మూడో వన్డేలో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 244 పరుగులకే అలౌట్ అయ్యింది.
సెహ్వాగ్ 0, గంభీర్ 0 డకౌట్‌గా అవుట్ అయ్యారు. కోహ్లీ 20 పరుగులు చేసి నిరాశపరిచాడు.
ఓపెనరు పార్థివ్ పటేల్ 35 బంతులల్లో ఏడు ఫోర్లు సహాయంతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రైనా 2, జడేజా 11, అశ్విన్ 31, వినరు కుమార్ 3, మిథ్యున్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
రోహిత్ శర్మ 100 బంతులల్లో ఒక సిక్స్, పది ఫోర్ల సహయంతో 95 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
వెస్టిండీస్ బౌలింగ్‌లో రాంపాల్ నాలుగు వికెట్లు తీశాడు. శ్యాముల్స్ , రోచ్ చెరో ఒక వికెట్లు లభించింది.
అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 50 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
శ్యాముల్స్ 58, రామ్‌దిన్ 38, బ్రావో 28, పోలార్డ్ 29 పరుగులు చేశారు. చివరిలో రస్సెల్, సమీ ఇద్దరు వేగంగా పరుగులు సాధించారు. రస్సెల్ 18 బంతులల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు సహయంతో 40 పరుగులు చేశాడు. సమీ 17 బంతులల్లో రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లు సహయంతో 41 పరుగులు చేశారు.
భారత బౌలింగ్‌లో వినరు కుమార్ రెండు వికెట్లు తీశాడు. యాదవ్, మిథ్యున్ , అశ్విన్ చెరో వికెట్లు లభించింది.
Tags: West Indies' tour of India,
0 comments:
Post a Comment