లగడపాటి రాకతో పెళ్లి మండపంలో మార్మోగిన ‘జై తెలంగాణ’ నినాదాలు
జీడిమెట్ల: తెలంగాణ వ్యతిరేకి లగడపాటి ఆదివారం కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. పేట్‌బషీరాబాద్‌లోని బీబీఆర్ కల్చరల్ సోసైటీ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కూతురి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను స్థానిక తెలంగాణవాదులు ‘జైతెలంగాణ’ నినాదాలతో స్వాగతం పలికారు. దీంతో లగడపాటి ఖంగుతిన్నారు. ఓ పక్క వివాహ ఆహ్వానితులు ఆయనకు ఆహ్వానం పలుకుతుండగా, మరో పక్క వివాహానికి హాజరైన వేలాది మంది సామాన్య ప్రజానీకం ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’ అంటూ పెళ్లి మండపంలో నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాల పట్ల వక్రభాష్యం చేస్తున్న లగడపాటిని చూసిన సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కళ్యాణ వేదికపైకి ఎక్కిన లగడపాటిని వ్యతిరేకిస్తూ ప్రజలు నినాదాలు చేశారు. దీంతో లగడపాటి రాజగోపాల్ బిత్తరపోయారు. తెలంగాణ ప్రజల ఆవేశాలను చూసి అవాక్కయ్యారు.
నెలాఖరులోగా కాంగ్రెస్ వైఖరి వెల్లడి
తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేసిందని, ఈ నెలాఖరులలోగా స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమాడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటుందన్నారు. ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగానే ఉన్నందున ప్రత్యేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణల అంశంపై మిగిలిన పార్టీలు కూడా వైఖరి వెల్లడించాలని లగడపాటి డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైల్‌రోకోలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అరెస్టులు కావడం విచారకరమన్నారు. వారికి అండగా ఉండాలని సీఎం కిరణ్‌ను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరినట్లు ఆయన తెలిపారు.

Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, Tags: bandh in Telanagana, schools closed

0 comments:
Post a Comment