Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, November 30, 2011

ఆర్థిక మంత్రిగా మహిళకు చాన్స్! - రచ్చబండలో సీఎం వ్యాఖ్యలు

కూకట్‌పల్లి, నవంబర్ 29 (): రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలను మహిళకు అప్పగించాల్సిన విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆర్థిక విషయాలన్నీ మహిళలే చూసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక బాధ్యతలను కూడా ఆడవారికి అప్పగిస్తే మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందంటూ తన అభివూపాయాన్ని వెల్లడించారు. ఆర్థిక శాఖను మహిళకు కేటాయించే అంశాన్ని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్షికమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు మరింత ప్రాధాన్యతనిచ్చేందుకు, ప్రతి సంక్షేమ పథకానికి మహిళలనే అర్హులుగా గుర్తిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌కు మంత్రి పదవి బీసీ కోటా కింద ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఎంపీ సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్షికమంలో మంత్రులు సబితా ఇంద్రాడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌డ్డి, కిచ్చనగారి లకా్ష్మడ్డి, రాజిడ్డి, రాజేందర్, ప్రసాద్‌రావు, ఎంఎల్‌సీ రాజాడ్డి, పాల్గొన్నారు.


Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,

Read more...

స్కాలర్ ‘షిప్’ ముంచేశారు!



- అందాల్సిన దరఖాస్తులు 13 లక్షలు
- ఇప్పటివరకు అందినవి 5 లక్షలే!
- బ్యాంక్ అకౌంట్లు రానివారు 4 లక్షలు
- సర్టిఫికెట్లు, అకౌంట్ల అటాచ్‌తోనే తంటా!
- సవాలక్ష ఆప్షన్లు.. సతాయిస్తున్న ఈ-పాస్ సర్వర్
- నేటితో గడువు పూర్తి.. ఆందోళనలో విద్యార్థులు
- గడువు పెంచకుంటే ఏడున్నర లక్షల మందికి నష్టం

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు రాష్ట్ర సర్కారు పన్నిన ‘ఆన్‌లైన్ దిగ్బంధం’లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటున్నారు. సవాలక్ష నిబంధనలు, షరతులు విధించి.. ఎన్నో ఆంక్షలు పెట్టడంతో ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో విద్యార్థులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. బ్యాంకు అకౌంట్లు తీసి, అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు సాధించి.. ఇంట్నట్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల సంగతి సరేసరి. ఏ సదుపాయం అందుబాటులో లేని వారు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఏటికి ఎదురీదటాన్ని తలపిస్తోంది. దీంతో గడువు ముగుస్తున్నా ఇప్పటివరకు అర్హులైన విద్యార్థుల్లో సగం కూడా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. మొత్తం 13 లక్షల మంది విద్యార్థులలో 5లక్షల మంది స్కాలర్‌షిప్ దరఖాస్తులు అందాయి.

బుధవారం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. దీంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన గ్రామీణ, పేద విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే, తాము దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువును మరో 15 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరగకపోతే.. ఏడున్నర లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమయ్యే ప్రమాదం పొంచివుంది.


GGGG-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ నవంబర్ 29 ():రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీరు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. కొత్త దరఖాస్తులు స్వీకరించే విషయంలో ఈ పాస్ వెబ్‌సైట్‌లో పెట్టిన విపరీతమై అప్షన్లు బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 865 కరువు మండలాలను ప్రకటించి రైతులపై సానుభూతి ప్రదర్శిస్తున్నట్లు చెప్పుకుంటూనే.. మరోవైపు అన్నదాతల పిల్లల చదువులకు చేదోడువాదోడుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కట్టడి చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి స్కాలర్‌షిప్ మొత్తాలను తగ్గించుకునేందుకు ప్రయత్నంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్కాలర్‌షిప్ దరఖాస్తులపై ఆంక్షలు విధించి తక్కువ దరఖాస్తులు వచ్చేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.

సంక్షేమ రంగానికి కేటాయించే నిధుల్లో భారీగా కోతలు విధించి.. పరోక్షంగా చర్యలు తీసుకుంటూ పేద విద్యార్థులను దొంగదెబ్బ తీస్తోంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అనేక మార్పులు చేసింది. కోర్సుల ఫీజులను తగ్గించడం, సర్టిఫికెట్ల కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేయడం వంటి చర్యలకు దిగిన సర్కారు బడుగు, బలహీనవర్గాల విద్యార్థులనూ వదిలిపెట్టడం లేదు. వారిని ఉన్నత చదువులకు దూరం చేసేలా అనేక షరతులు విధిస్తోంది. గతేడాది వరకు లేని ఆప్షన్లను ఈ ఏడాది ఈపాస్ వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టి విద్యార్థులను నానా అగచాట్లకు గురిచేస్తోంది. బ్యాంకు అకౌంట్లు రాకపోవడం, బ్యాంకర్లు జీరో బ్యాలెన్సు అకౌంట్లు ఇవ్వడానికి ససేమిరా అనడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్నట్ సదుపాయం అందుబాటులో ఉండకపోవడం, కుల, ఆర్థిక ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఎక్కడలేని జాప్యం జరగడంతోపాటు ఇవన్నీ సమకూరినా దరఖాస్తు చేసుకుందామంటే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్న చందంగా సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నారు.

దీంతో 2011-12 విద్యా సంవత్సరానికి గాను 13 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటివరకు కేవలం 5.35 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు బుధవారం ముగుస్తోంది. దీంతో ఇటు విద్యార్థుల్లో, అటు అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించకుంటే దాదాపు ఏడున్నర లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.

బ్యాంకు ఖాతాలతోనే తంటా
గతంలో కాలేజీలకే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు వేళ్లేవి. దీంతో జరుగుతున్న అవకతవకలను అరిక ఈపాస్ వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. ఇవి విద్యార్థులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు దరఖాస్తులు రావాల్సిన దానికంటే చాలా తక్కువ రావడంతో అధికారులూ ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడుందనేదానిపై ఆరా తీస్తున్నారు. గతంలో ‘నమస్తే తెలంగాణ’లో స్కాలర్‌షిప్‌లకు అకౌంట్ దెబ్బ పేరుతో ప్రచురితమైన వార్తకు ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమాండ్ పీటర్ స్పందిస్తూ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించాలని కలెక్టర్లకు లేఖ కూడా రాశారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినా జిల్లాల్లో బ్యాంకర్ల నుంచి సరైన స్పందన కరువైందని అధికారులే చెబుతున్నారు.

కనీసం రూ. 500 నుంచి వెయ్యి రూపాయల డిపాజిట్ చేస్తేనే బ్యాంకులు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు ఒప్పుకుంటున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఒక్కసారిగా 13 లక్షల అకౌంట్లు కొత్తగా తెరవాల్సి రావడంతో ఇది బ్యాంకు అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. కట్టలుకట్టలుగా అకౌంట్ల కోసం దరఖాస్తులు వస్తుండటంతో చేసేదేం లేక వారం నుంచి పది రోజుల వరకు షెడ్యూల్ బ్యాంక్‌లు సమయం తీసుకుంటున్నాయి. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు బ్యాంకు అకౌంట్ నెంబర్ లేకపోవడం వల్లే ఆగిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్లకు లేఖ రాసిన నేపథ్యంలో విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు వచ్చేలా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ ప్రయత్నం గతంలోనే చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని విద్యార్థులంటున్నారు.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇప్పించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందని తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే ఈ విషయమై కలెక్టర్లకు లేఖలు రాసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని భావిస్తున్నారు. మరోవైపు రాష్ర్టవ్యాప్తంగా కుల, ఆర్థిక ధ్రువీకరణ సర్టిఫికెట్లతోపాటు, పదో తరగతి వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే నింపాల్సి ఉండటంతో ఏ చిన్న తప్పు దొర్లినా దరఖాస్తును మళ్లీ మొదటి నుంచి నింపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అదే సమయంలో ధ్రువీకరణ పత్రాలతో పాటు, పదో తరగతి మెమో, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇతర పత్రాలు కూడా ఆన్‌లైన్‌లోనే అటాచ్ చేయాల్సి ఉండటంతో దరఖాస్తులు ఓకే అవ్వడానికి సమయం పడుతోందని విద్యార్థులంటున్నారు. కొత్తగా ఏర్పాటైన ఇంటర్మీడియట్ కాలేజీల విద్యార్థులకు మరో చిత్రమైన సమస్య ఎదురవుతోంది. కొత్త కాలేజీల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరు నేరుగా దరఖాస్తులు కాలేజీల్లో అందజేస్తున్నట్లు సమచారం. అక్కడి నుంచి దరఖాస్తులు పీడీ కార్యాలయానికి వస్తాయని అధికారులంటున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేందుకు మరో 15 రోజుల గడువు పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదంవూడులు కోరుతున్నారు.

ఒక్క దరఖాస్తుకు గంట సమయం
ఈ సమస్యలకు తోడు గత మూడు రోజుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ఈపాస్ వెబ్‌సైట్ సర్వర్ బాగా నెమ్మదించినట్లు సమాచారం. జిల్లాల నుంచి దరఖాస్తులు పంపడానికి గంటల తరబడి సమయం తీసుకుంటోందని విద్యార్థులంటున్నారు. మధ్యాహ్నం సమయంలోనైతే ఒక్క దరఖాస్తును నింపడానికి గంటలకు పైగా సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. మూడురోజుల నుంచీ మరీ ఎక్కువ సమయం తీసుకుంటోందని చెబుతున్నారు. గడువు దగ్గరపడుతున్న కొద్దీ జిల్లాల నుంచి ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే వారి సంఖ్య వేలల్లో పెరుగుతోందని, ఇందువల్లే సర్వర్ డౌన్ అవుతుందని అధికారులంటున్నారు. ఇంట్నట్ గంటల తరబడి కూర్చోవడం వల్ల తమకు డబ్బులు కూడా అదనంగా ఖర్చువుతోందని విద్యార్థులు వాపోతున్నారు.


Read more...

నిప్పురవ్వ నిజామాబాద్

-ఉద్యమాల పురిటిగడ్డ
-పొరక దొరల నేతృత్వంలో పల్లెల్లో మార్పు

nzb052-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema(నిజామాబాద్)తెలంగాణలోని పది జిల్లాల్లో చిన్నదైన జిల్లా నిజామాబాద్. కానీ.. పౌరుషంలో మాత్రం మేటిగా నిరూపించుకుంటోంది. యావత్ తెలంగాణలోనే కాక.. రాష్ట్రం మొత్తాన్నీ ప్రభావితం చేయగలిగిన నాయకత్వం ఎదగడం ఈ జిల్లా విశేషం. 33 ఏళ్ల క్రితమే నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం నీడలో ఇందూరుగడ్డపై సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వీరోచితమైన పోరాటాలే జరిగాయి. జంగల్, జమీన్ కోసం పొరక దొరల పేరిట రాంచందర్, ప్రసాద్ నాయకత్వంలో లక్ష కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అటవీ పల్లెల్లో అగ్గిరాజుకుంది. జంగ్లాత్ అధికారుల దౌర్జన్యాలను, పల్లెల్లో పటేల్, పట్వారీ పెత్తనం, పంచాయతీల పేరిట దండుగుల వసూళ్ల దందాను రూపుమాపారు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు చరమగీతం పాడారు. ఇప్పటికీ ఆ పోరు వారసత్వంతో నిజమాబాద్ జిల్లా నిప్పురవ్వలా ఉద్యమసెగలు తాకిస్తూనే ఉంది.

టీడీపీ కంచుకోటలు తునాతునకలు
నిజాం నవాబు పిలుపుతో వడివడిగా వచ్చి అగ్గువ సగ్గువకు భూములను కొనుక్కొని నిజాంసాగర్ కాలువల పొంట వెలసిన తెలంగాణ సెటిలర్లు టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల గెలుపోటములను నిర్దేశించగలిగిన స్థాయికి ఆ సామాజిక శ్రేణులు ఎదిగాయి. ఫలితంగానే టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి మునుపు జిల్లాలో టీడీపీ అడ్డా భిఠాయించగలిగింది. స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు, తెలంగాణ అంతటా తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ కారణంగా 2004 ఎన్నికల్లో వై.ఎస్ రాజకీయ అనివార్యతలో భాగంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు సమీకరణ 2004 ఎన్నికల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసింది. 9 నియోజకవర్గాల్లో మూడింటిని టీఆర్‌ఎస్, మిగిలిన ఆరింటిని కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీకి అసెంబ్లీలో నిజామాబాద్ నుంచి ప్రాతినిథ్యమే లేకుండాపోయింది.

ఆ నాలుగేళ్లకు ఉప ఎన్నికల పుణ్యమా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మండవ వెంక గెలువడంతో ఒక స్థానంపై పచ్చజెండా ఎగిరింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో పొసగిన పొత్తుతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బాగానే రాజకీయ లబ్ధి పొందింది. టీఆర్‌ఎస్ మద్దతుతో ఐదు స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఆ సంబరం ఎంతోకాలం మిగల్లేదు. చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ధిక్కరించి బాన్సువాడ గడ్డపై టీడీపీకి పెద్దదిక్కయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఉద్యమ సారథిగా పేరు తెచ్చుకున్న టీఆర్‌ఎస్‌లో చేరి.. 50 వేల మెజార్టీతో గెలిచారు. కామాడ్డి డివిజన్‌లో టీడీపీలో బలమైన నాయకుడిగా ఎదిగిన గంప గోవర్ధన్ సైతం తెలంగాణ కోసం గులాబీ గుడారంలో చేరారు. ఎమ్మెల్యే పదవికి ఆయన చేసిన రాజీనామా ఆమోదం పొందింది. మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన టీడీపీ జిల్లాలో రాజకీయ ప్రాభవాన్ని రోజురోజుకు కోల్పోతూనే ఉంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పలేని ఇరకాట పరిస్థితి కారణంగా జిల్లాలో టీడీపీ నిర్మాణపరమైన నష్టాన్ని చవిచూస్తోంది.

అందరూ పెద్దోల్లే - అయినా ఎవరికి వారే
20 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతున్న ఉద్దండులే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్నారు. మర్రి చెన్నాడ్డి హయాం నుంచి మొదలుకొని కిరణ్‌కుమార్ కేబినెట్‌లోనూ ఇందూరు రాజకీయ ఉద్దండులు ఒక వెలుగు వెలుగుతూనే ఉన్నారు. చెన్నాడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్, సంతోష్‌డ్డి, షబ్బీర్ అలీ గతంలో చక్రం తిప్పినవారే. ఐదేళ్లు స్పీకర్‌గా సురేష్‌డ్డి సైతం రాష్ట్ర రాజకీయాల్లో స్థిరపడ్డారు. ఇప్పటికీ డీ శ్రీనివాస్ 10జనపథ్‌తో సన్నిహిత సంబంధాలను కలిగిఉన్నారు. ఫలితంగానే వరుస పరాజితుడైనప్పటికీ, ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో షబ్బీర్ అలీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కోటరీలో చోటుకలిగిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎంపీ మధుయాష్కీ గౌడ్‌లు రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకపావూతనే పోషిస్తున్నారు. ఇలా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఉద్దండులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయికి ఎదిగారు. కానీ ఈ నేతల మధ్య ఆధిపత్యపోరు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీఎస్, సుదర్శన్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు పలు సందర్భాల్లో జిల్లా యంత్రాంగానికి తలనొప్పి తెచ్చిపెట్టింది.

కేరాఫ్ హైదరాబాద్
పార్టీ ఆవిర్భావం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉంది. ప్రాంతాలకు అతీతంగా అంతటా టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణమే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు కలిగిన జుక్కల్, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్ లాంటి ప్రాంతాల్లో సైతం ప్రజలు గులాబీ జెండాను మోసేందుకు సిద్ధంగానే ఉన్నారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. 520 సర్పంచ్ స్థానాలను, 228 ఎంపీటీసీ స్థానాలను, 23 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోగలిగింది. 36 స్థానాల్లో 19 స్థానాలను గెలిచి జిల్లాపరిషత్‌పై గులాబీ జెండాను రెపపలాడించారు. అప్పటి నుంచి మొదలైన తెలంగాణ రాజకీయ ప్రస్థానం ఇందూరు గడ్డపై సంప్రదాయ రాజకీయ పార్టీలను చావుదెబ్బ తీసింది. మూడు గంటల్లో జిల్లా అంతటా కలియతిరిగేందుకు వీలుగా ఉన్న భౌగోళిక స్వరూపం సైతం అంతగా ఆర్థిక వనరులు లేని తెలంగాణ ఉద్యమ రాజకీయ ప్రస్థానానికి కలిసొచ్చిన అవకాశంగా చెప్పుకోవచ్చు. కానీ నిజామాబాద్‌లో నాయకత్వ లోపాలే టీఆర్‌ఎస్‌కు శాపంగా పరిణమించాయన్న వాదన ఉంది.

పార్టీకి జవసత్వాలు పోయాల్సిన కీలక బాధ్యత కలిగిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు కేరాఫ్ హైదరాబాద్‌గా ఉండడమే అసలు సమస్యగా మారింది. స్థానికంగా అందుబాటులో లేని నియోజకవర్గ నాయకత్వం వల్ల పార్టీ వ్యవస్థాగతమైన వ్యవహారాలు అంతగా సాగడంలేదన్న విమర్శ ఉంది. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ ఇన్‌చార్జిలు మినహా మిగతా వారంతా హైదరాబాద్‌లోనే నివాసం. పార్టీ కార్యక్షికమాలప్పుడు చుట్టంచూపుగా వచ్చి వంటి కారణాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

కమలం శ్రేణుల కదనోత్సాహం
2009 సాధారణ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలవడం కమలం ్రే ణుల్లో సరికొత్త కదనోత్సహానికి దోహదపడింది. యెండల లక్ష్మీనారాయణ వరుస విజయాల పరంపర నీడలో జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అడుగులేస్తోంది. కేసీఆర్ నిరాహారదీక్షల సందర్భంగా ఎగిసిన ఉద్యమాన్ని వేదికగా చేసుకొని బీజేపీ సంస్థాగతంగా పటిష్టత కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉద్యోగుల సహా య నిరాకరణ, సకల జనుల సమ్మె వంటి మలి విడత పోరాటాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని పెంచుకొని పార్టీ శ్రేణులను క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా మార్చింది.

న్యూ డెమోక్షికసీలో నూతనోత్తేజం
ప్రజా సమస్యలపై పనిచేస్తున్న న్యూ డెమోక్షికసీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లడాయి నూతనోత్తేజాన్ని ఇస్తోంది. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లో మాత్రమే కొంతమేరకు ప్రభావితం చూపగలిగిన స్థాయిలో ఉన్న ఆ పార్టీ మలితరం తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వెలుగు వెలుగుతోంది. మిలిటెన్సీ ఎత్తుగడలతో తెలంగాణ ఉద్యమ శక్తుల మెప్పును పొందుతోంది. రచ్చబండ సభల సందర్భంగా వందలాది మంది పోలీసుల కళ్లుగప్పి జై తెలంగాణ నినాదాలతో కిరణ్ సర్కారు ప్రతినిధులకు ఇందూరు గడ్డపై చెమటలు పట్టించారు.

లడాయిలో సీపీఐ చురుకైన పాత్ర
గతంలో ప్రజా సమస్యలపై సభలు, సమావేశాలకే పరిమితమైన సీపీఐ జిల్లాలో మలితరం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషిస్తోంది. తెలంగాణ డిమాండ్‌పై కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్షికమాల్లో సాయుధ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, రక్తం చిందించగలిగిన తెగింపును ఆ పార్టీ నాయకత్వ శ్రేణులు అనేకసార్లు ప్రదర్శించాయి. మిలిటెన్సీ స్వరూ పం కలిగిన కార్యకలాపాలతో తెలంగాణ ఉద్యమంలో సీపీఐ ప్రత్యేకతను చాటుకుంది.

ఇరకాటంలో సీపీఎం
తెలంగాణ ఉద్యమం ఉప్పెనైన తరుణంలో సీపీఎం నీళ్లు, పింఛన్ల కోసమని ఆందోళనల పేరిట తెలంగాణకు పోటీ కార్యాచరణతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పదేళ్లుగా అస్థిత్వం కోసం ఆరాటపడుతున్న సీపీఎం జిల్లాలో బలంగా నాటుకుపోయిన తెలంగాణ ఆకాంక్ష ముందు వెల ఈ పరిస్థితి ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతోంది. దశాబ్దాల తరబడి జిల్లాలో పని చేస్తున్నప్పటికీ సీపీఎంకు జిల్లాలో గ్రామస్థాయి ప్రజావూపతినిధి, పట్టణాల్లో బస్తీస్థాయి ప్రజావూపతినిధి లేకపోవడం గమనార్హం.

Read more...

చిల్లర కొట్టేస్తారు! (FDI Retail)

ఎఫ్‌డీఐలు తథ్యమన్న ప్రధాని పార్లమెంటు నడుస్తుండగానే బయట తేల్చిచెప్పిన మన్మోహన్

- ఎఫ్‌డీఐలపై దద్దరిల్లిన పార్లమెంట్
- ఆరో రోజూ ఆగని విపక్షాల నిరసన
- అఖిలపక్ష సమావేశం విఫలం
- మన్మోహన్‌తో మాట్లాడి చెబుతా
- పార్టీల నేతలతో ప్రణబ్‌ముఖర్జీ
- ఈలోపే తెగేసి చెప్పిన ప్రధాని
- ఎఫ్‌డీఐలు వద్దే వద్దు
- విపక్షంతో గొంతు కలిపిన తృణమూల్
- మరో భాగస్వామి డీఎంకేదీ అదే మాట


‘ఇదేం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై అన్నీ ఆలోచించాం. ఎఫ్‌డీఐలు దేశానికి
లాభదాయకమని మేం గట్టిగా నమ్ముతున్నాం. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా సామాన్యుడికి ప్రయోజనం కలుగుతుంది. నిత్యావసరవస్తువులు చవకకే లభిస్తాయి.
ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంతేకాదు గ్రామీణ మౌలిక సదుపాయాలనుఅభివృద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయోత్పత్తుల్లో వృథాను అరికట్టొచ్చు. రైతులు
తమ పంటలకు సరైన గిట్టుబాటుధరలు పొందొచ్చు’
- కాంగ్రెస్ యువ నేతల సదస్సులో ప్రధాని
మన్మోహన్

0FDI-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
భారత చిల్లర దుకాణ మార్కెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇకపై చెల్లు చీటీ ఇచ్చేయనుంది. ఇప్పటికే సూపర్ మార్కెట్‌ల పేరుతో మరణశయ్యను సిద్ధం చేసిన సర్కారు.. ఇప్పుడు ఇదే రంగంలోకి ఎఫ్‌డీఐల రూపంలో దేశీయ చిల్లర వర్తకానికి ఉరి బిగించేందుకు సిద్ధమైంది. చిల్లర వర్తకంలో చిల్లర కొట్టేసేందుకు విదేశీ కంపెనీలకు రెడ్‌క్పాట్ పరచనుంది. పార్లమెంటులో విపక్షాలు వరుసగా ఆరో రోజూ ఎఫ్‌డీఐలను ముక్తకం వ్యతిరేకించినా.. అనంతరం ప్రణబ్ చొరవతో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ పునరుద్ఘాటించినా సర్కా రు ససేమిరా అన్నది. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ సభను సాగనిచ్చేది లేదని అఖిలపక్ష సమావేశంలో అన్ని విపక్ష పార్టీలూ భీష్మించాయి. దీంతో ప్రధానితో మాట్లాడి మళ్లీ మీ వద్దకు వస్తానని ప్రణబ్ చెప్పిన కాసేపటికే మన్మోహన్ అత్యుత్సాహానికి పోయారు.

దాదాపుగా విధాన ప్రకటన అన్నంత స్థాయిలో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎవరు కాదన్నా చిల్లర వర్తకంలోకి 51శాతం విదేశీ పెట్టుబడులు వచ్చి తీరుతాయని కాంగ్రెస్ యువ నేతల సదస్సులో సంకేతాలు ఇచ్చారు. ఇది ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. పైగా ఇది సామాన్యులకు మేలు కల్గిస్తుందని, వస్తువులన్నీ చౌక ధరలకే లభిస్తాయని వాదించారు. ఈ విధానం దేశానికి లాభదాయకమని చెప్పారు. చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులపై సాక్షాత్తూ సొంత పార్టీ ఎంపీలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి మైండ్‌సెట్ మార్చేందుకు బుధవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియా గాంధీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా యూపీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న తృణమూల్, డీఎంకేలు ఈ విషయంలో విపక్షంతో గొంతు కలిపాయి.

SSSSS-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవల్సిందేనని స్పష్టం చేశాయి. ఇప్పటికే గత ఆరు రోజులుగా ఎఫ్‌డీఐల అంశంపై సభలో రగడ జరుగుతూ వస్తున్నది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలు వస్తే దేశవ్యాప్తంగా చిన్న దుకాణదారులు మాయమవుతారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతాయని ఇతర దేశాల ఉదాహరణలను ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ మార్కెట్‌ల పేరుతో దేశీయ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన అవకాశం చిల్లర వర్తకానికి తీవ్రంగా చేటు చేస్తోందని, అదే ఇప్పుడు విదేశీ కంపెనీలు సైతం అడుగు పెడితే చిల్లర వర్తకం దేశంలో మరణించడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ వర్తకులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయినా ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ఎఫ్‌డీఐలను స్వాగతించేందుకే సిద్ధపడుతున్నది. పలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు సైతం ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇది ఏ దిశగా మళ్లుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక గతంలో అణు ఒప్పందాన్ని ఆమోదించుకున్న తీరులోనే ఆరు నూరైనా ఎఫ్‌డీఐలను స్వాగతిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News

Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,
Parliament logjamFDI in retailOpposition parties  

Read more...

Tuesday, November 29, 2011

తగ్గనున్న పెట్రోల్ ధర

- లీటర్‌పై రూ.1.02 తగ్గే అవకాశం
- అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్లనే

petrol-pump-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
న్యూఢిల్లీ, నవంబర్ 28: గడిచిన ఏడాదిన్నరగా వినియోగదారుడిపై పెట్రో భారాలు మోపిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం ధరలు తగ్గించడానికి సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ.1.02 తగ్గే అవకాశం ఉందని చమురు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. పెట్రోల్ ధరలపై ఈ నెల 30న జరిగే సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.66.42. ఈ నెల 16న లీటర్ పెట్రోల్‌పై రూ.2.22 తగ్గించిన విషయం తెలిసిందే. నవంబర్ నెల మొదటి పదిహేను రోజులలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 115.85 డాలర్లు, రెండో పదిహేను రోజులలో బ్యారెల్ ధర 107 డాలర్లకు తగ్గింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పెరిగినప్పటికీ పెట్రోల్ ధరలు తగ్గడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 2010 జూన్‌లో నియంవూతణ ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకొకసారి చమురు కంపెనీలు పెట్రో ధరలపై సమీక్ష జరుపుతున్నాయి. 2009 జనవరి తర్వాత పెట్రో ధరలు తగ్గించడం ఇది రెండొసారి.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News  

Read more...

కేంద్ర దళాల్లో కొలువుల జాతర

 - 90 వేల కానిస్టేబుళ్ల భర్తీ
- డిసెంబర్ 3న నోటిఫికేషన్



న్యూఢిల్లీ, నవంబర్ 28: 

కేంద్ర సాయుధ దళాల్లో త్వరలో 90 వేల కానిస్టేబుళ్ల పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయేనుంది.

ఈ నియామకాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపట్టనుంది.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేనెల 3వ తేదీన ఎస్‌ఎస్‌సీ విడుదల చేయనుంది.

గ్రూప్-బీ నాన్ గెజిటెడ్, గ్రూప్-సీ నాన్ టెక్నికల్ పోస్టుల నియామకానికి ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహించనుంది.

ఆస్సాం రైఫిల్స్‌లో  8,724, 
బీఎస్‌ఎఫ్‌లో 16,484, 
సీఐఎస్‌ఎఫ్‌లో 10,240, 
ఎస్‌ఎస్‌బీలో 5,864, 
ఐటీబీపీలో 7,180 
కానిస్టేబుళ్ల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. 

వచ్చే ఏడాది అక్టోబర్ 31 కల్లా భర్తీ చేయాలని ఎస్‌ఎస్‌సీ భావిస్తోంది.




Read more...

వీఆర్వో,వీఆర్‌ఏ పోస్టులకు 7న నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను డిసెంబర్ 7న జారీ చేయనున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 29. జనవరి 30న రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలు ఫిబ్రవరి 15న విడుదల చేసి, అదే నెల 24లోపు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తామని తెలిపారు. అయితే వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి సర్కార్ మాట తప్పింది. వీఆర్‌ఏ పోస్టులు గౌరవ వేతనంతో కూడిన కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే. 1172 వీఆర్‌వో పోస్టులు మాత్రమే శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు.


Take By: T News


Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET,  

Read more...

మరో చరిత్రకు నేటితో రెండేళ్లు...









nims05-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema



- 14ఎఫ్ తొలగింపు డిమాండ్‌తో మొదలై..
- తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా చేసుకుని..
- ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ నిరాహారదీక్ష
- తెలంగాణను కుదిపేసిన ఆ 11 రోజులు
- ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమం
- 14ఎఫ్ తొలగింపు డిమాండ్‌తో మొదలై..తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా చేసుకుని చరిత్ర సృష్టించిన కేసీఆర్ నిరాహారదీక్ష
- అన్ని పక్షాలూ తీర్మానానికి ఓకే
- డిసెంబర్ 9న చారివూతక ప్రకటన


తెలంగాణ భగ్గుమన్న ఆ 11 రోజులకు నాంది పలికింది ఈ రోజే! సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఓ మహత్తర అధ్యాయం తెలంగాణ చరివూతకెక్కింది ఈ రోజే! నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ చరివూతలో ఓ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ ఉద్వేగ ఘడియలకు పునాది పడింది ఈ రోజే! డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామంటూ కేంద్రం స్పష్టమైన నిర్ణయం వెలువరించిన ఘట్టానికి నాంది పలికింది ఈ రోజే! అదే నవంబర్ 29! తెలంగాణ ఉద్యమ సారథి కే చంద్రశేఖర్‌రావు.. ప్రాణాలను పణంగా పెట్టి దీక్షాదక్షుడైన రోజు!

(టీ న్యూస్, హైదరాబాద్) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో పోరాటానికి శ్రీకారం చుట్టిన గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష చేపట్టి మంగళవారానికి సరిగ్గా రెండేళ్లు నిండుతోంది. తన ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలా చేసి చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేలా కేసీఆర్ మడప తిప్పని పోరు సలిపారు. చరిత్ర మలుపు తిప్పిన ఖ్యాతిని గడించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందారు. కేసీఆర్ దీక్ష ప్రారంభానికి ముందు నుంచి తెలంగాణ ప్రకటనతో దీక్ష విరమించే వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

KCRREE-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎన్ని కుట్రలు, కుతంవూతాలు పన్నినా వాటన్నింటినీ తెలంగాణవాదులు తిప్పికొడుతూనే ముందుకు సాగుతూ కేసీఆర్‌కు అండగా నిలిచారు. ఈ దీక్ష ప్రస్థానంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురైనా వాటిని తెలంగాణ ప్రజలు వెంటనే సర్దుకొని కేసీఆర్‌కు బాసటగా నిలిచారు. ‘హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు. ఆరవ జోన్‌లో భాగమే. ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’ అంటూ కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.మెదక్ జిల్లా సిద్దిపేటలో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు.

కరీంనగర్ బయల్దేరుతూ..
కరీంనగర్‌కు బయలుదేరే ముందు హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసం, తెలంగాణ భవన్ వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ‘కేసీఆర్ సచ్చుడో. తెలంగాణ వచ్చుడో. తేలిపోవాలి. తెలంగాణ సాధించి జైత్రయావూతను నిర్వహించాలో, కేసీఆర్ సచ్చి శవ యాత్రలో నిర్వహించాలో కూడా తేలిపోవాలి’ అని కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. నివాసం నుంచి బయలు దేరే ముందూ కేసీఆర్ మాట్లాడారు. ‘మళ్లీ మిమ్మల్ని కలుస్తానో లేదో. మీతో ఇంటరాక్ట్ కావడం ఇదే చివరిసారి కావచ్చు’ అంటూ ఆయన విలేకరులను ఉద్దేశించి అన్నారు. భావోద్వేగాల మధ్య కేసీఆర్‌కు కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికారు. కేసీఆర్ సోదరీమణులు సుమతి, విమల, లక్ష్మీ, జయ, సతీమణి శోభ, కూతురు కవిత, మనవళ్లు హిమాంశ్, ఆదిత్య, ఆర్య తదితరులు ఇంటి నుంచి బయటిదాకా వచ్చి వీడ్కోలు పలికారు.

కేసీఆర్‌కు తొలుత సోదరి సుమతి, కూతురు కవిత తిలకం దిద్దారు. సోదరీమణులందరికీ కేసీఆర్ పాదాభివందనం చేశారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావు తాతయ్యా’ అంటూ మనవళ్లు ప్రశ్నించారు. దీనికి చిరునవ్వుతోనే బదులిచ్చి ముందుకు కదిలిన కేసీఆర్ వెనక్కి చూడకుండా కారులోకి చేరుకున్నారు. తెలంగాణ భవన్‌కు చేరుకోగా అక్కడ మహిళా కార్యకర్తలూ తిలకం దిద్దారు. ‘విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజల ఆశీస్సులతో ఆమరణ దీక్షకు వెళ్తున్నా’ అని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ దీక్ష 11రోజులు సాగిందిలా...
29.11.2009 : ఉదయం ఏడున్నర గంటలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్‌లోని తన నివాసం నుంచి మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆమరణ దీక్ష శిబిరానికి బయలుదేరారు. టీఆర్‌ఎస్ శ్రేణులను తప్పించి పోలీసులు కరీంనగర్ శివారులోని అలుగునూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలించి అక్క సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజివూస్టేట్ ఎదుట హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. యావత్ తెలంగాణ భగ్గుమంది.

30.11.2009 : కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిందని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపవూతికి తరలించారు. కేసీఆర్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయించే కుట్రను అమలు చేసింది. ప్రభుత్వం కుట్ర పూరితంగా దీక్షను బలవంతంగా విరమింపజేసిందని ఆసుపవూతిలో, జైలులోనూ దీక్ష కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు.

1.12.9009 : పోలీసులు బలవంతంగా వైద్యానికి ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్ హెచ్చరిక. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు. హైదరాబాద్‌కు మార్చాలని కోర్టులో పిటిషన్.

2.12.2009 : కేసీఆర్ దీక్షను విరమింపచేసేందుకు ప్రభుత్వం తరఫున మంత్రి ఆర్ దూతగా ఖమ్మం ఆసుపవూతికి వచ్చి విజ్ఞప్తి చేశారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఉన్నాయని కేసీఆర్‌కు సైలైన్ పెట్టారు.

3.12.2009 : ఖమ్మం నుంచి భారీ బందోబస్తు మధ్య అర్ధరాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు కేసీఆర్ తరలింపు. నిమ్స్‌లో కేసీఆర్ దీక్ష కొనసాగించారు.

4.12.2009 : నిమ్స్‌లోని జనరల్ వార్డు నుంచి అత్యవసర వార్డుకు కేసీఆర్ తరలింపు. క్షీణించిన కేసీఆర్ ఆరోగ్యం. తెలంగాణ ప్రాంత మంత్రుల భేటీ. ప్రభుత్వం తరఫున నిమ్స్‌కు వచ్చిన మంత్రి దానం నాగేందర్. ఒప్పుకోని కేసీఆర్.

5.12.2009 : తెలంగాణ విషయంలో తన చేతిలో ఏమీ లేదని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన. 48గంటల తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపు.

6.12.2009 : నిమ్స్‌లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కె.రోశయ్య పరామర్శించారు. దీక్షను విరమించాలని విజ్ఞప్తి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసింది. తెలంగాణ ప్రకటన చేయల్సిందేనని కేసీఆర్ డిమాండ్.

7.12.2009 : నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శ. కేసీఆర్ దీక్షపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు సరేనని తమకు అభ్యంతరం లేదని అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల తీర్మానం.

8.12.2009 : కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. దీక్ష విరమించకుంటే కేసీఆర్‌కు ఏమైనా జరగవచ్చని నిమ్స్ వైద్యుల ఆందోళన. తెలంగాణ అంశాన్ని చర్చించాలని అసెంబ్లీలో పట్టుబట్టిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ వాయిదా. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు.

9.12.2009 : ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ పలుమార్లు భేటీ. ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో ముఖ్యమంత్రి రోశయ్య మంతనాలు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు.



Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, KCR, TRS, Harish Rao, Telangana agitation, Telangana issue, Telangana Songs, Songs,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP