పోలవరం టెండర్ వార్ ‘ఢీ’జైన్
- ప్రాజెక్టు డిజైన్ మార్చేది లేదు
- 12.5% తక్కువకు టెండర్ వచ్చింది
- రద్దయితే నష్టం
ఎవరు భర్తీ చేస్తారు?
- పీసీసీ చీఫ్ బొత్స ప్రశ్న
- అటవీ చట్టాలు బొత్సకు తెలుసా?
- గిరిజనులను ముంచే ప్రాజెక్టు వద్దు
- ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కట్టాల్సిందే
- కాంగ్రెస్ ఎంపీ కేకే డిమాండ్
- టెండర్లు రద్దు చేయండి
- సీఎంకు బాబు లేఖ
- ఇది రాయడానికి నాలుగు రోజులా?
- బాబుకు టీఆర్‌ఎస్ నేత వినోద్ ప్రశ్న
- టెండర్లు తెలంగాణ వారికి దక్కకూడదా?
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ప్రశ్న
- టీడీపీ.. కాంట్రాక్టర్ల పార్టీ: ఈటెల గుస్సా
పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో మొదలైన చర్చ... ఇప్పుడు దాని డిజైన్, నిర్మాణాలనూ కలుపుకొంటున్నది. టెండర్ల రద్దుతో పాటు డిజైన్ మార్పు డిమాండ్ కూడా గట్టిగా ముందుకు వస్తున్నది. రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోలవరం నిర్మాణం ఆపాల్సిందేనని టీఆర్‌ఎస్ స్పష్టం చేయగా.. కాంగ్రెస్‌లో భిన్న వైఖరులు వెలువడ్డాయి. టెండర్లు రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంకు లేఖరాయగా.. అసలు విషయం పక్కకు పెట్టి పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ సీపీఎం స్పందించింది. మంగళవారం విలేకరులతో మాట్లాడిన పీసీసీ రాష్ట్ర చీఫ్ బొత్స సత్యనారాయణ... ‘‘పోలవరం డిజైన్ మార్చేది లేదు.. ఇది రాష్ట్ర బహుళ ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు. రాజకీయ నేతలు పెద్ద మనసుతో సహకరించండి’’ అని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. టెండర్లు రద్దయితే వేరే సంస్థలు 12.5% తక్కువ కోట్ చేయడానికి ముందుకు రాకపోయినా, అంతకంటే ఎక్కువకు కోట్ చేసినా ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు.
ఇది రాష్ట్రం మొత్తానికి పనికొచ్చే ప్రాజెక్టన్న బొత్స.. ముంపుతో నిర్వాసితులయ్యేవారికి మెరుగైన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ కే కేశవరావు... లక్షలాది గిరిజనులకు నష్టం కల్గించే ప్రాజెక్టులు మాకు వద్దు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందే’’ అని స్పష్టం చేశారు. గిరిజనులకు కల్పించిన అటవీ హక్కుల చట్టం గురించి బొత్సకు ఏం తెలుసని ప్రశ్నించారు. మరోవైపు ఈ వివాదం మొదలైన ఇన్ని రోజులకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పోలవరం టెండర్లు రద్దు చేసి, మళ్లీ పారదర్శకంగా టెండర్లు పిలవాలని సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టులకు జాతీయహోదా తెప్పించేందుకు కృషి చేయాలని అన్నారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన టీఆర్‌ఎస్ నేత వినోద్‌కుమార్... ఈ విషయం రాయడానికి నాలుగు రోజులు పట్టిందా? అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తే లక్షల మంది నిరాక్షిశయులవుతారన్న సంగతి తెలిసినప్పటికీ ఆ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. టెండర్ల వ్యవహారంలో జరుగుతున్న రాద్ధాంతంపై స్పందించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు... ‘రాష్ట్రంలో ఏ టెండర్లయినా ఆంధ్రావారికే దక్కాలా? తెలంగాణ వారికి హక్కు లేదా? అని నిలదీశారు. అసలు విషయాన్ని పక్కకు నెట్టి అనవసర విషయంపై పార్టీలు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. పోలవరం ప్రస్తుత డిజైన్‌తో తెలంగాణకు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఒరిగేది శూన్యమని చెప్పారు. ఇదిలా ఉండగా.. టెండర్ల విషయంలో కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీపై పరువు నష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. కాంట్రాక్టర్ల పార్టీగా మారిందని టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆస్తుపూన్నో, కేసీఆర్ ఆస్తుపూన్నో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాలు విసిరారు.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project,
0 comments:
Post a Comment