నిర్బంధం పోలవరం యాత్రను అడ్డుకున్న ఆంద్రా పోలీసు
- తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులోని జీలుగుమిల్లిలో ఉద్రిక్తత
- విద్యార్థి జేఏసీ నేతల అరెస్టు
- ఇదేమైనా పాకిస్థాన్ సరిహద్దా?
- మండిపడ్డ జేఏసీ నేతలు
సత్తుపల్లి, అక్టోబర్ 29 (: తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసే పోలవరం ప్రాజెక్టుపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఓయూ విద్యార్థి జేఏసీ తలపెట్టిన బస్సుయావూతను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భద్రాచలం నుంచి బయలుదేరిన జేఏసీ బృందం కుక్కునూరు, అశ్వారావుపేట, పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి, జంగాడ్డిగూడెం, బుట్టాయిగూడెం మీదుగా పోలవరం చేరుకోవాల్సి ఉంది. ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులోని జీలుగుమిల్లి వద్ద యాత్రను పోలీసులు అడ్డుకుని, విద్యార్థి జేఏసీ నేతలను అరెస్టు చేశారు. వారి వెంట ఉన్న న్యాయవాదుల జేఏసీ, వైద్యుల జేఏసీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాత్ర శనివారం ఉదయం భద్రాచలం నుంచి పోలవరంకు బయల్దేరింది.
ఓయూ విద్యార్థులను అడ్డుకుంటామని పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థి సంఘాలు ప్రకటించి, ఆందోళన చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులోని జీలుగుమిల్లులో భారీగా పోలీసులను మోహరించారు. జీలుగుమిల్లు పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించినట్లు పోలీసులు ప్రకటించారు. ఏలూరు రేంజి డీఐజీ సూర్యవూపకాశ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. యాత్ర జీలుగుపల్లి పరిసరాల్లోకి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేఏసీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వైఖరితో ఆగ్రహించిన విద్యార్థులు, న్యాయవాదులు జీలుగుమిల్లి రహదారిపై బైఠాయించి, జై తెలంగాణ నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్‌కు మీరెలా వస్తున్నారో... పోలవరం చూసేందుకు తాము కూడా అలాగే వెళుతున్నామని అన్నారు. తామేదో పాకిస్థాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అడ్డుకోవడమేమిటంటూ మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు ఎక్కించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైపు తరలించేందుకు సిద్ధమవగా కొందరు జేఏసీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారిని అశ్వారావుపేట పట్టణానికి తీసుకువచ్చి వదిలేశారు.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
0 comments:
Post a Comment