గెలుపు ఖాయమైనా.. తగ్గిన మెజారిటీ
మాస్కో , డిసెంబర్ 5: రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వలోని ‘యునైటెడ్ రష్యా’ పార్టీకి అక్కడి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 50 శాతంపైన ఓట్లు లభించినప్పటికీ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ పార్టీ భారీస్థాయిలో మెజారిటీ కోల్పోయింది. ఇప్పటివరకు 88 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి యునైటెడ్ రష్యా పార్టీకి కేవలం 50.2 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. 2007లో ఆ పార్టీకి దక్కిన 64 శాతం ఓట్లకన్నా ఇది చాలా తక్కువ. ఇక 19.12 శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ (కేపీఆర్‌ఎఫ్) ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరసగా ఏ జస్ట్ రష్యా పార్టీ (13.02 శాతం ఓట్లు), లిబరల్ డెమోక్షికటిక్ పార్టీ ఆఫ్ రష్యా (11.66 శాతం ఓట్లు) ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష పదవికి పోటీపడబోతున్న పుతిన్‌పైగల ప్రజాదరణకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
Take By: T News
Tags: Telangana News, AP News, Political News, Hyderabad News, News,Putin, Russia, Russia Election
Tags: Telangana News, AP News, Political News, Hyderabad News, News,Putin, Russia, Russia Election
0 comments:
Post a Comment