తగ్గనున్న పెట్రోల్ ధర
- లీటర్‌పై రూ.1.02 తగ్గే అవకాశం
- అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్లనే
న్యూఢిల్లీ, నవంబర్ 28: గడిచిన ఏడాదిన్నరగా వినియోగదారుడిపై పెట్రో భారాలు మోపిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం ధరలు తగ్గించడానికి సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ.1.02 తగ్గే అవకాశం ఉందని చమురు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. పెట్రోల్ ధరలపై ఈ నెల 30న జరిగే సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.66.42. ఈ నెల 16న లీటర్ పెట్రోల్‌పై రూ.2.22 తగ్గించిన విషయం తెలిసిందే. నవంబర్ నెల మొదటి పదిహేను రోజులలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 115.85 డాలర్లు, రెండో పదిహేను రోజులలో బ్యారెల్ ధర 107 డాలర్లకు తగ్గింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పెరిగినప్పటికీ పెట్రోల్ ధరలు తగ్గడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 2010 జూన్‌లో నియంవూతణ ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకొకసారి చమురు కంపెనీలు పెట్రో ధరలపై సమీక్ష జరుపుతున్నాయి. 2009 జనవరి తర్వాత పెట్రో ధరలు తగ్గించడం ఇది రెండొసారి.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News
0 comments:
Post a Comment