విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం
- 13 డిమాండ్లకు అంగీకారం
- హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ స్మారక స్థూపం ఏర్పాటు
హైదరాబాద్, అక్టోబర్ 25 (టీ న్యూస్): విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలం అయ్యాయి. మంగళవారం రాత్రి ఏడు గంటలకు చర్చల ప్రక్రియ పూర్తికావడంతో పదమూడు అంశాలపై అధికారికంగా ఒప్పంద పత్రంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీజాక్) నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎన్ జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరుపున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు. అంతకు ముందు ఉదయం పదకొండు గంటలకు టీజాక్ నేతలు ఎన్ జానయ్య, మోహన్‌డ్డి, తిరుపతిడ్డి, వాణి తదితరులు తమ డిమాండ్లపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని కలుసుకున్నారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించడంతో ఆ డిమాండ్లపైనే విద్యుత్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన టీజాక్ నేతలు రాతపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటిలో వందేళ్ళ క్రితం నాటి హుస్సేన్‌సాగర్ థర్మల్‌పవర్ ప్లాంట్ స్మారక చిహ్నం ఏర్పాటు అంశం కూడా ఉండడం గమనార్హం.
ఒప్పందంలోని అంశాలు
1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.
3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.
4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్(హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.
5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.
7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.
8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరుచేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.
9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వెయి కలిపచి వారి సర్వీసు రెగ్యులరైజేషన్‌కు చర్యలు తీసుకోవడం.
10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పించడం.
11. ఉద్యోగులు చనిపోయిన సందర్భంలో వారి కుటుంసభ్యులకు ఉద్యోగ కల్పన(కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.
12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు అనుగునంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.
13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్థూపాన్ని తెలంగాణ చౌరస్తా(మింట్ కాంపౌండ్) పరిసరాల్లో ఏర్పాటు చేయడం.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet,
Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet,
Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,
0 comments:
Post a Comment