బాబు X నల్లారి (Chandrababu Vs Kirankumar Reddy (CM))
మీరు జాక్‌పాట్ సీఎం..
సోనియా దయతో వచ్చారు
కిరణ్‌పై చెలరేగిన చంద్రబాబు
మామకు వెన్నుపోటు పొడిచింది
మీరు.. కౌంటరిచ్చిన కిరణ్‌కుమార్
ఏకవచనంతో బాబును
సంబోధించిన సీఎం
అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష నేత
ఉపసంహరించుకున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ డిసెంబర్ 5 (): ఆ ఇద్దరూ సభలో కీలక నేతలు. ఒకరు అధికార పక్షానికి నాయకత్వం వహిస్తుంటే.. మరొకరు ప్రతిపక్షానికి సారథ్యం వహిస్తున్నారు. ప్రతి మాటలోనూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన వీరు.. సోమవారం నాడు అసెంబ్లీలో నోరుజారారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. వ్యక్తిగత విమర్శలకూ దిగారు. కుటుంబాల ప్రస్తావనలూ తెచ్చుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఈ సందర్భంలోనే పాలకపక్ష, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలతో గందరగోళం ఏర్పడింది.
రైతులకు కావాల్సిన గిడ్డంగులు కూడా నిర్మించలేనివాళ్లు మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, ప్రతిపక్ష నేత గందరగోళంలోనే తన దాడిని కొనసాగించారు. హైదరాబాద్‌లో చదువుకున్న ముఖ్యమంవూతికి వ్యవసాయం, రైతుల బాధలు తెలియవని, తాను పల్లెటూరులో పుట్టి పెరిగానని, 203 కిలోమీటర్లు పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించానని చెప్పారు. తాను ముఖ్యమంవూతిగా ఉన్న కాలంలో ఇంత అసమర్థంగా ఏనాడూ వ్యవహరించలేదని చెప్పారు. కొద్దిసేపు మౌనంగా ఉన్న సీఎం.. ఆ తర్వాత ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు. సవాళ్లన్నింటికీ ప్రతిసవాళ్లు విసిరారు. ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. వేగంగా అసెంబ్లీలోని తన స్థానానికి చేరుకున్నారు.
చంద్రబాబు మాటలకు కౌంటర్‌లు ఇస్తూ సభను రసవత్తరంగా మార్చేశారు. చివరికి వారి జిల్లా రాజకీయాలపై కూడా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఒక పెద్ద జోక్‌గా మారిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము ముఖ్యమంవూతిపైనే కాకుండా మొత్తం మంత్రుల మీద అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీనికి స్పందించిన కిరణ్.. తమకు ప్రజల విశ్వాసం ఉందని, చంద్రబాబు విశ్వాసం అవసరం లేదని తిప్పికొట్టారు. పాలనా యంత్రాంగంపై చంద్రబాబు పలు విమర్శలు చేయగా.. తీవ్ర ఆగ్రహ స్వరంతో స్పందించిన కిరణ్.. లెక్కలు చూసుకుందామా? అంటూ సవాలు విసిరారు. దీనికి చంద్రబాబు కూడ అంతే స్థాయిలో ప్రతిస్పందించారు.
వారి సంవాదం ఇలా నడిచింది.
చంద్రబాబు: వ్యవస్థలు మొత్తం కుప్పకూలాయి. రచ్చబండ కార్యక్షికమం జరిగితే ఈ కార్యక్షికమంలో కిరణ్‌కుమార్‌డ్డి తమ్ముడు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్షికమంలో పాల్గొనడానికి ఆయనకేం హక్కు ఉంది? కిరణ్ రాజ్యాంగేతర శక్తిగా మారారు.
కిరణ్: అధ్యక్షా.. ఆ జిల్లాతో మాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మా కుటుం బం మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే ఆయన పాల్గొన్నారు. అందులో ఏం తప్పో నాకైతే అర్థం కావడం లేదు.
చంద్రబాబు: ఇంత బాహాటంగా కప్పిపుచ్చుకోవడం దౌర్భాగ్యం అధ్యక్షా. అందరికీ కుటుంబాలు ఉంటాయి. సీఎం మాటలు పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఎవరి కుటుంబమైనా రచ్చబండలో పాల్గొన్నదా? లేదే! డబ్బులు వసూళ్లు చేయడానికి తన తమ్ముడిని ఉపయోగించుకుంటున్నారు అధ్యక్షా.
కిరణ్: నీలా గెలిచి పీఏకు నియోజకవర్గాన్ని అప్పగించి మేం రాం. కుప్పం ప్రజలు మంచివాళ్లు గనుక నిన్ను రెండుసార్లు గెలిపించారు. చావుకైనా, పెళ్లికైనా పీఏనే పోతాడు కనుక ప్రజల సమస్యలు ఆయనకెలా తెలుస్తాయి అధ్యక్షా!
చంద్రబాబు: అధ్యక్షా. ముఖ్యమంవూతికి ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేదు. ఏకవచనంతో పిలుస్తున్నారు. ముఖ్యమంవూతిగారు అసహనంలో ఉన్నారు. ఆయనకు హుందాతనమే లేదు.
కిరణ్: సరే అధ్యక్షా.. ‘నిన్ను’ అనే మాటలను ఉపసంహరించుకుంటున్నా. కానీ చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సరైనవి కావు.
చంద్రబాబు: నాడు వైఎస్8ఆర్ సీఎంగా ఉన్నప్పడు ఆపరేషన్ ఆకర్ష్ పెడితే నేడు కిరణ్ ఆపరేషన్ స్వగృహ పెట్టారు. ప్యాకేజ్‌లు ఇస్తున్నారు. ఈ ప్యాకేజీలు రైతులకు ఇస్తే సమస్యలు ఉండనే ఉండవు. సీఎం ఢిల్లీకి పోయినప్పుడు కూడా తన తమ్ముడిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టుకుంటున్నారు. రాజ్యాంగేతర శక్తులుగా మారారు.
కిరణ్: అధ్యక్షా ఇందాకే హుందాతనం గురించి బాబు మాట్లాడారు. చంద్రబాబులా మాట్లాడాలంటే ముందు ఆయన హైకోర్టులో ఆస్తుల విచారణపై స్టే తెచ్చుకోకుండా ఉండాలి. డబ్బులు వసూలు చేసే సంస్కృతి మీది. నీ గురించి విప్పానంటే ఇక్కడుండడు అధ్యక్షా.
చంద్రబాబు: ఇలాంటి మాటలు చాలానే చూశాను అధ్యక్షా. ఆయనగారి తండ్రిని నేనే చిత్తు కింద ఓడించాను. అయన చూసుకుని మాట్లాడాలి.
కిరణ్ : మీరా చంద్రబాబు నాయుడు మా తండ్రిని ఓడించింది? ఎప్పుడు? ఎక్కడ? నా తండ్రి భిక్షతో ఈ రోజు అసెంబ్లీలో ఉన్నావ్. ఇప్పుడు తాతకు దగ్గులు నేర్పుత్నుట్లు వ్యవహరిస్తున్నారు. పుట్టినిల్లు గుట్టు మేనమామకు తెలియదా అన్నట్లు నీ గురించి మొత్తం తెలుసు మాకు. మీ పార్టీ మాజీ జడ్పీ చైర్మన్ కూడా మా పార్టీలో చేరిపోయారు. మీ పని అయిపోయింది.
చంద్రబాబు: సోనియా దయాభిక్షతో కిరణ్‌కు సీఎం పదవి వచ్చింది. ఎమ్మెల్యేలందరూ ఏకక్షిగీవంగా ఎన్నుకోలేదు. సీల్డుకవరుతో ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చారు. మీరు జాక్‌పాట్ సీఎం. సోనియా కాళ్లు పట్టుకొని పదవిని పొందారు. ఢిల్లీ పెద్దలు అంగీకరించకుంటే మనుగడ సాగించలేరు. ఇది చేతగాని, వెన్నెముకలేని ప్రభుత్వం. చేష్టలుడిగిన పాలకులు. స్వతంవూతంగా వ్యవహరించలేరు. వీరి హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మాత్రం రాష్ట్ర ప్రజలే. సీఎం తాను స్వతంవూతంగా వ్యవహరించగలుగుతున్నానని చెప్పగలరా?
కిరణ్ : నా కుటుంబం (కిరణ్, ఆయన తండ్రి అమరనాథ్‌డ్డి) 1962 నుంచి కాంగ్రెస్8 తరఫున 12 సార్లు ఎన్నికల్లో గెలిచింది. నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సోనియా గాంధీ దయ ఉంది. మీరు మీ మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి పద్ధతుల్లోనే నాకు సీఎం పదవి వస్తే దాన్ని ఫుట్‌బాల్‌ల తన్నిపారేసేవాడిని. ఇందిరాగాంధీ దయాభిక్షతో టిక్కెట్టు దక్కించుకొని, కాంగ్రెస్8 పార్టీ టిక్కెట్టుపై గెలిచి కాంగ్రెస్8కు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు రాజకీయ చరివూతంతా వెన్నుపోటు చరిత్రే. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడంతో పాపం మంచి పిల్లవాడనుకొని ఎన్టీ రామారావు పిల్లనిస్తే, 1996 వచ్చేసరికి పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అక్రమపద్దతిలో ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చారు.
చంద్రబాబు: నేను నా స్వంతంగా నాయకుడిగా ఎదిగాను. నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఆనాడున్న రాజకీయ పరిస్థితులలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కలిసి నన్ను శాసనసభా పక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు. ఆ క్రమంలోనే నేను ముఖ్యమంవూతినయ్యాను. 1999 ఎన్నికలలో ప్రజల విశ్వాసంతో గెలిచాను. మీరు సోనియా దయతో నాయకుడయ్యారు. మీ ప్రభుత్వం పెద్ద జోక్‌గా మారింది.
కిరణ్ : మీరు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. మీకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, AP Assembly, Chandrababu, Kirankumar Reddy, CM,
0 comments:
Post a Comment