వీఆర్వో,వీఆర్‌ఏ పోస్టులకు 7న నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను డిసెంబర్ 7న జారీ చేయనున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 29. జనవరి 30న రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలు ఫిబ్రవరి 15న విడుదల చేసి, అదే నెల 24లోపు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తామని తెలిపారు. అయితే వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి సర్కార్ మాట తప్పింది. వీఆర్‌ఏ పోస్టులు గౌరవ వేతనంతో కూడిన కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే. 1172 వీఆర్‌వో పోస్టులు మాత్రమే శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు.
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET,
0 comments:
Post a Comment