పక్షం రోజుల్లో తేల్చేయండి!
-పార్టీ సీనియర్లకు సోనియా ఆదేశం?
-తెలంగాణపై నిర్ణయం లేదా.. రోడ్ మ్యాప్!
-పార్లమెంటు సమావేశాల్లోపే వెల్లడి
-వచ్చే నెల 15న విదేశాలకు సోనియా
-పూర్తి స్థాయి చికిత్స కోసం వెళుతున్న మేడం
-ఆ లోపే విభజనపై కీలక ప్రకటన వెల్లడి?
-పురికొల్పుతున్న ఇతర పరిణామాలు
-యూపీ ఎన్నికల్లో విభజనే కాంగ్రెస్ అస్త్రం
-ఢిల్లీని కదిలించిన సకల జనుల సమ్మె
న్యూ ఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 25 :రెండేళ్లుగా రగులుతున్న తెలంగాణ సమస్యను కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెలలో పరిష్కరించనున్నాయా? రాష్ట్ర విభజన వ్యవహారం పార్లమెంటు సమావేశాల్లోపే ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయవర్గాలు. ఇందుకు బలమైనవాదనలనూ ఆ వర్గాలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి చికిత్స కోసం సోనియాగాంధీ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. నవంబర్ 15న ఆమె విదేశాలకు వెళతారని తెలుస్తున్నది. ఇదే నెలలో ప్రధాని మన్మోహన్ కూడా అధిక సమయం పర్యటనకు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు తేల్చేయాలని ఢిల్లీలోని పార్టీ సీనియర్లకు సోనియా నుంచి సోమవారం స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు ఏఐసీసీలోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఇప్పటికే వివిధ స్థాయిల్లో తెలంగాణ సమస్యపై పూర్తిస్థాయి అధ్యయనం జరిగినందున ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని పార్టీ పెద్దలను ఆదేశించిన సోనియాగాంధీ, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలను తన ముందు చర్చించాలని పురమాయించినట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి.
పక్షంరోజుల్లో ఒక కొలిక్కి తేవాలని ఆమె ఆదేశించారని తెలిపాయి. నవంబర్ రెండో వారంలోపు ప్రకటన వెలువరించే విధంగా కసరత్తు ముగించాలని పార్టీ సీనియర్లకు సోనియా సూచించినట్లు తెలిసింది. ‘‘మారిన పరిస్థితుల్లో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఏ కొద్దిమందో తప్ప ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు కూడా తెలంగాణపై తక్షణ నిర్ణయాన్నే కోరుకుంటున్నారు. మెజారిటీ అభివూపాయం అంటూ సీమాంధ్ర పక్షపాతంగా వ్యవహరిస్తున్న వారి వల్లనే కొంత జాప్యం జరుగుతోంది. రాష్ట్రం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ సమస్యలను పెంచుకోవటంలో ఔచిత్యం లేదు. అందుకే సత్వర నిర్ణయం ఇప్పటికైనా తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది’’ అని జాతీయ నేత ఒకరు తమతో జరిపిన చర్చల్లో ప్రస్తావించారని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. దీపావళి తర్వాత కోర్ కమిటీ సభ్యులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.
రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు మరింతకాలం కొనసాగితే ఏర్పడే పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది హస్తిన నేతల్లో సైతం కలవరం కలిగిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణపై జరిగిన ఆందోళనలు, వివిధ స్థాయిల్లో జరిగిన చర్చలు, నివేదికలు పరిశీలించి తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. పార్లమెంటు సమావేశాలు నవంబర్ 3వ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ అంశంపై గత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. బిల్లు పెడితే ఆమోదించేందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. ఈ సారి సమావేశాల్లోనూ తెలంగాణ అంశం ఉభయ సభలనూ దద్దరిల్లిజేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు సొంత పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు తమ లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని, పార్టీని ఇరకాటంలో పెట్టారు. గత సమావేశాలకు వీరు గైర్హాజరయ్యారు.
ఈసారి సమావేశాలకూ రాని పక్షంలో పార్లమెంటు నిబంధనల ప్రకారం వారు సభ్యులుగా కొనసాగే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో టీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేలా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు నిర్ణయంగానీ రోడ్‌మ్యాప్‌గానీ ప్రకటించాలని కోర్‌కమిటీలోని ప్రణబ్, పటేల్‌ను మేడమ్ కోరినట్లు సమాచారం. అదే పనిలో సీనియర్‌లు నిమగ్నమైనట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ విషయం పక్కనపెట్టినా తమ రాజీనామాలను ఆమోదించాలని ఎంపీలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రాబోయే సమావేశాల్లోనూ వీరు ఇదే ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ అంశం కూడా కాంగ్రెస్‌ను సత్వర నిర్ణయంవైపు నడిపిస్తున్నదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధినేత్రి నుంచి ఆదేశాలు రావడంతో ఈ ప్రక్రియ వేగవంతమైందని సమాచారం.
ఉత్తరవూపదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు మే నెలలో జరగాల్సిన ఎన్నికలు కూడా కాంగ్రెస్‌కు తెలంగాణపై ఒక నిర్ణయానికి రావాల్సిన ఆవశ్యకతను కల్గిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికలను మే నెలలో కాకుండా మరో రెండు నెలలు ముందుగానే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధపడుతున్నది. యూపీ ఎన్నికలకు ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద ప్రచారాస్త్రం ఏమీ లేదు. దీంతో యూపీ విభజన నినాదాన్ని భుజానికెత్తుకోవాలని ఆలోచిస్తున్నది. యూపీలో అవినీతినిగానీ, మాయావతి పాలనా వైఫల్యాలనుగానీ సొమ్ము చేసుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు, కామన్ క్రీడల నిర్వహణలో అవకతవకలు వంటి భారీ కుంభకోణాలు బయటపడటంతో అవినీతి, అసమర్థతకు కాంగ్రెస్ చిరునామా అన్న భావన జనంలోకి వెళ్లింది. దీంతో రాష్ట్ర విభజన నినాదంతోనే మాయావతిని ఎదుర్కొనాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. అక్కడ రాష్ట్ర విభజన గురించి మాట్లాడే ముందు ఇక్కడ తెలంగాణ అంశాన్ని ముగించేయడమే మేలన్న భావనతో యువరాజు రాహుల్ గాంధీ కూడా ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ తన కీలక భాగస్వామ్య పక్షాలతో ప్రాథమికంగా ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అధికారికంగా పార్టీ వర్కింగ్ కమిటీలో కోర్ కమిటీ నిర్ణయాన్ని ఆమోదింప చేసుకుని, రాజకీయవ్యవహారాల కేబినెట్ కమిటీని సమావేశపర్చి, వారి వద్ద ప్రస్తావిస్తారని తెలిసింది. అనంతరం అఖిలపక్షాన్ని పిలిచి తుది నిర్ణయాన్ని ప్రకటించడమే మిగిలి ఉంటుంది. ఇది పార్లమెంటు సమావేశాలకు ముందుగానే జరుగుతుందని సమాచారం. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తాయని భావించిన తృణముల్ కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఆ ముచ్చట లేదని తేల్చేయడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే మరో అంశం. ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్య పరిష్కారం అధిష్ఠానానికి మరింత సులువైందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటింప చేయాల్సిన విషయంలో సకల జనుల సమ్మె ఘనమైన విజయాలనే సాధించింది. అనేక ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురి చేసినా, లాఠీచార్జిలు, అరెస్టులతో భయపెట్టినా సకల జనుల సమ్మె 42 రోజుల పాటు దిగ్విజయంగా, మహోధృతంగా సాగింది. కీలక రాజకీయ పార్టీల ప్రమేయం లేకున్నా ఉద్యోగ సంఘాలు స్వతంత్ర కార్యాచరణతో, జేఏసీ అడుగు జాడల్లో సమ్మెను విజయవంతం చేశారు. ఈ పరిణామం కేంద్రాన్ని సైతం కలవరపెట్టింది. ఉద్యమ తీవ్రతను నిఘా వర్గాల ద్వారా సేకరించిన కేంద్రం ప్రత్యేకంగా విశ్లేషించినట్టుగా తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ కోసం ఈ వర్గాలు మరింతగా పోరాటాన్ని ఉధృతం చేస్తే పోలీసులతో అణచివేయటం ఏమాత్రం సాధ్యం కాదని, అది మరో రూపం తీసుకునే ప్రమాదముందని కూడా కేంద్రానికి సమాచారం ఉందని తెలిసింది. తెలంగాణలో పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు, దీక్షలపైనా అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు సమాచారంఅందుతోందని తెలిసింది. తెలంగాణలో పార్టీ శ్రేణులు, నాయకులు పార్టీ నియంవూతణలోనే పనిచేస్తున్నారన్న సదాభివూపాయం పెద్దల్లో నెలకొందని సమాచారం.
రాజధాని సంగతేంటి?
అన్ని సమయాల్లోనూ పార్టీకి వెన్నంటి నిలిచిన సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న ప్రతిపాదనపైనా అధిష్ఠానం దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో గత వారం జరిపిన సుదీర్ఘ చర్చల్లో ఆయన ముందుంచినట్లు సమాచారం. దీనికి జైపాల్ ససేమిరా అన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ను నిర్దిష్ట కాలం పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే అవకాశం ఉందని, కానీ శాశ్వత ఉమ్మడి రాజధానిగా పెడితే తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రమవుతుందని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది.

Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,

0 comments:
Post a Comment