తేల్చిచెప్పిన తెలంగాణ ప్రజ
తేల్చిచెప్పిన తెలంగాణ ప్రజ
- మాట తప్పిన ప్రభుత్వంపై జనాక్షిగహం
- కిరణ్ సర్కారును పడగొడితేనే తెలంగాణ
- అప్పుడే యూపీఏకు ‘ప్రత్యేక’ సెగ తాకేది
- 80 శాతం జనం కూల్చివేతకే సై
- ఎమ్మెల్యేలంతా అవిశ్వాసానికి మద్దతివ్వాలి
- 700 బలిదానాలను గుర్తు చేసుకోవాలి
- సకల జనుల త్యాగాలను స్ఫురణకు తెచ్చుకోవాలి
- ప్రజా ఆకాంక్షలను మదిలో ఉంచుకోవాలి
- ‘టీ న్యూస్’ సర్వేలో తేల్చి చెప్పిన తెలంగాణ ప్రజ
- ధరలు, రైతుల కష్టాలూ ప్రస్తావన
: శాసన సభలో అవిశ్వాసనికి అనుకూలంగా తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని గద్దేదింపాలని ప్రజలు కోరుకుంటున్నారు. సోమవారం అంసెబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్న సందర్భంగా తెలంగాణ ప్రజల మనోగతం తెలుసుకునేందుకు ఆదివారం ‘టీన్యూస్’ బృందం ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలా లేక వ్యతిరేకంగానా అనే అంశంపై ప్రతి నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి 200 మందిని సర్వే నిర్వహించింది. దీనికి 80 శాతం మందికిపైగా ప్రజలు సర్కారును కూల్చాలని అభివూపాయపడ్డారు. అలా అయితేనే కేంద్రానికి సెగ తగిలి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2,400 మంది అభివూపాయాన్ని సేకరించగా 1,909 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఓటు వేయాలని అభివూపాయపడ్డారు. 491మంది కిరణ్ సర్కార్‌ను కొనసాగించాలని కోరుతున్నారు. తెలంగాణపై యూపీఏ సర్కార్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి లేక పోవడం, ఇటీవల 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ ఆకాంక్షను ప్రజలు బలంగా వినిపించినా అసెంబ్లీలో రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానం చేయకపోవడంతో ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారును కూల్చితే కేంద్రానికి సెగ తగిలి తెలంగాణ ప్రకటిస్తుందని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 2,200 మందిని సర్వే చేయగా ఇందులో 80.7 శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కూల్చాల్సిందేనని చెప్పారు. మిగిలిన 19.3 శాతం మంది ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల ఒరిగేదేమి లేదన్నారు.
అయితే ఈ అభివూపాయాన్ని వెలిబుచ్చిన వారిలో ఎక్కు వ శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సానుభూతిపరులే ఉండటం గమనార్హం. మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 2 వేల మందిని టీన్యూస్ పలకరించగా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని 1,715 మంది, వ్యతిరేకంగా ఓటెయ్యాలని 285 మంది అభివూపాయ పడ్డారు. అవిశ్వాసానికి మద్దతుగా ఉండాలని 85.75 శాతం మంది, వ్యతిరేకంగా ఉండాలని 14.25 శాతం మంది సూచించారు. సీమాంధ్ర సర్కారు కూలితే తెలంగాణ వచ్చి తీరుతుందని కొందరు, ధరలు అదుపులో పెట్టలేని ప్రభుత్వమెందుకని మరికొందరు అభివూపాయ పడ్డారు. ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 2 వేల మందిని కదిలిస్తే 1,518 మంది రాష్ట్ర సర్కారును తక్షణం కూల్చాల్సిందేనని అభివూపాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలో పదింటిలో తొమ్మిది నియోజకవర్గాల్లో 1,800 మందిని ప్రశ్నించినప్పుడు 1,624 మంది అవిశ్వాసానికి అనుకూలంగా, 176 మంది వ్యతిరేకంగా స్పంధించారు. తెలంగాణ రావాలంటే ఈ సర్కార్ పడిపోవాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. విశేషమేమంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఆసిఫాబాద్, నిర్మల్‌లోనూ అవిశ్వాసానికి అనుకూలంగానే ప్రజలు స్పంధించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజీనామా చేసినందున సర్వే చేయలేదు. కరీంనగర్ జిల్లాలో వేములవాడ నియోజకవర్గం మినహా అన్ని చోట్లా సర్వే చేయగా, మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న మంథనిలో, కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో నూటికి నూరుశాతం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలనే అభివూపాయం వ్యక్తమైంది.
12 నియోజకవర్గాల్లో 2,400 మందిని ప్రశ్నించగా ప్రభుత్వాన్ని కూల్చాలని 2,167 మంది, 233 మంది కొనసాగించాలన్నారు. 90.3 శాతం మంది సర్కారును కూల్చితేనే తెలంగాణకు మార్గం సుగమమవుతుందని అభివూపాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 89.27 శాతం ప్రజ లు అనుకూలంగా 9.85 శాతం వ్యతిరేకంగా 5.87 శాతం తటస్థంగా తమ అభివూపాయా లు వెల్లడించారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గానూ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌డ్డి ఆకస్మిక మృతి చెందారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం, కొల్లాపూర్ ఎమ్మెల్లే జూపల్లి కృష్ణారావు రాజీనామా చేశారు. మిగిలిన 11 చోట్ల సర్వే చేయగా 89.27 శాతం మంది కూల్చాలని అభివూపాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేయాలని మెజార్టీ జనం అభివూపాయపడ్డారు.
1,600 మందిని కలిసి అభివూపాయాలు సేకరించగా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని 90.31 శాతం మంది, 9.69 శాతం మంది ప్రజలు ప్రతికూలంగా స్పందించారు. జుక్కల్, బాన్సువాడలో వందకు వంద శాతం మంది అవిశ్వాసానికి ఓటు వేయాలని అభివూపాయపడ్డారు. రంగాడ్డి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 200 మందిచొప్పున 1,400 మందిని ప్రశ్నించగా కూల్చాలని 924, 551 మంది కొనసాగించాలని, 25 మంది తటస్థంగా సమాధానమిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎమ్మెల్యేలు ఓటు వేయాలని గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మెజార్టీ ప్రజలు కోరారు. ఏడాది పాలనలో సీఎం కిరణ్ చేపట్టిన అభివృద్ధి ఏమీ లేకపోగా, ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తూ మభ్యపె ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
22 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా మెజార్టీ ప్రజలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎమ్మెల్యేలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ కోసం ఎప్పుడైతే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో అప్పుడే ప్రభుత్వం కూలిపోయిందని అభివూపాయపడ్డారు. కేవలం అంకెల గారడీ, సాంకేతిక కారణాలతోనే కిరణ్ సర్కారు కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News.Assembly
0 comments:
Post a Comment