త్వరలో ఎంఈవోల నియామకం
-ఖాళీ పోస్టులలో 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ
-విద్యారంగ సమస్యలపై అవిశ్వాసం పెడితే వ్యవసై్థనా బాగుపడేది -మంత్రి పార్థసారథి
హైదరాబాద్, డిసెంబర్ 4 (): టీడీపీ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానమేదో.. విద్యారంగ సమస్యలపై పెడితే విద్యావ్యవసై్థనా బాగుపడేదని మాధ్యమిక పాఠశాల విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. ఆదివారం ఆయన మండలిలో ప్రాథమిక విద్యపై జరిగిన స్వల్పకాల చర్చ సందర్భంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై సభ్యులతో విస్తృతంగా చర్చ జరిపారు.
విద్యారంగానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించి, ఎన్ని సౌకర్యాలు కల్పించినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కోర్టు కేసులు అడ్డొస్తున్నాయని ఆే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలు మాత్రమే విద్యను అభ్యసిస్తుండటంతో గ్రామపెద్దలు గతంలో మాదిరిగా పాఠశాలలో సమస్యలను తెలుసుకోవడం లేదని, దీంతో సమస్యలు పెరిగిపోతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు.
వికలాంగ విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రభుత్వం ర్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేస్తామని, ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి 2012 నుంచి 10 శాతం నిధులను పెంచనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులలో 30 శాతం పోస్టులను నేరుగా ఏపీపీఎస్సీ ద్వారా నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాలకు అభ్యర్థుల కొరత ఉన్నందున ఆ పోస్టులను డీ రిజర్వేషన్ ద్వారా భర్తీ ే యడానికి యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సహకరించాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు.
అనంతరం ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోనే ప్లేస్కూళ్ళను నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 18 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు సక్రమంగా వెళ్ళడం లేదనే విషయం తమ విచారణలో తేలిందని, దీంతో పాఠశాలల్లో ఫలితాలు తగ్గుతున్నట్లు తెలిపారు.
Take By: T News
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, MEO, MEO Jobs,
0 comments:
Post a Comment