కనిమొళికి బెయిలు మంజూరు
న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళికి ఎట్టకేలకు బెయిలు దొరికింది. ఢిల్లీ హైకోర్టు అమెకు బెయిలు మంజూరు చేసింది. 2జీ కుంభకోణంలో గత ఆరునెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న కనిమొళి ఇప్పటికీ నాలుగు సార్లు బెయిలు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదవసారి కోర్టు ఆమెకు బెయిలిచ్చింది. 2జీ కేసులో కనిమొళితోపాటు కలైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్, మరో నలుగురికి బెయిలు దొరికింది. రూ. 5లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వీరు బెయిలుపై విడుదల కావడానికి లేన్ క్లియరైంది. కనిమొళికి బెయిలు దొరకడంతో డీఎంకే వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కేసు నుంచి బయట పడినంత ఆనందం కలిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,
0 comments:
Post a Comment