Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, October 26, 2011

ఉద్యమ వెలుగు!

- తెలంగాణ కోసం తెగింపు
- సంఘటిత శక్తిని చాటిన విద్యుత్ ఉద్యోగులు
- అభినందనలు తెలిపిన జేఏసీ చైర్మన్
- ముగిసిన రఘు 72 గంటల దీక్ష
- ఉద్యమానికి కొత్తరూపమిస్తాం: కోదండరాం
- మంత్రులను టార్గెట్ చేద్దాం: పోచారం
- నేతలారా.. పదవులు వీడండి: సంధ్య
- మంద కృష్ణ.. ఎవరికోసం? : సూర్యం
- రైతులు ఉద్యమాన్ని హత్తుకున్నారు: కే రఘు
- ఒకటి నుంచి నిరవధిక దీక్షలు: ఈటెల
- కోర్టుకు వెళ్లి రాజీనామా ఆమోదించుకుంటాం: నాగం
- రాజకీయ ప్రక్రియ ద్వారానే రాష్ట్రం సాధ్యం: విద్యాసాగర్‌రావు


ragu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 25 : తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ కే రఘు మూడు రోజులుగా కొనసాగించిన 72 గంటల దీక్షను మంగళవారం విరమించారు. రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌డ్డి, పోచారం శ్రీనివాస్‌డ్డి, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు, న్యూ డెమొక్షికసి పార్టీ నేతలు సూర్యం, గోవర్ధన్, పీవోడబ్ల్యూ నేత సంధ్య తదితరులు ఉదయం 11.30 గంటలకు రఘు చేత నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉద్యమ నేతలు విద్యుత్ ఉద్యోగుల పోరాటాన్ని అభినందించారు. సర్కారుకు పాలుపోకుండా చేసి సంఘటితశక్తిని చాటిచెప్పారని ప్రశంసించారు. రఘు చేపట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొత్త స్ఫూర్తిని నింపింది. సకలజనుల సమ్మెలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి, యూనియన్లకు మధ్య విద్యుత్ సంస్థల యాజమాన్యం చిచ్చుపెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని తిప్పికొ ఆచప దీక్షకు దిగారు.

దీక్షను విచ్ఛిన్నపరచాలనుకున్న యాజమాన్య, ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించిన 72 గంటల దీక్ష మంగళవారం ముగిసింది. ఈ నాలుగురోజులపాటు దీక్షా వేదిక తెలంగాణవాదులకు ప్రధాన కేంద్రంగా మారింది. దీక్షతో నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులతో నగరంలోని వివిధ జేఏసీలతో విద్యుత్ సౌధ కిటకిటలాడింది. మంగళవారం దీక్ష విరమణ కార్యక్షికమానికి ఉదయం 9 గంటలనుంచే భారీ సంఖ్యలో తెలంగాణవాదులు, విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న ఉత్కం రేపిన దీక్షా ప్రక్రియ ప్రశాతంగా విజయవంతంగా ముగియడంతో రక్షణగా ఉన్న పోలీసులు, విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు ఊపిరిపీల్చుకున్నట్లయింది.

నిరాహారదీక్ష ముగింపు సందర్భంగా రసమయి బాలకిషన్, అరుణోదయ కళామండలి అధ్యక్షుడు రామారావు పాడిన పాటలతో విద్యుత్ సౌధ ప్రాంతం హోరెత్తింది. ఈ కార్యక్షికమంలో టీ జాక్ నాయకులు మోహన్‌డ్డి, జానయ్య, స్వామిడ్డి, శివాజి, అంజిడ్డి, ముస్తాక్, విష్ణూ, సంతోష్, రామకృష్ణ, నిత్య కళ్యాణం, లక్ష్మినారాయణ, మధుసుదన్‌డ్డి, వాణి తదితరులు పాల్గొన్నారు.

ఒకటి నుంచి నిరవధిక దీక్షలు: ఈటెల
తెలంగాణ ప్రాంతాన్ని కొల్లగొట్టిన నవంబర్ ఒకటి దినాన్ని విద్రోహదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌కు చెందిన 14మంది ఎమ్మెల్యేలం ఆమరణ దీక్షకు పూనుకుంటున్నామని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్రం సాధించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రజలకు అండగా నిలబడుతామని స్పష్టం చేశారు. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని చెప్పిన కాంగ్రెస్ నేతల్లారా.. మీ భరతం పట్టడానికి తెలంగాణవాదులు కదులుతున్నారని హెచ్చరించారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మె ద్వారా ఉద్యమం ఉధృతం అయిందని, వారినుంచి పోరాట జ్వాలను తాము అందుకుంటున్నామని ప్రకటించారు.

కోర్టుకు వెళ్లి రాజీనామా ఆమోదించుకుంటాం: నాగం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాలు చేసినా సీమాంవూధకు చెందిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ రాజీనామాలు ఆమోదించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి అన్నారు. ఇక తాను స్పీకర్ వద్దకు వెళ్లనని, కోర్టుకు వెళ్లి తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని తెలిపారు. ఆ తరువాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాజీనామా చేశామని చెబుతున్న 32 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దమ్ముంటే కోర్టుకు వెళ్లి రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణవాదుల మధ్య ఐక్యత కోసం రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఎమ్మెల్సీ పదవి కోసం డీ శ్రీనివాస్ తహతహలాడారని, ప్రస్తుతం మంత్రి పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు.

మంత్రులను టార్గెట్ చేద్దాం: పోచారం
currentollu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్న మంత్రులను టార్గెట్ చేస్తూ భవిష్యత్ ఉద్యమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం అన్నారు. సకలజనుల సమ్మెతో ఉద్యోగులు తమ శక్తివంచనలేని పోరాటం చేసి సత్తాను చూపించారని పేర్కొన్నారు. ఇక మిగిలింది కేవలం రాజకీయ ప్రక్రియ కాబట్టి అందుకు అడ్డుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ మంత్రులను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బాన్సువాడ ఎన్నికలలో ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన టీడీపీ, కాంగ్రెస్‌కు ఓట్లేయించిందని విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం వేరువేరుగా పోటీ చేస్తే ఇద్దరి డిపాజిట్లు గల్లంతయ్యేవేనని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన లగడపాటి, రాయపాటి, మేకపాటి, దేవినేని, పయ్యావుల కేశవులు, కిరణ్‌కుమార్, చంద్రబాబు అంతా ఒక్కటైతారని, మన తెలంగాణ నాయకులకు ఆ బుద్ధిలేదని ధ్వజమెత్తారు.

రాజకీయ ప్రక్రియ ద్వారానే రాష్ట్రం సాధ్యం: విద్యాసాగర్‌రావు
సకలజనుల సమ్మె ద్వారా ఉద్యోగులు తమ శక్తికి మించి పోరాటం చేశారని కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఇక రాజకీయ ప్రక్రియ మాత్రమే మిగిలిందని, అప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధ్యమౌతుందన్నారు. అందుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రజావూపతినిధులు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రజావూపతినిధులు చేస్తున్న మోసం వల్లే రాష్ట్ర సాధన ప్రక్రియ ముందుకు సాగడం లేదన్నారు. గ్రామక్షిగామాన తిరుగుబాటు జరుగుతున్నా కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఏ పనికైనా సామ దాన భేద దండోపాయాలు అమలుచేస్తారని, ఇక దండోపాయం ఒక్కటే మిగిలిందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అద్వాని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రకటించారని, శాసనసభలో తీర్మానం అవసరం లేదని పేర్కొన్నారు. టీవీ చర్చల్లో ఈ విషయంపై కొంతమంది మేధావులు అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

మంద కృష్ణ.. ఎవరికోసం పనిచేస్తున్నావు?: సూర్యం
తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి సీమాంధ్ర పాలకుల కుట్రలో మందకృష్ణ పావుగా పనిచేస్తున్నాడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్షికసి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సూర్యం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయడానికి వ్యతిరేకులతో కలిసి కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడైనా ఒక్క కార్యక్షికమం చేపట్టావా అని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ అని అంటున్న నీవు... ఆ దిశగా చేస్తున్న ప్రయత్నం ఏమిటని ప్రశ్నించారు. ముందు తెలంగాణ సాధిస్తే ఆ తరువాత సామాజిక తెలంగాణ విషయం ఆలోచించవచ్చన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమపంథాలు మార్చడం సహజమని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు 72 గంటలపాటు చేపట్టిన దీక్ష, కొత్తగా చేపట్టబోయే మరో రూపంలోని ఉద్యమానికి నాంది పలుకుతుందన్నారు.

పదవులు వీడండి: సంధ్య
తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైతే ప్రాణాలు వదులుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్‌డ్డి శవంపై ప్రమాణం చేసి నేడు మాటతప్పారని పీవోడబ్ల్యూ నేత సంధ్య ధ్వజమెత్తారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న మీ గలీజ్ ప్రాణాలు మాకు అవసరం లేదని, తెలంగాణ ప్రజలిచ్చిన పదవులను వదిలేస్తే చాలని, తెలంగాణ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులైన డీ శ్రీనివాస్, దానం నాగేందర్ సిగ్గులేకుండా పదవుల కోసం ముద్దులు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్షికసి నేత గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వారి అధిష్ఠానాన్ని ఒప్పించి ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని కోరారు.

విజయవంతం.. కొత్తరూపం: కోదండరాం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన సకలజనుల సమ్మె సంపూర్ణంగా విజయవంతమైందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలిగామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ తీవ్రతను గమనించినప్పటికీ స్పందించనట్లు నటించాయని ఆయన విమర్శించారు. పత్రికలు, మీడియా ఉద్యమానికి అనుకూలించకపోగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయని నిరసన వ్యక్తం చేశారు. సకలజనుల సమ్మెను విరమించలేదని, తాత్కాలికంగా విరామం ఇచ్చామని తెలిపారు. విద్యుత్‌శాఖ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఆయన అభినందించారు. రఘు ఆధ్వర్యంలో అవసరమైనప్పుడు ఉద్యోగులంతా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కొత్తరూపం ఇచ్చి మరింత ఉధృతం చేయడానికి జేఏసీలోని అన్ని పక్షాలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ విద్రోహులదినం అయిన నవంబర్ 1వ తేదీ నుంచి 72గంటలపాటు దీక్ష చేయాలని నిర్ణయించగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 14 మంది నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న న్యాయవాదులు ఈ నెల 29న చలో పోలవరం కార్యక్షికమాన్ని చేపడుతున్నారని,నవంబర్ 1నుంచి అన్ని కోర్టుల ముందు కొందరు న్యాయవాదులు ఆమరణ దీక్షకు పూనుకుంటున్నారని, మనమంతా అండగా నిలవాలని కోరారు.

రైతులు ఉద్యమాన్ని హత్తుకున్నారు: కే రఘు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ముందుండి పోరాటం చేసినప్పటికీ ఎవరికీ ఇబ్బంది కాకూడదని అత్యవసర సర్వీసులు కొనసాగించామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు పేర్కొన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి, ఉద్యోగులపై రైతులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని, కానీ రైతులు మాత్రం ఉద్యోగులను తమ హృదయాలకు హత్తుకుని ఉద్యమానికి చేయూతనిచ్చారని గర్వంగా ప్రకటించారు. మామూలు సమయాల్లో ఒకగంట విద్యుత్ సరఫరా నిలిచిపోతే సబ్‌స్టేషన్‌లపై, విద్యుత్ ఉద్యోగులపై దాడులు చేసే రైతులు ఉద్యమ సమయంలో 3-4 గంటలు విద్యుత్ కోతలు విధించినా ఎక్కడ కూడా ఉద్యోగులపై తిరుగుబాటు చేయలేదని, అవసరమైతే నష్టాలను భరించారని, ఇది ఈ ప్రాంత రైతులకున్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటిచెబుతుందన్నారు. చర్చల కోసం యాజమాన్యం రమ్మంటే వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన అనేక ప్రాజెక్టుల విషయం ప్రధాన డిమాండ్‌లుగా యాజమాన్యం ముందు పెట్టామని తెలిపారు. యాజమాన్యం చేసిన కుట్రలకు ఆగ్రహం చెందిన ఉద్యోగులు అత్యవసర సర్వీసులు నిలిపివేద్దామని కోరినప్పటికీ కొంత సంయమనం పాటించేందుకు కృషి చేశామని తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వెనుకంజ వేయడంవల్లే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వెనుకబడుతుందని, సకలజనుల సమ్మె వల్ల అనుకున్న లక్ష్యం సాధించకపోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రజావూపతినిధుల వైఖరి కారణమని ధ్వజమెత్తారు.


 Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,

0 comments:

About This Blog

తెలుగు బ్లాగుల

my blog directory

Free Counters
CashAdvanceHelp

Total Blog Directory Submit Blog & RSS Feeds
Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!
Submit your website to 20 Search Engines - FREE with ineedhits!
You have not participated at the forum. Use the forum before you use this widget!
Make Money Blogging

Blog Directory Blog Topsites
Submit Blog
Blogs Blog Tools Allie Marie

Blogs Directory


Blog Directory

Blogger Help Templates Widgets SEO Tips Submit Site to Google Link building 

packages
Search engine submissions Politics
billiga hotellrum london Wutzle My Blog!

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP