దళితునిపై దానం దాదాగిరి.
- తెలంగాణవాదులపై రెచ్చిపోయిన మంత్రి
- నిరసన తెలిపినందుకు లాఠీతో వీరంగం...
- తెగబడ్డ మంత్రి అనుచరగణం
- దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు
- బూతుపురాణం వల్లించి.. స్కూటర్‌ను తన్ని..
- అక్కసు వెళ్లగక్కిన కార్మికమంత్రి దానం నాగేందర్
- టీఆర్‌ఎస్ నాయకుడిపై మూకుమ్మడి దాడి
- దానంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- నిరసన తెలిపినందుకు లాఠీతో వీరంగం...
- తెగబడ్డ మంత్రి అనుచరగణం
- దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు
- బూతుపురాణం వల్లించి.. స్కూటర్‌ను తన్ని..
- అక్కసు వెళ్లగక్కిన కార్మికమంత్రి దానం నాగేందర్
- టీఆర్‌ఎస్ నాయకుడిపై మూకుమ్మడి దాడి
- దానంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

పికెట్(హైదరాబాద్), అక్టోబర్ 16 :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఆదివారం రౌడీ అవతారమెత్తారు. తన అనుచరులతో కలిసి తెలంగాణవాదులపై దాడికి తెగబడ్డారు. పోలీసుల చేతుల్లో నుంచి లాఠీని లాక్కొని వీరంగం సృష్టించారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. అంతటితో ఆగకుండా స్కూటర్‌పై అక్కసును వెళ్లగక్కారు. కసి తీరా ఆ వాహనాన్ని తన్ని బూతు పురాణం వల్లించారు. దళిత యువకుడు, టీఆర్‌ఎస్ నాయకుడు శ్రవణ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నా వదలలేదు. ‘ఒరేయ్ నీ అ..’ అంటూ దుర్భాషలాడారు. అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూశారు. మంత్రి గూండాయిజానికి భీతిల్లిన జనం పరుగులు తీశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాజీనామా చేయాలని నిరసన తెలిపినందుకే మంత్రి ఇలా దాదాగిరి చేసి ఈస్ట్‌మాడ్‌పల్లిలో రెచ్చిపోయారు. మంత్రి దానం నాగేందర్ ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఈస్ట్ మారేడుపల్లిలో స్టార్ హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించేందుకు బయలుదేరారు.


దీంతో నర్సింహ యాదవ్ తప్పించుకొని వెళ్లగా దళిత యువకుడు, టీఆర్‌ఎస్ నేత శ్రవణ్ మాత్రం దొరికిపోయారు. శ్రవణ్‌పై మంత్రి, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. అంతటితో ఆగని మంత్రి అక్కడే ఉన్న పోలీసుల చేతిలో నుంచి లాఠీని లాక్కొని తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. దాడిలో గాయపడ్డ శ్రవణ్ భయంతో పరుగులు తీసి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నారు. అయినా మంత్రి వదలలేదు. ‘ఒరేయ్.. నీ అ..’ అంటూ బూతులు అందుకున్నారు. మళ్లీ దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చేతులుడిగి చూశారు. దాడిని ఆపలేకపోయారు. ‘నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. లేకుంటే నిన్ను సస్పెండ్ చేయిస్తా’నంటూ తుకారాంగేట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కిరణ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన హెల్త్ కేర్ సెంటర్‌ను ప్రారంభించి తిరిగి బయటకు వచ్చారు.
మంత్రి తీరుపై తెలంగాణవాదులు మండిపడ్డారు. ఆయను అడ్డుకొని నిరసన తెలిపారు. ‘మంత్రి స్థానంలో ఉండి మాపై దా చేస్తావా’ అంటూ మహిళలు, యువకులు నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి తుకారంగేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రౌడిషీటర్‌తో మంత్రి హల్‌చల్!
అడ్డగుట్టకు చెందిన డి.మోహన్‌పై గత బోనాల పండుగ సందర్భంగా కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. కాగా ఆదివారం రాష్ట్ర కార్మిక మంత్రి దానం నాగేందర్‌తో కలిసి తెలంగాణవాదులపై మోహన్ దాడికి దిగాడు. శ్రవణ్‌పై దాడికి పాల్పడిన మంత్రి దానంపై తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,
0 comments:
Post a Comment