. తొందరపడి విలీనం చేసినట్లు వాపోయారు. మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చిరంజీవి కూడా వారి వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తరువాత పీఆర్‌ఎల్‌పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన చిరంజీవి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తమ మద్దతుతోనే ప్రభుత్వం మనగలుగుతోందని అన్నారు. తమ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌లో కలవరం కలిగించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రపంచ దేశాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తున్న వికీలీక్స్ వచ్చే ఏడాది భారత్‌లో సంచలనం సృష్టించనుంది. భారతీయలు స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనం గుట్టురట్టు చేస్తానని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. ప్రస్త్తుతం బ్రిటన్ గృహ నిర్బంధనంలో ఉన్న అసాంజే.. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వీడియో కాన్ఫన్స్ ద్వారా మాట్లాడారు. భారత స్విస్ ఖాతాదారుల సమాచారంకు సంబంధించిన సీడీ తన దగ్గర ఉందని, దీనిని వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని సేకరించి పంపుతున్న రుడాల్ఫ్ ఎల్మర్ తనకు అందించారని తెలిపారు. అయితే ఎల్మర్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని, ఈ సంకట పరిస్థితిలో నల్లధన ఖాతాదారుల పేరును తాను బయటపట్టలేనని తెలిపారు. తమ మనుషుల్ని కాపాడుకోవడమే ఇప్పుడు ముఖ్యమని వ్యాఖ్యానించార. కానీ వచ్చే ఏడాదిలో ఏదో ఒకరోజు కచ్చితంగా భారత నల్లధన ఖాతాదారుల పేర్లు బయటపెడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. కొన్ని దేశాల నిఘా సంస్థలు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని ఈ మెయిల్స్, ఇంటర్‌నెట్ లావాదేవీల సేకరిస్తున్నాయని, అనంతరం వాటిని వాల్‌మార్ట్ లాంటి బడా కంపెనీలకు చేరవేస్తున్నాయని వెల్లడించారు. ఈ పద్ధతిలో సమాచారాన్ని సేకరించే అమెరికాకు చెందిన ఎన్‌టీఆర్‌ఓ(అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) వలే భారత్‌లో కూడా ఓ సంస్థ ఉందని, అది ఇస్లామిక్ ఉగ్రవాదంపై నిఘాపేరిట ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యవస్థలను వాల్‌మార్ట్, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్‌లాంటి కంపెనీలకు ఆర్థిక సమాచారాన్ని సమకూర్చి పెట్టేందుకే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పవన్‌కళ్యాణ్ చిత్రం వస్తోందంటే అందరిలోనూ ఆసక్తే. రాబోయే ‘పంజా’ చిత్రానికైతే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కారణం ఈ చిత్రంలో ఆయన విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తుండటమే. ప్రస్తుతం నిర్మాణమవుతున్న క్రేజీ హీరోల చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్‌తో టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో తెరకెక్కిన ‘పంజా’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపుగా యాభై కోట్ల బిజినెస్ జరుపుకోవడం తెలుగు చిత్ర పరిక్షిశమలో సంచలనంగా మారింది. 
ఈ మధ్యకాలంలో దేశాన్ని వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో, సామాన్యుడి ఊహకందని రేంజ్‌లో లక్షల కోట్ల రూపాయాల కుంభకోణాలు వెలుగుచూశాయి. 2జీ నుంచి ఓటుకు నోటు వరకు అన్నీ ప్రజల్లో గుబులు రేపిన కుంభకోణాలే. ఆ వివరాలు..
యూపీఏ-1 ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కడం కోసం ఎంపీలను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచిందని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నోట్ల కట్టలు ప్రదర్శించడంతో సంచలనం సృష్టించింది. ఈ స్కాంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర విజిపూన్స్ కమిషనర్‌గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడం కూడా కేంద్రంలోని యూపీఏ సర్కారును తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. కేరళలో పామోలిన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజే థామస్‌ను సీవీసీగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన దిగిపోక తప్పలేదు. ఇది కేంద్రానికి ఎదురుదెబ్బగా మారింది.
ముంబైలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ్ సోసైటీలో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ, ఆర్మీ అధికారులు ప్లాటు పొందడం కోసం నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ స్కాం దెబ్బతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రతిష్ఠాత్మక కామన్ క్రీడల నిర్వహణ విషయంలో ఆది నుంచి అక్రమాలు వెలుగుచూశాయి. చివరి క్షణం వరకు పనులు కొనసాగడం, వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు, అసలు క్రీడలు సజావుగా జరుగుతాయా అన్న ఉత్కంఠ మధ్య.. ఎలాంటి అవాంతరం లేకుండా ఈ క్రీడలు ముగిశాయి. అయితే కామన్ క్రీడల నిర్వహణలో జరిగిన ఎన్నో అక్రమాలు వెలుగుచూడడంతో కామన్ క్రీడల చైర్మన్ సురేశ్ కల్మాడీ జైలు పాలయ్యారు. మరికొందరు నిర్వాహకులు కూడా అరెస్టయ్యారు.






















