మరో చరిత్రకు నేటితో రెండేళ్లు...
- 14ఎఫ్ తొలగింపు డిమాండ్‌తో మొదలై..
- తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా చేసుకుని..
- ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ నిరాహారదీక్ష
- తెలంగాణను కుదిపేసిన ఆ 11 రోజులు
- ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమం
- 14ఎఫ్ తొలగింపు డిమాండ్‌తో మొదలై..తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా చేసుకుని చరిత్ర సృష్టించిన కేసీఆర్ నిరాహారదీక్ష
- అన్ని పక్షాలూ తీర్మానానికి ఓకే
- డిసెంబర్ 9న చారివూతక ప్రకటన
తెలంగాణ భగ్గుమన్న ఆ 11 రోజులకు నాంది పలికింది ఈ రోజే! సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఓ మహత్తర అధ్యాయం తెలంగాణ చరివూతకెక్కింది ఈ రోజే! నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ చరివూతలో ఓ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ ఉద్వేగ ఘడియలకు పునాది పడింది ఈ రోజే! డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామంటూ కేంద్రం స్పష్టమైన నిర్ణయం వెలువరించిన ఘట్టానికి నాంది పలికింది ఈ రోజే! అదే నవంబర్ 29! తెలంగాణ ఉద్యమ సారథి కే చంద్రశేఖర్‌రావు.. ప్రాణాలను పణంగా పెట్టి దీక్షాదక్షుడైన రోజు!
(టీ న్యూస్, హైదరాబాద్) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో పోరాటానికి శ్రీకారం చుట్టిన గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష చేపట్టి మంగళవారానికి సరిగ్గా రెండేళ్లు నిండుతోంది. తన ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలా చేసి చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేలా కేసీఆర్ మడప తిప్పని పోరు సలిపారు. చరిత్ర మలుపు తిప్పిన ఖ్యాతిని గడించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందారు. కేసీఆర్ దీక్ష ప్రారంభానికి ముందు నుంచి తెలంగాణ ప్రకటనతో దీక్ష విరమించే వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎన్ని కుట్రలు, కుతంవూతాలు పన్నినా వాటన్నింటినీ తెలంగాణవాదులు తిప్పికొడుతూనే ముందుకు సాగుతూ కేసీఆర్‌కు అండగా నిలిచారు. ఈ దీక్ష ప్రస్థానంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురైనా వాటిని తెలంగాణ ప్రజలు వెంటనే సర్దుకొని కేసీఆర్‌కు బాసటగా నిలిచారు. ‘హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు. ఆరవ జోన్‌లో భాగమే. ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’ అంటూ కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.మెదక్ జిల్లా సిద్దిపేటలో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు.
కరీంనగర్ బయల్దేరుతూ..
కరీంనగర్‌కు బయలుదేరే ముందు హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసం, తెలంగాణ భవన్ వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ‘కేసీఆర్ సచ్చుడో. తెలంగాణ వచ్చుడో. తేలిపోవాలి. తెలంగాణ సాధించి జైత్రయావూతను నిర్వహించాలో, కేసీఆర్ సచ్చి శవ యాత్రలో నిర్వహించాలో కూడా తేలిపోవాలి’ అని కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. నివాసం నుంచి బయలు దేరే ముందూ కేసీఆర్ మాట్లాడారు. ‘మళ్లీ మిమ్మల్ని కలుస్తానో లేదో. మీతో ఇంటరాక్ట్ కావడం ఇదే చివరిసారి కావచ్చు’ అంటూ ఆయన విలేకరులను ఉద్దేశించి అన్నారు. భావోద్వేగాల మధ్య కేసీఆర్‌కు కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికారు. కేసీఆర్ సోదరీమణులు సుమతి, విమల, లక్ష్మీ, జయ, సతీమణి శోభ, కూతురు కవిత, మనవళ్లు హిమాంశ్, ఆదిత్య, ఆర్య తదితరులు ఇంటి నుంచి బయటిదాకా వచ్చి వీడ్కోలు పలికారు.
కేసీఆర్‌కు తొలుత సోదరి సుమతి, కూతురు కవిత తిలకం దిద్దారు. సోదరీమణులందరికీ కేసీఆర్ పాదాభివందనం చేశారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావు తాతయ్యా’ అంటూ మనవళ్లు ప్రశ్నించారు. దీనికి చిరునవ్వుతోనే బదులిచ్చి ముందుకు కదిలిన కేసీఆర్ వెనక్కి చూడకుండా కారులోకి చేరుకున్నారు. తెలంగాణ భవన్‌కు చేరుకోగా అక్కడ మహిళా కార్యకర్తలూ తిలకం దిద్దారు. ‘విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజల ఆశీస్సులతో ఆమరణ దీక్షకు వెళ్తున్నా’ అని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ దీక్ష 11రోజులు సాగిందిలా...
29.11.2009 : ఉదయం ఏడున్నర గంటలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్‌లోని తన నివాసం నుంచి మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆమరణ దీక్ష శిబిరానికి బయలుదేరారు. టీఆర్‌ఎస్ శ్రేణులను తప్పించి పోలీసులు కరీంనగర్ శివారులోని అలుగునూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలించి అక్క సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజివూస్టేట్ ఎదుట హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. యావత్ తెలంగాణ భగ్గుమంది.
30.11.2009 : కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిందని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపవూతికి తరలించారు. కేసీఆర్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయించే కుట్రను అమలు చేసింది. ప్రభుత్వం కుట్ర పూరితంగా దీక్షను బలవంతంగా విరమింపజేసిందని ఆసుపవూతిలో, జైలులోనూ దీక్ష కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు.
1.12.9009 : పోలీసులు బలవంతంగా వైద్యానికి ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్ హెచ్చరిక. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు. హైదరాబాద్‌కు మార్చాలని కోర్టులో పిటిషన్.
2.12.2009 : కేసీఆర్ దీక్షను విరమింపచేసేందుకు ప్రభుత్వం తరఫున మంత్రి ఆర్ దూతగా ఖమ్మం ఆసుపవూతికి వచ్చి విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఉన్నాయని కేసీఆర్‌కు సైలైన్ పెట్టారు.
3.12.2009 : ఖమ్మం నుంచి భారీ బందోబస్తు మధ్య అర్ధరాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు కేసీఆర్ తరలింపు. నిమ్స్‌లో కేసీఆర్ దీక్ష కొనసాగించారు.
4.12.2009 : నిమ్స్‌లోని జనరల్ వార్డు నుంచి అత్యవసర వార్డుకు కేసీఆర్ తరలింపు. క్షీణించిన కేసీఆర్ ఆరోగ్యం. తెలంగాణ ప్రాంత మంత్రుల భేటీ. ప్రభుత్వం తరఫున నిమ్స్‌కు వచ్చిన మంత్రి దానం నాగేందర్. ఒప్పుకోని కేసీఆర్.
5.12.2009 : తెలంగాణ విషయంలో తన చేతిలో ఏమీ లేదని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన. 48గంటల తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపు.
6.12.2009 : నిమ్స్‌లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కె.రోశయ్య పరామర్శించారు. దీక్షను విరమించాలని విజ్ఞప్తి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసింది. తెలంగాణ ప్రకటన చేయల్సిందేనని కేసీఆర్ డిమాండ్.
7.12.2009 : నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శ. కేసీఆర్ దీక్షపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు సరేనని తమకు అభ్యంతరం లేదని అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల తీర్మానం.
8.12.2009 : కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. దీక్ష విరమించకుంటే కేసీఆర్‌కు ఏమైనా జరగవచ్చని నిమ్స్ వైద్యుల ఆందోళన. తెలంగాణ అంశాన్ని చర్చించాలని అసెంబ్లీలో పట్టుబట్టిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ వాయిదా. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు.
9.12.2009 : ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ పలుమార్లు భేటీ. ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో ముఖ్యమంత్రి రోశయ్య మంతనాలు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, KCR, TRS, Harish Rao, Telangana agitation, Telangana issue, Telangana Songs, Songs,

0 comments:
Post a Comment