రభుత్వ నిర్బంధకాండకు నిరసనగా నేడు బంద్
- నేడు రైల్‌రోకో ఉండదు.. దాని స్థానంలో బంద్ పిలుపు
- త్వరలో చలో హైదరాబాద్.. జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడి
-నేతలను నిర్బంధించినా.. పోటెత్తిన జన ప్రవాహం
- రెండో రోజు రైల్‌రోకో దిగ్విజయం
- పది జిల్లాల్లో ఉద్యమ కూత
- పోలీసులే ప్యాసింజర్లుగాతెలంగాణ ఎక్స్‌వూపెస్
- ప్రయాణికులు 13 మందే.. మిగతా రైళ్లోనూ అదే తీరు
- ఆగని నిర్బంధం..715 మంది అరెస్ట్
- పొన్నం, జీవన్‌డ్డి, రాజయ్య, హరీశ్‌లకు జ్యుడీషియల్ రిమాండ్ విధింపు
n వివేక్, విజయశాంతి, కేటీఆర్, కవితకు బెయిల్
అదే పోరు చైతన్యం! అదే ఉద్యమ హోరు! ఇది అచ్చమైన ప్రజా ఉద్యమం! ఉద్యమ నేతలందరినీ జైళ్లలో పెట్టినా.. అక్రమంగా నిర్బంధించినా.. జనమే నాయకత్వం వహించి రైల్‌రోకో రెండోరోజు ఆందోళన కార్యక్షికమాన్ని దిగ్విజయం చేసిన పోరాట స్ఫూర్తి! రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజా ప్రతినిధులను ద్రోహులుగా మార్చేసి కుట్రపూరితంగా కేసులు బనాయించినా.. మొక్కవోని తెగువను ప్రదర్శించింది తెలంగాణ ఉద్యమం! రాష్ట్ర సర్కారు వణికిపోయేలా.. హస్తిన పీఠం కలవరపడేలా.. ద్రోహులకు దిమ్మతిరిగేలా.. పది జిల్లాల్లోనూ పట్టాలపై ఉద్యమం కూతవేసింది. అదే సమయంలో నిర్బంధకాండకు వ్యతిరేకంగా సోమవారంనాడు తెలంగాణ బంద్‌కు సిద్ధమైంది.
రైల్‌రోకో రెండో రోజూ విజయవంతమైందని ప్రకటించిన రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం.. బంద్‌ను కూడా అదే ఉద్యమ స్పూర్తితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగానే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కోదండరాం చెప్పారు. మూడో రోజు రైల్ రోకో స్థానంలో ఈ పిలుపునిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మార్చ్ పేరుతో త్వరలో చలో హైదరాబాద్ కార్యక్షికమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రెండోరోజు రైల్‌రోకోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టాలపైకి వచ్చారు. అక్కడే వంటావార్పు చేసి, దుమ్మురేగేలా ధూంధాం నిర్వహించారు. తన నిర్బంధకాండను కొనసాగించిన సీమాంధ్ర సర్కారు... పెద్ద సంఖ్యలో అరెస్టులకు పాల్పడింది. తెలంగాణలో తెలంగాణ ఎక్స్‌వూపెస్‌నే నడిపించేశామని గొప్పలు చెప్పుకోబోయి అభాసుపాలైంది. తెలంగాణ ఎక్స్‌వూపెస్ పోలీసులే ప్రయాణికులవ్వగా సికింవూదాబాద్ నుంచి కాజీపేట చేరుకుంది. ఇందులో కేవలం 13 మంది ప్రయాణికులే ఉండటం సర్కారును నవ్వులపాలు చేసింది. దీనితో పాటు పలు రైళ్లను నడిపినా.. వాటిలోనూ దాదాపు ఇదే దృశ్యం కనిపించింది. రెండో రోజు కూడా అనేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా రైల్‌రోకో రెండో రోజు ఉద్యమం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 715 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అనేక మందిని ముందస్తుగానే అరెస్టు చేశారు.
రెండోరోజు అరెస్టయినవారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే విద్యాసాగర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. బందోబస్తు మద్య 50 ప్యాసింజర్ రైళ్లు, 43 దూర ప్రాంత రైళ్లు నడిచినట్లు అదనపు డీజీపీ (రైల్వేస్) వీస్‌కే కౌముది చెప్పారు. దాదాపు రైళ్లన్నీ ప్రయాణికులు లేకుండానే నడవడంతో రైల్వే స్టేషన్‌లు బోసిపోయి కనిపించాయి. తొలి రోజు రైల్‌రోకో సందర్భంగా అరెస్టయిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యమకారులను జ్యుడీషియల్ కస్టడీకి పంపగా.. కొందరికి బెయిల్ మంజూరైంది. కరీంగనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్‌డ్డి, వరంగల్ ఎంపీ ఎస్ రాజయ్య, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. మెదక్ ఎంపీ విజయశాంతికి బెయిల్ మంజూరు చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ వివేక్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులకు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,
0 comments:
Post a Comment