ఉన్మాదుల చేతిలో ఇద్దరు విద్యార్థినుల బలి
- వరంగల్‌లో స్వాతి హత్య
- పరీక్షరాసి వస్తుండగా దారుణం
- కామాడ్డిలో రఫియా బలి
- గొంతు కోసిన కిరాతకుడు
- అనంతరం ఆత్మహత్యాయత్నం
- వరంగల్‌లో నేడు నిరసనలకు విద్యార్థి సంఘాల పిలుపు
వరంగల్, కామాడ్డి, అక్టోబర్ 29 ():ఒక ఉన్మాదం! ఇద్దరు విద్యార్థినుల నిండు ప్రాణాలు బలి! ఒకే రోజు రెండు దారుణాలు! మూడేళ్ల క్రితం యాసిడ్ దాడితో ఇంజనీరింగ్ విద్యార్థిని స్వప్నికను పొట్టనబెట్టుకున్న శ్రీనివాస్ ఉదంతం జరిగినచోటే.. ఇప్పుడు విచ్చుకత్తి వికటాట్టహాసం! ఇది వరంగల్ నగరం హన్మకొండలోని వడ్డ్డెపల్లిలో! అటు నిజామాబాద్‌లోనూ ఇదే ఘోరం! అక్కడా అదే ఉన్మాదం..
ప్రేమించలేదని ఆక్రోశం! యువతిగొంతు కోసి చంపి.. తానూ ఆత్మహత్యకు పాల్పడిన వైనం! చట్టం కఠినమవుతున్నా.. ఉన్మాదులు ఎన్‌కౌంటర్ అవుతున్నా.. తగ్గని దారుణాలు! మాయమైపోతున్న మనవత్వానికి నిలు ఉదాహరణలు! ఆడబిడ్డల తల్లిదంవూడులకు కడుపుకోతలు!
వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన రాజమౌళి రెండవ కూతురు స్వాతి శనివారం రాత్రి 7గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. కాజీపేట సోమిడిలోని తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న స్వాతి కొంత కాలంగా హన్మకొండ నయీంనగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. శనివారం హసన్‌పర్తి మండలంలోని ఎర్రగట్టు గుట్టవద్ద గల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ పరీక్ష ఉండటంతో స్నేహితురాలు రమతో కలిసి వెళ్ళింది.
కంప్యూటర్ సర్వర్ డౌన్ కావడంతో పరీక్ష ఆలస్యమైంది. రాత్రి ఏడు గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి ద్విచక్షికవాహనంపై తిరుగువూపయాణం అయింది. వడ్డెపల్లి సమీపంలోని పొద్దుటూరి గార్డెన్స్ వద్దకు రాగానే ఎవరో వ్యక్తి స్వాతి సెల్‌కు ఫోన్ చేసి అక్కడే ఆగాలని కోరాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి స్వాతి గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్వాతి గొంతుతెగి రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష్యసాక్షి రమ షాక్‌కు గురైంది. కొద్ది సేపటికి తేరుకుని తన ఫోన్ ద్వారా క్లాస్‌మేట్‌కు సమాచారాన్ని చేరవేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఇద్దరు యువకులు బాధితురాలిని హుటాహుటిన ప్రైవేటు ఆస్పవూతికి తరలించారు. వారు చేర్చుకోడానికి నిరాకరించడంతో ఎంజీఎంకు తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగానే స్వాతి ప్రాణాలు కోల్పోయింది. కూతురు చనిపోయిన వార్త తెలుసుకుని ఆస్పవూతికి వచ్చిన తండ్రి రాజమౌళి భోరున విలపించారు. తల్లి కడుపు శోకాన్ని ఆపేవారే లేకపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చంపిందెవరు?: స్వాతి హత్య ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతిని ఆమె బావే హత్య చేశాడని ఒక వాదన వినిపిస్తున్నది. స్వాతి ఉంటున్న హాస్టల్ పక్కన నివాసం ఉండే నజీర్ అనే యువకుడు అతడి స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడనే ప్రచారమూ జరుగుతోంది. ఫోన్‌లో స్వాతిని హెచ్చరించిన దుండగుడు కొద్దిసేపటికే దారుణానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లిదంవూడులు కూడా నజీర్ అనే యువకుడు కూతురును బలితీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ రాజయ్య నజీరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఇక నిజామాబాద్ జిల్లా కామాడ్డి పట్టణంలో రఫియా(17) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని స్నేహపురి కాలనీకి చెందిన రఫియా ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్, ప్రశాంత్, రంజిత్‌లు డైట్ శిక్షణ పొందేందుకు పట్టణానికి వచ్చారు. ఎనిమిది నెలలుగా వీరు రఫియా ఇంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వీరిలో లక్ష్మణ్ రఫియాపై కొంతకాలంగా కన్నేశాడు. శనివారం రాత్రి తనను ప్రేమించాలని కోరాడు. దీనికి రఫియా నిరాకరించింది. దాంతో రఫియాపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. అటు తర్వాత కూరగాయలు కోసే కత్తితో గొంతు కోశాడు. రఫియా అరుపులు విన్న కుటుంబ సభ్యులు గది వద్దకు చేరుకుని తలుపు కొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా రఫియా మృతి చెంది ఉంది. లక్ష్మణ్ కూడా గొంతు కోసుకున్నాడు. లక్ష్మణ్‌ను ఆస్పవూతికి తరలించారు.
0 comments:
Post a Comment