Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, November 29, 2011

తెలంగాణ సైదోడు..మెదక్



Medak1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema(- సంగాడ్డి ప్రతినిధి):కాళిదాసు కవిత్వానికి తెలుగులో భాష్యం చెప్పిన కోలాచలం మల్లినాథ సూరి నడయాడిన నేల. సాహితీ చంద్రుడు వేముగంటి నరసింహాచార్యులు, తెలంగాణ జానపద జీవన శైలిని తన కుంచెతో ఒలికించిన కాపు రాజయ్య, లకా్ష్మగౌడ్‌లను కన్న గడ్డ. హైదరాబాద్ స్టేట్‌లో విలీనమయ్యాక సీమాంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన వారికి నగర శివారు ప్రాంతమైన మెదక్ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు లభించాయి. ఇటు జిల్లా జలాలు, అటు ఉద్యోగాలను కోల్పోయిన జిల్లావాసులు ఉపాధి కోసం దేశ, విదేశాలకు వలసపోవలసి వస్తున్నది. మరమగ్గాల కింద నలిగిన చేనేత పరిక్షిశమ ఆదరణ కోల్పోగా వేలమంది రోడ్డునపడ్డారు. యాజమాన్యాల దాష్టీకానికి లక్షలమంది బీడీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. వలస పాలకుల కుట్రలకు బలయి పరిక్షిశమలకు స్థలాలిచ్చి కాలుష్యం పీలుస్తోంది. హక్కుల కోసం మెదక్ జిల్లా నేల తల్లి బిడ్డలు పోరాడుతున్న పరిస్థితి.

రాజకీయ బలాబలాలు
స్వాతంవూత్యానంతరం ఇటు, కమ్యూనిస్టులు, అటు కాంగ్రెస్‌వాదులను ఆదరించిన మెదక్‌వాసులు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో రాజకీయ ముఖచివూతమే మారిపోయింది. తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి గందరగోళంగా మారింది. ఐతే పొత్తుల వ్యవహారంలో టీఆర్‌ఎస్ చిత్తైది. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతిచ్చిన జిల్లా వాసులు 1982లో టీడీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్‌కు చెల్లు చీటీ పలికారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి విజయం అందించారు. ఆ తర్వాత 1985 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీకి భారీ స్థానాలు దక్కాయి. 1994లో జిల్లాలోని స్థానాలన్నీ టీడీపీ, దాని మిత్రపక్షమైన సీపీఐ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాయి.

1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సీట్లు పంచుకున్నాయి. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2001లో సిద్దిపేట స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి టీఆర్‌ఎస్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో 2004 ఎన్నికల్లో పోటీచేసి జిల్లాలో దాదాపు టీడీపీ అడ్రస్ గల్లంతు చేసింది. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్ పొత్తుతో ఎన్నికల్లో దిగినా టీడీపీ చేసిన ద్రోహంతో కాంగ్రెస్ పార్టీ లాభపడింది. అత్యధికంగా 8 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్, టీడీపీ ఒక్కో స్థానంలో గెలిచాయి.

ఉద్యమ ఖిల్లా
తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరుపడ్డ మెదక్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన అరుదైన పోరాటాపూన్నో నమోదయ్యాయి. 1969లో తెలంగాణ కోసం మొదలైన తొలి దశ పోరుకు సిద్దిపేటనే వేదికైంది. మర్రి చెన్నాడ్డితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసిన అనంతుల మదన్‌మోహన్ తెలంగాణ పేరుతో గెలిచిన మొదటి అభ్యర్థిగా రికార్డులకెక్కారు. మలి విడత 2001లో తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభమైంది.

సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ టీడీపీని వీడి 2001లో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించారు. అదే సంవత్సరం జరిగిన ఉపఎన్నికలో ఆయన టీఆర్‌ఎస్ తరపున ఘన విజయం సాధించారు. 2004లో కేసీఆర్ రాజీనామాతో జరిగిన ఎన్నికలో హరీష్‌రావు పోటీచేసి గెలిచారు. 2008, 2010 ఉపఎన్నికల్లో కూడా హరీష్‌రావు తెలంగాణ నినాదంతో గెలిచి రికార్డు నమోదు చేశారు. 2009 నవంబర్‌లో తెలంగాణకోసం కేసీఆర్ సిద్దిపేటలోనే ఆమరణదీక్ష తలపెట్టారు. అప్పుడు ఉద్యమ తీవ్రతకు కేంద్రం స్పందించి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు.

కాంగ్రెస్ గందరగోళం
గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంతో క్షేత్రస్థాయిలో చతికిలపడింది. 1983వరకు పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ అప్పుడు టీడీపీ ఆవిర్భావంతో దెబ్బతింది.2004లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవరకు జిల్లాలో పార్టీ పరిస్థితి అయోమయంగానే ఉండేది. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని తెలంగాణవాదాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఆ తర్వాత అనుసరిస్తున్న విధానాలు జిల్లావాసులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఎణఙమిదిస్థానాలతో పైకి పటిష్టంగా కనిపిస్తున్నా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు కేబినెట్ హోదా కలిగిన వారున్నప్పటికీ ఏ ఇద్దరి మధ్య సయోధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని వెల్లడిస్తున్నది. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికివారేగా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పట్టు కోల్పోతున్నప్పటికీ నాయకత్వం ఆ దిశగా ఆలోచించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రజాభీష్టాన్ని కాదని తమ పదవులు కాపాడుకునే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలపట్ల జనం వ్యతిరేకతతో ఉన్నారు.

బీజేపీ ఆరాటం
టీడీపీతో కలిసి పనిచేసిన కాలంలో ఒక వెలుగు వెలుగిన బీజేపీ ఆ తర్వాత స్తబ్దుగా మారింది. 1999లో ఒక ఎంపీ స్థానంతోపాటు ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్నది. ఆలె నరేంద్ర బీజేపీకి నాయకత్వం వహించిన రోజుల్లో బలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయనతోపాటే కేడర్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయింది. పటిష్టనాయకత్వం లేకపోవడంతో చాలాకాలంపాటు కార్యకలాపాలేవీ నిర్వహించలేదు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం బీజేపీకి కొంత ఊపిరి పోసినటె్లైంది. జేఏసీ పిలుపులకు స్పందిస్తూ ఆందోళన కార్యక్షికమాల్లో పాల్గొంటున్నారు.

వామపక్షాలకు గండి
ప్రధానంగా జిల్లాలోని పారిక్షిశామికవాడల్లో గట్టి పునాదులు కలిగి ఉన్న సీపీఐ, సీపీఎంలు చట్టసభలో స్థానంకోసం పోరాడుతున్నాయి. ఇతర పార్టీలతో పొత్తులు కొనసాగినంతకాలం నర్సాపూర్ స్థానం సీపీఐకి పెట్టని కోటగా మారింది. ఆ పార్టీ సీనియర్ నేత చిలుముల విఠల్‌డ్డి వరుస విజయాలతో అసెంబ్లీలో స్థానం పదిలం చేసుకున్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లకా్ష్మడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నర్సాపూర్ హస్తగతమైంది. పటాన్‌చెరు పారిక్షిశామికవాడలో మంచి పట్టున్న సీపీఎం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైంది. జిల్లాలోని వివిధ పరిక్షిశమల కార్మిక సంఘ యూనియన్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీకి దిగుతుండటంతో వామపక్షాల ఆధిపత్యానికి గండి పడుతున్నది.

టీడీపీ అడ్రస్ గల్లంతు!
పదేండ్ల కిందటి వరకు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక క్రమంగా అంతర్థానమై పోయే పరిస్థితి కనిపిస్తోంది. 1983 నుంచి జిల్లాలో ఆధిపత్యం సాగిస్తూ వచ్చిన టీడీపీ 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో దెబ్బతిన్నది. ప్రధానంగా టీడీపీ నుంచి కేసీఆర్ బయటకు రావడంతో జిల్లాలో టీడీపీకి భారీగా గండి పడింది. 2004, 2009 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి టీఆర్‌ఎస్ అందుకున్న తెలంగాణవాదం బాగా పనిచేసింది. ప్రత్యేక రాష్ట్రం విషయంలో అస్పష్ట విధానంతో ఉన్న చంద్రబాబుపట్ల విముఖతతో జిల్లాలో పార్టీ శ్రేణులు వలసబాట పట్టాయి. ప్రస్తుతం మెదక్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు అనుకూల వర్గం మినహా జిల్లాలో పార్టీకి కేడర్ కరువైంది. సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు.

టీఆర్‌ఎస్ ఆత్మవిశ్వాసం
2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమ పంథాతో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ క్రమంగా జిల్లాలో పట్టు సాధించింది. పార్టీ ఏర్పాటైన తొలి సంవత్సరమే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయభేరి మోగించింది. కేసీఆర్ మార్గ నిర్దేశనంలో హరీష్‌రావు నాయకత్వంలో జిల్లాలో పార్టీ నలుమూలలా విస్తరించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని నాలుగు స్థానాలు గెలుచుకున్నది. సంగాడ్డి నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీచేసి గెలిచిన తూర్పు జయవూపకాష్‌డ్డి ఏడాది తిరగకముందే కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గి టీఆర్‌ఎస్‌లో చీలికకు కారణమయ్యారు. ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, రామాయంపేట స్థానాలు కోల్పోవలసి వచ్చింది.

2009 ఎన్నికల్లో టీడీపీ చేసిన మిత్రవూదోహంతో జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఒక్క సిద్దిపేట స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. పదేళ్లుగా టీఆర్‌ఎస్ కృషి కారణంగా తెలంగాణవాదం జిల్లాలో బలపడింది. కాగా 2009లో తెలంగాణకోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలతో జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్ పోరాటానికి మద్దతుగా నిలిచారు. 42రోజులపాటు సకల జనులతో కలిసి టీఆర్‌ఎస్ చేసిన సమ్మెకు జనం నుంచి ఆదరణ లభించింది. అదే సమయంలో టీడీపీ ఒక్కరోజు సమ్మెకు ప్రయత్నించగా ప్రజల నుంచి నిరసన ఎదురయింది. ఇటీవలి తెలంగాణ సాధన పాదయావూతతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సా హం నిండింది. 

Take By: T News -  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=48943


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Medak, Sangareddy, Siddipet, Karimnagar, Harish Rao, KCR, Medak news, Local News,   

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP