కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందింది రూ. కోటి - మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
తిమ్మాజిపేట, అక్టోబర్ 16: తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. కోటి దాకా ముడుపులు అందాయని, అందువల్లే వారు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని, రాజీనామాలకు వెనుకంజ వేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ రూ. 25లక్షలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందాయని పేర్కొనడాన్ని సమర్థ్ధించారు. కేటీఆర్ ఆరోపణల తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా స్పం దించకపోవడమే ఆయన వ్యాఖ్యలను నిజం చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు రూ. కోటి దాకా ముట్టాయని సమాచారం అందుతోందని తెలిపారు.
సీమాంధ్ర సీఎం తన పీఠాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని సీఎం రెచ్చగొట్టి ఉద్రిక్తతకు కారకుడయ్యారని ఆరోపించారు. రైల్‌రోకో సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించడం, అధికార పార్టీ నేతలపై కూడా కేసులు పెట్టడం వెనుక సీఎం హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. రాజీనామాలు చేస్తామని ఢిల్లీలో ప్రమాణాలు చేసి జానాడ్డి మాట తప్పడం సిగ్గు చేటన్నారు.
14మంది మంత్రులు రాజీనామాలు చేస్తే తెలంగాణలో ఈ పరిస్థితే ఉండేది కాదని స్పష్టంచేశారు. తెలంగాణ ఇస్తామని సోనియా స్వయంగా చెప్పిందా అని జూపల్లి ప్రశ్నించారు. సీఎం తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న మీరు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ప్రజలు మిమ్మల్ని క్షమించబోరని, వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఓటూ పడదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం పక్షమో, ప్రజాపక్షమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed
0 comments:
Post a Comment