పడగొడితేనే తెలంగాణ
- కిరణ్ సర్కారును కూల్చాల్సిందే.. అప్పుడే యూపీఏకు సెగ తాకేది
- నేడు నిరసన ప్రదర్శనలకు రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్ పిలుపు
ఇది మోసం చేసిన సర్కారు! తెలంగాణ ఇస్తామని చెప్పి.. మాట మార్చిన ద్రోహుల ప్రభుత్వం! తెలంగాణ రావాల్నంటే ఈ సర్కారు పోవాలె! సర్కారు కూలితేనే కేంద్రంలో సెగ తగులుద్ది! తెలంగాణ సెగ తగిలితేనే కేంద్రం దిగి వస్తుంది! మన రాష్ట్రం మనకు ఇస్తుంది! ఇదీ తెలంగాణలో మెజార్టీ ప్రజల అభివూపాయం! నేడు అసెంబ్లీలో చర్చకు, ఓటింగ్‌కు రానున్న అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తమ ప్రాంత ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు చూపిన మార్గం! అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు చేయాల్సిందేమిటి? ప్రభుత్వం ఉండాలా? కూలిపోవాలా? దీనిపై జనం ఏమనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఈ అంశాలు తెలుసుకునేందుకు తెలంగాణలోని పది జిల్లాల్లో టీ న్యూస్ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో నూటికి 80 శాతం మంది సర్కారు పడిపోవాలనే కోరుకున్నారు. ఇటీవల 42 రోజుల పాటు సమరోత్సాహంతో జరిగిన సకల జనుల సమ్మెను ఈ సందర్భంగా అనేక మంది గుర్తు చేశారు. మలి విడత ఉద్యమంలో వివిధ వీరోచిత ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతున్న ద్రోహచింతనలకు నిరసనగా 700 మంది యువత తృణవూపాయంగా అర్పించిన బలిదానాలను ప్రస్తావించారు. ఇంత తీవ్ర స్థాయిలో జనం తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లడించినా.. రాష్ట్రంలో కిరణ్ సర్కారుగానీ, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంగానీ తెలంగాణపై నిర్దిష్ట హామీ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు తమ ఓటు వేసే ముందు ఈ అభివూపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రభుత్వమంటూ వారు అవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ తరఫున అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు.. తమ ఆకాంక్షను నెరవేర్చాలని విన్నవించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఇదే అభివూపాయం వ్యక్తం కావడం విశేషం. తెలంగాణ అంశానికి తోడు.. ప్రజా సమస్యల పరిష్కారంలో, రైతుల కష్టాలు కడతేర్చడంలో కూడా కిరణ్ సర్కారు విఫలమైందని, కనుక ఆ సర్కారుకు అధికారంలో కొనసాగే అర్హత లేదని వాదించిన వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్యేలందరూ చిత్తశుద్ధి చాటుకునే సమయం ఆసన్నమైందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు పలకాలని ఆయన హితవు పలికారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు వచ్చే సమయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపైఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఇదే విషయంలో టీఆర్‌ఎస్ సైతం తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News.Assembly
0 comments:
Post a Comment