కేంద్ర దళాల్లో కొలువుల జాతర
- 90 వేల కానిస్టేబుళ్ల భర్తీ
- డిసెంబర్ 3న నోటిఫికేషన్
న్యూఢిల్లీ, నవంబర్ 28:
కేంద్ర సాయుధ దళాల్లో త్వరలో 90 వేల కానిస్టేబుళ్ల పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయేనుంది.
ఈ నియామకాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపట్టనుంది.
ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేనెల 3వ తేదీన ఎస్‌ఎస్‌సీ విడుదల చేయనుంది.
గ్రూప్-బీ నాన్ గెజిటెడ్, గ్రూప్-సీ నాన్ టెక్నికల్ పోస్టుల నియామకానికి ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహించనుంది.
ఆస్సాం రైఫిల్స్‌లో 8,724,
బీఎస్‌ఎఫ్‌లో 16,484,
సీఐఎస్‌ఎఫ్‌లో 10,240,
ఎస్‌ఎస్‌బీలో 5,864,
ఐటీబీపీలో 7,180
కానిస్టేబుళ్ల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
వచ్చే ఏడాది అక్టోబర్ 31 కల్లా భర్తీ చేయాలని ఎస్‌ఎస్‌సీ భావిస్తోంది.
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Center Govt Jobs, Army Jobs, Job,
0 comments:
Post a Comment