హైదరాబాద్ దవాఖానాలు.. ఆంధ్రా బాబుల అడ్డాలు! కార్పొరేట్ బీమారి ------------- గుత్తేదార్ల గత్తర-2
- వైద్యం వ్యాపారమైన చోట సీమాంధ్ర వ్యాపారులదే హవా!
- హైదరాబాద్‌లో 23 కార్పొరేట్ ఆస్పవూతులు
- అందులో సీమాంవూధులవే 22
- తెలంగాణ వ్యక్తులది ఒక్కటే
- ఎంపీలకూ వైద్య వ్యాపారాలు
- నీరుగారిన సర్కారీ వైద్యం
- ఆరోగ్యశ్రీ.. అంతులేని దోపిడీ
- సీమాంధ్ర ఆస్పవూతులకు కాసుల వర్షం
- కుదేలవుతున్న తెలంగాణ నర్సింగ్‌హోంలు
- అణిగిపోయిన నిజాం స్పెషల్ దవాఖానాలు
పోగుపడిన అదనపు సంపదను రెట్టింపు చేసుకోవడం ఎలా? వ్యాపారాలు ఎన్ని? అవి ఏవి? నూరు మార్కుల ప్రశ్న! దీనికి సీమాంధ్ర బడాబాబుల వద్ద బోలెడు సమాధానాలు! ఒకరు రోడ్డు కాంట్రాక్ట్‌లతో చెలరేగిపోతే.. మరొకరు ప్రాజెక్టులతో విజృంభించేస్తున్నారు! ఇవన్నీ ఎందుకనుకున్న మరికొందరు ఏకంగా వైద్యాన్ని వ్యాపారం చేసిపారేశారు! కొందరు ఘటికులు ఎంపీలుగా ఉండి.. కాంట్రాక్ట్‌లు ఇబ్బడిముబ్బడిగా చేస్తూనే.. సైడ్ బిజినెస్‌గా వైద్యాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా హైదరాబాద్‌లో ముంచుకొచ్చినవే కార్పొరేట్ ఆస్పవూతులు! ఒకప్పుడు అక్కడ ధనికులకే వైద్యం. కానీ.. ఎంతకాలం ధనికులపై ఆధారపడతారు? విస్తరణ ఎలా? అందుకు సర్కారు సమాధానం చెప్పింది. ఆరోగ్యశ్రీ పేరుతో వరం ప్రకటించేసింది. కట్ చేస్తే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వాస్పత్రులను బొందపెట్టి.. రోగులను కార్పొరేట్ దారి పట్టించేసింది.
దీంతో ఒకప్పుడు కేవలం ధనికులకే వైద్యంచేసిన కార్పొరేట్ దవాఖానాలు.. ఇప్పుడు పేదల పేరుతోకోట్లు వెనకేసుకుంటున్నాయి! నిజానికి హైదరాబాద్‌లో నిజాం కాలంలోనే ఉస్మానియా ఆస్పత్రి మొదలు బొక్కల దవాఖానా (ఇప్పు డు నిమ్స్), నీలోఫర్ (చిన్నపిల్లలకు), మెటర్నిటీ ఆస్పత్రి, ఛాతీ రోగాల ఆస్పత్రి సహా అన్నిరకాల చికిత్సలకు వేర్వేరు ఆస్పవూతులుండేవి. ఇవి ఆయా రంగాల్లో స్పెషల్ ఆస్పవూతులే! కానీ సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్‌ఆస్పవూతుల కార్పెట్ల కింద అణిగిపోయాయి! ప్రస్తుతం హైదరాబాద్‌లో 23 కార్పొరేట్ ఆస్పవూతులుంటే తెలంగాణ వ్యక్తులకు చెందినది ఒకే ఒక్కటి! ఇది సీమాంధ్ర ఆరోగ్య దందా!
హైదరాబాద్ అక్టోబర్ 29 : జబ్బుచేసి ప్రాణం మీదికి వస్తే.. జిల్లా ఆస్పవూతికి పరుగు. అక్కడా లాభం లేదంటే ఉస్మానియా ఉందన్న ధీమా! నిమ్స్ ప్రాణం నిలబెడుతుందన్న భరోసా! కార్పొరేట్ ఆస్పవూతికి వెళితే ప్రాణం నిలిచే సంగతేమోగానీ.. బిల్లు చూశాక.. నిలిచిన ప్రాణం కొండెక్కడం ఖాయం! ఈ క్రమంలోనే కార్పొరేట్ ఆస్పవూతులవైపు కన్నెత్తి చూసేందుకు కూడా జనం సాహసించలేదు. క్రమక్షికమంగా ఈ పరిస్థితిలో మార్పు తేగలిగింది రాష్ట్ర సర్కారు. మెరుగైన ఆరోగ్యం పేరుతో వివిధ పేర్లతో కేసులను కార్పొరేట్ ఆస్పవూతులకు రిఫర్ చేయడం మొదలు పెట్టింది. ఒక్కో కేసుకు నిధులు విడుదల చేస్తూ కార్పొరేట్‌ను నిలబెట్టింది. మురికి సహించని కార్పొరేట్‌లకు మురికి జనం రోగంతో రావడం మహద్భాగ్యంగా పరిణమించింది. ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు కార్పొరేట్ ఆస్పవూతులకు రాజధానిగా భాసిల్లుతున్నది.
మొత్తంగా ఆరోగ్య వ్యవస్థనే శాశించే స్థాయిలో నడుస్తున్నాయి. ఒకప్పుడు రోగులు లేక ఈగలు తోలుకున్న కార్పొరేట్ ఆస్పవూతులు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 23 కార్పొరేట్ ఆస్పవూతులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! ఇక్కడా సీమాంధ్ర ఆధిపత్యమే! సీమాంధ్ర రాజకీయ నాయకుల ప్రాపకంలోనివే! ఉన్న అన్ని కార్పొరేట్ ఆస్పవూతుల్లో తెలంగాణ వ్యక్తులు ఏర్పాటు చేసింది ఒకే ఒక్కటి!
బాబు హయాంలో మొదలు
చంద్రబాబు హయాం నుంచి హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పవూతుల హవా మొదలైంది. చంద్రబాబు పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ తరువాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌డ్డి హయాంలో కార్పొరేట్ ఆస్పవూతులు హైదరాబాద్‌కు పోటెత్తాయి. వీరిద్దరి హయాంలోనే దాదాపు 20 కార్పొరేట్ ఆస్పవూతులు వరకు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో అన్నింటా రంగవూపవేశం చేసిన సీమాంధ్ర రాజకీయ నాయకులు కార్పొరేట్ రంగంలోనూ చేరి నర్సింగ్‌హోంల రక్తం పీల్చుతున్నారు. కావూరి సాంబశివరావుతో పాటు, లగడపాటి రాజగోపాల్‌లు మెడ్విన్, గ్లోబల్ ఆస్పవూతులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా కార్పొరేట్‌లోనూ సీమాంధ్ర ప్రాంతం, రాజకీయ నాయకుల హవా కొనసాగుతోంది.
బ్రాంచ్‌లతో నర్సింగ్‌హోంల మూత
ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ నర్సింగ్‌హోం అసోసియేషన్‌లో నమోదైన ప్రకారం చిన్న ఆస్పవూతుల సంఖ్య 962. వీటిల్లో మెజార్టీ ఆస్ప్రవూతులు తెలంగాణ వారివే. కార్పొరేట్ ఆస్పవూతులు వచ్చాక వీటికి పని తగ్గిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ ట్రస్టు గుర్తించిన 106 ప్రైవేటు ఆస్పవూతుల్లో కేవలం 30మావూతమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారివి. ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట ఏమోగానీ.. కార్పొరేట్ ఆస్పవూతుల పాలిట వరవూపదాయిని అయ్యింది. అప్పటి వరకున్న కార్పొరేట్ ఆస్పవూతులు మూత దిశలో ఉండేవి. దీంతో అప్పటికే హైదరాబాద్‌లో వేళ్లానుకుని ఉన్న వారు ఒక గ్రూప్‌గా ఏర్పడి ఆరోగ్యశ్రీ పరిధిలోకి కార్పొరేట్‌ను కూడా తేవాలని, దీని వల్ల ప్రభుత్వానికి మంచిపేరు రాడమేకాక... తమ ఆస్పవూతులూ నిలబడతాయని వేడుకున్నారు. ఈ సేవకుగాను సర్కారు పెద్దలకు భారీగానే ముడుపులు ముట్టాయని అప్పట్లో ఆరోపణలుకూడా వచ్చాయి. ఫలితంగా అప్పటిదాకా ఈగలు తోలుకున్న కార్పొరేట్ ఆస్పవూతులు.. ఒక్కసారిగా రోగుల కిటకిటతో కళకళలాడాయి.
ప్రస్తుతం ఒక్క కార్పొరేట్ ఆస్పవూతులకే యేటా ఆరోగ్యశ్రీ కింద రూ.800కోట్ల వరకు చెల్లిస్తున్నారు. 2010లో ఆరోగ్యశ్రీ కింద రూ.1554కోట్లు ఖర్చు చేయగా సీమాంధ్ర ప్రాంతానికి రూ. 1438కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రాంతానికి కేవలం రూ.116కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దేశవ్యాప్తంగా కేర్ ఆస్పవూతికి 17 బ్రాంచ్‌లుండగా, ఆపోలో ఆస్పవూతికి అంతర్జాతీయ స్థాయిలో 51 మేజర్ ఆస్పవూతులు ఉన్నాయి. గ్లోబల్ ఆస్పవూతికి దేశవ్యాప్తంగా 12 బ్రాంచీలు ఉండగా 4 ఆంధ్రవూపదేశ్‌లోనే ఉన్నాయి. కిమ్స్‌కు నాలుగు బ్రాంచ్‌లున్నాయి. కార్పొరేట్ ఆస్పవూతులు విచ్చలవిడిగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడంతో నర్సింగ్‌హోంలకు రోజురోజుకు పని తగ్గిపోతోంది. పైగా ఆరోగ్యశ్రీ వచ్చాక రూపాయి ఖర్చు లేకుండానే కార్పొరేట్ వైద్యం అందుతుండటంతో ప్రజలు కూడా కార్పొరేట్‌కు మొగ్గు చూపుతున్నారని నర్సింగ్‌హోంల నిర్వాహకులు అంటున్నారు.
సబ్సిడీల సాగులో కార్పొరేట్స్
కళ్లు తిరిగే ఫీజులతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా సర్కారు సాయాన్నీ పొందుతున్న సీమాంధ్ర కార్పొరేట్ ఆస్పవూతులు... ప్రభుత్వం నుంచి సబ్సిడీలనూ భారీగానే పొందుతున్నాయి. అపోలో ఆస్పవూతిని ప్రభుత్వం 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. అగ్రిమెంట్ సమయంలో యేటా ఆస్పవూతిలో 15 శాతం పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలని రాసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఉచితంగా వైద్యం చేసిన దాఖలాలు లేవు. పైగా పేదలను ఆస్పత్రి దారిదాపుల్లోకే రానిచ్చే పరిస్థితి లేదు. మిగిలిన కార్పొరేట్ ఆస్పవూతులు కూడా ప్రభుత్వం నుండి ఏదో విధంగా పన్ను మినహాయింపును పొందుతున్నాయి. ఆరోగ్య పరికరాల కొనుగోళ్లలో భారీ సబ్సిడీ పొందుతున్నాయి. ఆరోగ్యశ్రీ వచ్చాక ప్రభుత్వమే కార్పొరేట్ ఆస్పవూతులకు డబ్బుల పంపకం చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సౌకర్యాలూ కార్పొరేట్‌కు గంపగుత్తగా అందుతున్నాయి.
గచ్చిబౌలిలో రెండేళ్ల క్రితం పదికోట్ల విలువైన భూమిని మెడికల్ టూరిజం పేరుతో సీమాంధ్ర వ్యక్తులకు అతితక్కువ ధరకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇందులో కేర్, మ్యాక్స్ ఐకేర్ ఆస్పవూతులు ప్రధానంగా దక్కించుకున్నాయి. ఇలా పేద ప్రజలకు సేవ చేస్తున్నామనే పేరుతో సీమాంధ్ర కార్పొరేట్ శక్తులు ప్రజల ధనాన్ని గుటకాయస్వాహా చేస్తున్నాయని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు.
కార్పొరేట్ ఆస్పవూతులు ప్రారంభించే సమయంలోనే సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద పేదలకు వైద్యం చేసేందుకు అంగీకరిస్తాయి. ఈ మేరకు ఆస్పవూతిలో ఉండే బెడ్ల ఆధారంగా 10శాతం ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు ఒప్పుకుంటాయి. అయితే ఏ కార్పొరేట్ ఆస్పవూతిలోనూ ఈ షరతును పాటించడం లేదు. పైగా దీనిపై ప్రభుత్వ నిఘాగానీ, నియంవూతణ గానీ లేకపోవడంతో కార్పొరేట్ ఆస్పవూతులు ఆడిందే ఆటగా సాగుతున్నాయి.గతంలో వైద్య పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని చెల్లించేవారు. ఈ సమయంలోనూ ఆస్పవూతులు పేదల ప్రజలను చూపించి అతి తక్కువ కస్టమ్స్ డ్యూటీని చెల్లించేవి. అయితే ఏనాడూ కార్పొరేట్ ఆస్పవూతులు పేదలకు వైద్యం చేసిన దాఖలాలు లేవు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్టు. అయితే ఈ ట్రస్టు అనేక అవకతవకలకు మారుపేరుగా మారింది. రూ.200కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు తీసకుంది.
అయితే ఇందులోవైద్యం చేసుకునే వారిలో పేదల సంఖ్య నామమావూతమే. స్థలం తెలంగాణదే అయినా ఒక్కరు కూడా తెలంగాణ డైరెక్టర్ కాలేదు. ఈ ట్రస్టుకు తెలంగాణ వారి నుండి విరాళాలు అందాయి. ఈ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాక కొన్ని టెస్టులను బయట చేసుకురమ్మని అన్న ఉదాహరణలు కూడా ఉన్నాయి.
కేర్ ఆస్పత్రి యాజమాన్యం గుండెసంబంధ వ్యాధులున్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ను ఆసరాగా చేసుకుని, అవ్వే ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేస్తూ, ఫౌండేషన్‌కు చూపిస్తూ డబ్బులు దండుకుంటోందనే ఆరోపణలున్నాయి.
నిమ్స్‌లాంటి ఆస్పవూతుల్లో గుండె జబ్బుకు రూ.60వేల వరకు ఖర్చు అవుతుంటే ఇతర కార్పొరేట్ ఆస్పవూతుల్లో మాత్రం రూ.లక్షన్నరకు పైగానే వసూలు చేస్తున్నారు. కొన్ని ఆస్పవూతుల్లో నిర్ణీత రుసుం వసూలుపై నిబంధనలు లేకపోవడంతో పెషెంట్ల ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Take By: http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=40508
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
0 comments:
Post a Comment