నలుగురే!
- పార్టీలకు రాజీనామాలు చేసినవారివే ఆమోదం
- 61 మంది రాజీనామాలు తిరస్కరణ
- అబయెన్స్‌లో నలుగురు ఎమ్మెల్యేల భవిత
- అసెంబ్లీ సమావేశాల వేళ స్పీకర్ నిర్ణయం
- ఉప ఎన్నికలకు ఏడు స్థానాలు సిద్ధం
- స్పీకర్ నిర్ణయంపై వెల్లు విమర్శలు
రాజీనామాలు ఆమోదం పొందిన సభ్యులు :
గంప గోవర్ధన్, జోగురామన్న,
జూపల్లి కృష్ణారావు, టీ రాజయ్య
తిరస్కరణకు గురైనవి ::
వివిధ పార్టీల్లోని 61 మందివి
అబయెన్స్‌లో :
కొండా సురేఖ, బాల నాగిడ్డి,
శోభా నాగిడ్డి, కుంజా సత్యవతి.
హెదరాబాద్, నవంబర్ 28 () : ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని కొందరు ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన గంప గోవర్ధన్, జోగురామన్న, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు, టీ రాజయ్య తమ శాసనసభ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మరో 61 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించారు. అంటే కేవలం పార్టీలు మారిన ఎమ్మెల్యేల రాజీనామాలనే స్పీకర్ ఆమోదించారన్నమాట. జగన్ వర్గానికి మద్దతు పలుకుతున్న వారిలో అనర్హత పిటిషన్‌పై విచారణ ఎదుర్కొంటున్న నలుగురి రాజీనామాలపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. వీరిలో కొండా సురేఖ, బాల నాగిడ్డి, శోభా నాగిడ్డి, కుంజా సత్యవతి ఉన్నారని సమాచారం.
అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలూ వ్యక్తమయ్యాయి. స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారని టీ రాజయ్య ఆరోపించారు. సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పీకర్‌పై మండిపడ్డారు. స్పీకర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ సాధన కోసం ఆగస్టు 4వ తేదీన తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, బీజేపీకి చెందిన ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వారి రాజీనామాలను స్పీకర్ తిరస్కరించారు.
తిరిగి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీకి చెందిన 66మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయగా.. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ తన వద్దనే నిలిపివేశారు. దీంతో తమ రాజీనామాలను ఆమోదించాలని నాగం జనార్దన్‌డ్డి అనేక పర్యాయాలు స్పీకర్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. చివరికి తన రాజీనామాను ఆమోదించక పోతే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో నాగం జనార్దన్‌డ్డి, ప్రసన్నకుమార్‌డ్డి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మిగతా రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న స్పీకర్.. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను ఇటీవల పిలిచి మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన టీ రాజయ్య, జూపల్లి కృష్ణారావు, గంప గోవర్థన్, జోగురామన్న రాజీనామాలను సోమవారం ఆమోదించారు.
రాజయ్య, జూపల్లి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి సైతం రాజీనామా చేశారు. గంప గోవర్ధన్, జోగు రామన్నలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం ఈ నలుగురూ వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పార్టీకి సైతం వీరు చేసిన రాజీనామాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. వారి రాజీనామాలను ఆమోదించినట్లు తెలుస్తోంది. పార్టీకి సైతం రాజీనామా చేయడంతో వారు తిరిగి తమ పాత పార్టీల్లో చేరే అవకాశం లేకపోవడంతో వారి అభీష్టం మేరకు రాజీనామాలు ఆమోదం పొందినట్లు సమాచారం. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల విషయంలో రాజకీయం పని చేసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. జగన్ వర్గంలో చేరేందుకు వీలుగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం జగన్‌పై ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నది. ఆయన అరెస్టు కావడం తథ్యమన్న వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ వెంట ఉంటే తమకూ ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు ఎమ్మెల్యేలు భావించడం, అదే విషయాన్ని రాష్ట్ర పార్టీ పెద్దలకు తెలియజేసి, తిరిగి సొంత గూటికి రానున్నట్లు సంకేతాలు ఇవ్వడం నేపథ్యంలో జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల స్పీకర్ తమను పిలిచిన సమయంలో కూడా వారు తమ రాజీనామాలను ఆమోదించవద్దని కోరినట్లు వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు వ్యవధి ఉండటం, ఈ లోపు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్షికమాలపై దృష్టిపెట్టాలని ఈ ఎమ్మెల్యేలు భావించడం కూడా వారి రాజీనామాల తిరస్కరణకు కారణమైందని చెబుతున్నారు. టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు సంబంధించి.. వీరు పార్టీని, పార్టీ అధ్యక్షుడిని వ్యతిరేకించడం లేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తోనే 32 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ అంశాన్ని కూడా స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి రాజీనామాలు కూడా తిరస్కారానికి గురయ్యాయని అంటున్నారు.
ప్రజాక్షేవూతంలో దోషులుగా మిగులుతారు: టీ రాజయ్య
తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా టీ కాంగ్రెస్, టీడీపీ టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలి. లేనిపక్షంలో తెలంగాణ ద్రోహులుగా మిగులుతారు.
అప్రజాస్వామికంగా వ్యవహరించిన స్పీకర్: జూపల్లి
తెలంగాణ సాధన కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలలో కేవలం నలుగురి రాజీనామాలను మాత్రమే స్పీకర్ ఆమోదించడం అప్రజాస్వామికం. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారు. తెలంగాణ కోసం మొదటి సారి రాజీనామాలు చేసిన ప్రజావూపతినిధులు తమ రాజీనామాలను తిరస్కరిస్తే రెండవ సారి ఎందుకు రాజీనామాలు చేయడం లేదో ప్రజలు గమనిస్తున్నారు.
సభ్యుల హక్కులను కాలరాస్తున్న స్పీకర్: ఈటెల
ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుండా సభ్యుల హక్కులను స్పీకర్ కాలరాస్తున్నారు.తెలంగాణ ప్రజలు కోరుకునేదే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు చేశారు.
స్పీకర్ సీమాంధ్ర పక్షపాతి: టీ రాజయ్య
స్పీకర్ మనోహర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు. రాజీనామాను ఆమోదింప చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదు?
స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా - గంప గోవర్ధన్
స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను మరింత బలంగా చాటిచెప్పే అదృష్టం కామాడ్డి ప్రాంత ప్రజలకు కలగడం అభినందనీయం.
మిగతా ఎమ్మెల్యేలు ఆమోదించుకోవాలి: జోగు రామన్న
మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలి. స్పీకర్ ఫార్మాట్‌లో ఇవ్వనివారు మళ్లీ ఇవ్వాలి. ఇకనైనా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మేలుకోవాలి.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News
0 comments:
Post a Comment