కాంగ్రెస్ ధోకా?
- ఘోషిస్తున్న తాజా పరిణామాలు
- సొంత పార్టీ నేతల ఆరోపణలతోబలపడుతున్న వాదనలు
- మళ్ళీ అదే తీరు...నేతలవి అవే మోసాలు!
- ఢిల్లీని ఒప్పించడంలో టీ నేతలు విఫలం
- వెల్లు విమర్శలు
- పరిస్థితి ఇలాగే కొనసాగితే..
-తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ?
హైదరాబాద్, అక్టోబర్ 16 :తెలంగాణపై మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. మంత్రులే తెలంగాణకు అసలు ద్రోహులు... ఇది మాజీ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి చేసిన ఆరోపణ! తెలంగాణ ప్రాంత నేత ఒకరికి అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి ఎర చూపుతున్నది. టీ ఉద్యమంలో మంత్రులు శకుని పాత్ర పోషిస్తున్నారు... ఇవి ఎమ్మెల్సీ కే యాదవడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు! కిరణ్‌కుమార్ సీల్డ్ కవర్ సీఎం. తెలంగాణ ఉద్యమాన్ని అణచేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేలు ఒకొక్కరికి కోటి చొప్పున సొమ్ము ముట్టింది...ఇది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎత్తిన తిరుగుబాటు ధ్వజం! ఇవి మచ్చుకు కొన్నే! కాంగ్రెస్‌లో
తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న నాయకులు, పార్టీ శ్రేణులు ఇంతకంటే ఘాటుగా స్పందించిన ఉదంతాలూ ఉన్నాయి. వీటన్నింటి సారాంశం ఒక్కటే! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మోసం చేస్తున్నది కాంగ్రెస్సే! అటు హస్తినలో, ఇటు రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ పెద్దలు కలిసి చేస్తున్న కుట్ర!
ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ తన మోసాలకు మళ్ళీ తెలంగాణ ప్రాంత నేతలను పావులుగా వాడుకోజూస్తున్నట్లు టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహార శైలితో తేటతెల్లవుతున్నది. ఒక వైపు ఉద్యమంలో ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు ఉద్యమానికి తూట్లు పొడిచే రీతిలో వ్యవహరిస్తున్నారనడానికి వారి తాజా వ్యాఖ్యలే నిదర్శనమన్న విమర్శలు వెల్లు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తి కిరణ్ సర్కార్ పడిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఉద్యమం అంతిమ దశకు చేరుకున్న తరుణంలో పదవులు, ప్రలోభాల వలను టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై విసిరి, ఉద్యమం బలహీనపడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఢిల్లీ వెళ్ళిన వచ్చిన తరువాత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధిష్ఠానం వ్యూహాలతో తెలంగాణ ఉద్యమానికి చెక్ పెట్టేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు, అందులో భాగంగానే టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హైకమాండ్ జాదూను ప్రయోగిస్తూ వారు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేలా తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి, ఇప్పటి ఉద్యమానికి తేడా ఉన్నప్పటికీ అప్పుడు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడూ అలాంటి ఫార్ములాతోనే కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు వెళుతున్నదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. పదవులు, ప్రలోభాలతో టీ కాంగ్రెస్ నేతలను దారికి తెచ్చుకుని టీ ఉద్యమంపై నీళ్ళు చల్లేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిన్నటి వరకు టీ ఉద్యమంలో జోరుగా ముందుకు కదిలిన టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంగా చల్లబడిపోవడం, ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రకటన చేస్తుండడం, టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయాలతో విభేదించడం, సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తుండడం వంటివి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాల్లో భాగమేనని వినిపిస్తోంది.
తెలంగాణపై మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని, మంత్రులే తెలంగాణకు అసలు ద్రోహులని మాజీ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి చేసిన ఆరోపణలు, తెలంగాణ ప్రాంత నేత ఒకరికి అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి ఎర చూపుతున్నదని, టీ ఉద్యమంలో ఆ ప్రాంత మంత్రులు శకుని పాత్ర పోషిస్తున్నారంటూ ఎమ్మెల్యే కే యాదవడ్డి సంధించిన ఆరోపణలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసాల తీరు బయటపడుతున్నదని టీ వాదులు మండిపడుతున్నారు. టీ ఉద్యమం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే రైల్‌రోకో సందర్భంగా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారని, సీఎం కిరణ్ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చుతున్నారని ధ్వజమెత్తిన తీరు చూస్తుంటే తెలంగాణపై కాంగ్రెస్ తీరు ఏమిటో స్పష్టమవుతోందని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఎవవరు మోసం చేశారో ఇప్పటికీ వారు తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోయారు. ఇప్పుడు అలాంటి మోసాలు చేసే నేతలు చరివూతలో ద్రోహుల స్థానంలోనే ఉంటారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు.
ఐక్యంగా ముందుకు సాగిన రోజుల్లో సైతం టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ విషయంలో పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో సఫలం కాలేదు. మరో వైపు పార్టీ అధిష్ఠానం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఈ ప్రాంత నేతల మాటకు విలువ ఇచ్చే ప్రయత్నాలు చేయలేదనేది పార్టీ వైఖరి చూస్తుం స్పష్టమవుతోందని తెలంగాణవాదులంటున్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ఉద్యమంలో దూసుకుపోతూ ఆందోళన బాట పట్టినప్పటికీ ఈ ప్రాంత జనం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. వారి దృష్టిలో తెలంగాణ ద్రోి , తెలంగాణకు మోసం చేస్తున్నది కాంగ్రెస్సేననే భావం బలంగా పాతుకుపోయిందంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని చక్కదిద్దుకోక పోయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లోనే పార్టీని నడిపించినా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు లేక పోలేదని టీ వాదులంటున్నారు.
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,
0 comments:
Post a Comment