కిరణ్ సర్కారు గెలిచింది
- అసెంబ్లీలో 17 గంటల పాటు సుదీర్ఘ చర్చ
- బొత్స వ్యాఖ్యలతో అర్ధరాత్రి రచ్చ
- డివిజన్ ఓటింగ్‌తో ఫలితంపై ఉత్కంఠ
హైదరాబాద్, డిసెంబర్ 5 (): అంతా అనుకున్నట్లే అయింది! ఊహించినట్లే సర్కారు గెలిచింది. ప్రతిపక్షం అనుకున్న సంఖ్యతోనే మిగిలింది! జగన్ వర్గం తన 18 మంది ఎమ్మెల్యేలను నిలుపుకొంది. కిరణ్ సర్కారుపై టీడీపీ ప్రవేశపెట్ట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రాష్ట్ర ప్రజలందరిలో తీవ్ర ఉత్కంఠ కలిగించి.. కొన్ని పార్టీల్లో అలజడులు రేపిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో నల్లారివారి ప్రభుత్వం నల్లేరుపై నడకలా విజయం సాధించింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 122 ఓట్లు, వ్యతిరేకంగా 160 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా నిలిచారు. ముగ్గురు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జగన్ వర్గానికి మద్దతుగా 18 మంది నిలబడ్డారు.
చర్చ అనంతరం జరిపిన ఓటింగ్ ఫలితాలను అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40గంటల సమయంలో స్పీకర్ మనోహర్ ప్రకటించారు. జగన్‌కు మద్దతు ప్రకటించిన వారిలో కాంగ్రెస్ నుంచి 16 మంది, పీఆర్పీ, టీడీపీల నుంచి చెరొకరు విప్‌లను ఉల్లంఘించిన కారణంగా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జగన్ వర్గానికి చెందిన పూతలపట్టు రవి ఓటింగ్‌కు ముందే గైర్హాజరయ్యారు. స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. లోక్‌సత్తాకు చెందిన ఏకైక సభ్యుడు జయవూపకాశ్‌నారాయణ్ తటస్తంగా ఉన్నా రు. టీడీపీ తిరుగుబాటు ఎ మ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, వేణుగోపాలచారి కూడా అవిశ్వాసానికి మద్దతు పలికారు.
విదేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే చెన్నమనేని రమేష్ అనారోగ్య కారణాలతోనూ, ఎంఐఎంకు చెందిన ముంతాజ్‌అహ్మద్‌ఖాన్ అమెరికాలో ఉన్నందున సభకురాలేదు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన స్పీకర్ ఓటు వేయాల్సిన అవసరం రాలేదు. ఇరు పక్షాలకూ సమాన సంఖ్యలో ఓట్లువచ్చినప్పుడు మాత్రమే స్పీకర్ తన ఓటును వినియోగించుకుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏకైక సభ్యురాలు వైఎస్ విజయమ్మ తొలిసారిగా సభకు హాజరై అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. పీఆర్పీ నేత చిరంజీవి విప్ జారీ చేసినప్పటికీ ఆ పార్టీకి చెందిన శోభా నాగిడ్డి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాగా కాంగ్రెస్ సభ్యులు 16 మంది కూడా పార్టీ విప్‌ను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ సభ్యురాలు సుమన్ రాథోడ్ కోర్టు కేసు కారణఁగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.
విప్ ధిక్కరించిన వారిపై చర్యలు
పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 16 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటుకు సిద్ధమవుతోంది. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. దాదాపు 16 గంటలు కొనసాగిన ఐదోరోజు సమావేశం.. అర్థరాత్రి దాటిన తర్వాత ... గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని అన్ని సమస్యలనూ ప్రస్తావనకు తెచ్చిన చర్చ.. తెలంగాణ అంశంపైనా కీలకంగానే సాగింది. టీఆర్‌ఎస్ నేతలు ప్రస్తావించిన అంశాలపై టీడీపీ, కాంగ్రెస్‌లు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఆరోపణలు.. పత్యారోపణలు, వాగ్వాదాలు.. వాగ్యుద్ధాలు, చురకలు.. ఎద్దేవాలతో సకల కళావల్లభంగా సాగిన అసెంబ్లీలో చర్చ.. ఆద్యంతం వాడివేడిగా, రసవత్తరంగా సాగింది. సాయంత్రం తర్వాత సభలో వాతావరణం క్రమంగా వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పీఆర్పీ ఎమ్మెల్యే కన్నబాబు- టీడీపీ ఎమ్మెల్యేలు, విజయమ్మ-బొత్స-టీడీపీ ఎమ్మెల్యేలు, హరీష్‌రావు-మంవూతులమధ్య ఉద్వేగభరితంగా, హాట్‌హాట్‌గా జరిగిన సంభాషణలు సభను మరింత వేడెక్కించాయి.
అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం సమాధానం చెప్పి, ఓటింగ్‌కు వెళ్లే చివరి దశలో తీవ్ర దుమారం రాజుకుంది. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన పై వచ్చిన ఆరోపణలపై హైకోర్టుకు వెళ్ళడంలో ఔచిత్యం లేదని రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు తనకు అవిశ్వాస తీర్మానం చివర్లో మాట్లాడే హక్కు ఉందని చెబుతూ ప్రసంగిస్తుండగా, మధ్యలో బొత్సకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. పైగా బొత్స పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఈ దశలో బాబుకు తిరిగి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి స్పీకర్‌ను డిమాండ్ చేశారు.
సభలో ప్రశాంత పరిస్థితి లేకుంటే తాను ఓటింగ్ నిర్వహిస్తానని స్పీకర్ చెప్పడంతో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. బొత్స వైఖరిని ఖండిస్తూ, ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని గర్హిస్తూ స్పీకర్‌తో వాదనకు దిగారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి అధిక సమయమే శాసనసభ ఇతర కార్యక్షికమాలు చేపట్టకుండానే చాలా సేపు స్తంభించి పోయింది. సభ్యులు స్పీకర్ పొడియం వద్దనే ఎక్కువ సమయం నిలబడ్డారు. చివరకు చంద్రబాబుకు అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పడంతో తిరిగి వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. గందరగోళ పరిస్థితుల తరువాత చంద్రబాబు తిరిగి ప్రసంగం ప్రారంభించి తనకు రైట్ టూ ఆన్సర్ కింద ప్రతిపక్ష నేతగా అవిశ్వాస తీర్మానం చివరలో మాట్లాడే హక్కును ప్రస్తావిస్తూ .. తాను మాట్లాడే సమయంలో మరోకరికి అవకాశం ఇవ్వరాదని చెబుతున్నా స్పీకర్ బొత్సకు అవకాశం ఇవ్వడంలో ఔచిత్యం లేదన్నారు.
ఆ తరువాత సభ సద్దుమణగడంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు ప్రసంగించారు. బాబు ప్రసంగం ముగిసిన తరువాత ఓటింగ్ జరగాల్సి ఉండటంతో కచ్చితంగా అర్ధరాత్రి 12 గంటల తరువాత సభ్యులు అందరు వచ్చి సీట్లో కూర్చొనడంతో సభ నిండుగా కనిపించింది. అవిశ్వాస తీర్మానంపై సభ చర్చ ముగిసి ఓటింగ్ జరిగి ఫలితాలు ప్రకటించే వరకు సభ్యులు అందరు తమ స్థానాల్లో హత్తుకు పోయారు. చంద్రబాబు తాము ఎందుకు అవిశ్వాసం పెడుతున్నామో అంశాల వారీగా వివరించిన తర్వాత చివరకు ఒంటిగంట సమయంలో స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై డివిజన్ ఆఫ్ ఓట్ నిర్వహించారు. ఇందులో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 122 మంది లేచి నిలబడ్డారు. తీర్మానానికి వ్యతిరేకంగా 160 మంది నిలిచారు. ఒకరు తటస్తంగా ఉండగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. సభను వాయిదా వేసి సమావేశాలను ముగించారు.
ఉత్కంఠ రేపిన జగన్ వర్గం
ఓటింగ్ సమయానికి జగన్ వర్గం ఏ వైఖరి తీసుకుంటుందన్నది చివరి క్షణం వరకూ సస్పెన్స్‌గానే ఉంది. అయితే.. జగన్‌కు మద్దతు పలికిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పీఆర్పీ నుంచి శోభానాగిడ్డి, టీడీపీ నుంచి ఉన్నారు. మొత్తంగా వీరి సంఖ్య 18కి చేరుకుంది. నిజానికి ఉదయం వైఎస్ జగన్ నివాసం నుంచి 19 మంది ఎమ్మెల్యేలు విజయమ్మ నాయకత్వంలో అసెంబ్లీకి వచ్చారు. వీరిలో పూతలపాటి రవి ఒక్కరే గైర్హాజరయ్యారు. దీంతో సోమవారం రాత్రి దాకా కాంగ్రెస్ పెద్దలు కేవీపీ తదితరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అర్థమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి మరింత మంది తమవైపు వస్తారని జగన్ వర్గం చెప్పినా.. ఆ పరిస్థితి కనిపించలేదు. చివరి రోజు కూడా కేవీపీతో పాటు కొందరు నేతలు అసెంబ్లీ లాబీలో మకాం వేసి జగన్ వర్గం ఎమ్మెల్యేలతో చివరి ప్రయత్నాలు చేశారు. ‘ఆలోచించుకోండి. డివిజన్ ఓటింగ్ ఉంటుంది కనుక, విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుంది’ అని కూడా కేవీపీ, ఇతర కాంగ్రెస్ నేతల నుంచి పరోక్షంగా హెచ్చరికలు వెళ్ళాయి.
అయినా కొందరు ఎమ్మెల్యేలు తాము జగన్ వెంటే ఉంటామని కేవీపీకి స్పష్టం చేసి వెళ్లిపోయారు. అయితే.. అప్పటికే తమకు 163 మంది బలం ఉందని, ఎలాంటి ఢోకా ఉండబోదని నిర్ధారణకు వచ్చిన పాలకపక్షం అంతటితో తన ప్రయత్నాలకు పుల్‌స్టాప్‌పెట్టింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆయా పార్టీల సభ్యులు, పాలక పక్షం వ్యవహరించిన తీరుతో శాసన సభ విలువలు మరింత దిగజార్చాయని వినిపించింది. సభ్యులకు ప్యాకేజీలు ఆఫర్ ఇచ్చిన విషయం సభలో చర్చకు వచ్చింది. ఆయా పార్టీలు ఎమ్మెల్యేలతో బేరాసారాలు కొనసాగించాయనే ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో స్పీకర్ సైతం కల్పించుకుని మన సభ్యులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని సభ్యులకు హితవు పలికారు.
జగన్‌కు వెన్నుదన్నుగా 18 మంది
సభకు హాజరైన విజయమ్మ
జగన్ వర్గం ఎమ్మెల్యేలు:
విజయమ్మ, ప్రసాద్‌రాజు, బాలినేని శ్రీనివాస్‌డ్డి, పిల్లి సుభాష్‌చంవూదబోస్, బాలరాజు, శ్రీకాంత్‌డ్డి, రామకృష్ణాడ్డి, బాబురావు, కొండా సురేఖ, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్‌డ్డి, గురునాథ్‌డ్డి, అమర్‌నాథ్‌డ్డి, ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంవూదాడ్డి, శ్రీనివాసులు, చెన్నకేశవడ్డి, బాలనాగిడ్డి(టీడీపీ), శోభానాగిడ్డి(పీఆర్పీ).
అవిశ్వాసానికి ...
అనుకూలం 122
వ్యతిరేకం 160
తటస్థం 1, గైర్హాజరు 3, ఖాళీలు 7, ఓటింగ్‌కు అర్హత లేని టీడీపి సభ్యురాలు 1
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, Krirankumar Reddy, CM,
0 comments:
Post a Comment