విరమణ కాదు.. విరామమే
- రాజకీయ నేతలూ ఉద్యమంలోకి రండి
- ఉద్యోగ జేఏసీ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 25 : ప్రపంచ ఉద్యమాల చర్రితలో సకల జనుల సమ్మె తలమానికంగా నిలిచి ఉంటుందని ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ డిమాండ్ కోసం 42 రోజుల పాటు, రెండు కోట్ల మంది, ప్రజాస్వామిక పంథాలో, ప్రత్యక్షంగా భాగస్వాములైన, మహోన్నత చారివూతాత్మక ఉద్యమ సంఘటన ప్రపంచ ఉద్యమాల చరివూతలోనే జరగలేదని ఆయన ఎలుగెత్తి చాటారు. తాము తెలంగాణ ఉద్యమాన్ని విరమించలేదని, ఇది విరామం మాత్రమేనని, ఉద్యమ రూపాలను మార్చుకుంటూ, రాష్ట్ర సాధనకోసం ఉద్యమిస్తూనే ఉంటామన్నారు. తాము ఏ పార్టీకి అనుబంధం కాదని స్పష్టం చేశారు. మంగళవారం టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగసంఘాల జేఏసీ కోచెర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కోచైర్మన్ సీ విఠల్, మాజీ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల సంఘటిత శక్తితో, తెలంగాణను సాధించుకొని తీరుతామన్న గొప్ప విశ్వాసంతోనే ఉద్యమాల స్వరూపాలను మార్చుకుంటున్నామని తెలిపారు. సమ్మె ఒకానొక ఉద్యమ ఆయుధమని, మరో రూపంలో ఉద్యమాలు ఉంటాయని, తాము ఉద్యమంలోనే ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర సాదన జ్యోతిని దర్శించే వరకు ఉద్యమ దీక్షలోనే ఉంటామని ఆయన ఢంకాభజాయించారు.
ఉద్యోగసంఘాల చైర్మన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు ప్రారంభించిన సకల జనుల సమ్మె గొప్ప విజయాలకు మార్గదర్శకంగా నిలిచిందని, ఈ దివిటీని రాజకీయ నాయకులు అందుకోవాలని విజ్ఞిప్తి చేశారు. కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలు, టిఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమొక్షికసీ వంటి పార్టీలు ఉద్యోగుల ఉద్యమాలకు బాసటగా నిలిచారని, ఉద్యోగసంఘాల జేఏసితో కలిసి ఉద్యమించి..అండదండలందించిన ప్రతీ తెలంగాణ వాదికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఉద్యమపథంలో ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు, విద్యుత్తు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్‌సెక్టార్ పరిక్షిశమలలోని కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భుజంభుజం కలిపి నిలిచారని, ఈ వరుసలో కలిసి వచ్చిన ఉద్యమక్షిశేణులకు, శక్తులకు, తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.టీ ఉద్యోగసంఘాల కోచైర్మన్ దేవీవూపసాద్ మాట్లాడుతూ ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన నిలిచి పోరాడుతున్న వీరోచిత చరిత్ర ఒక్క తెలంగాణ ఉద్యోగులకు మాత్రమే ఉన్నదని అన్నారు. సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇకనుంచి తెలంగాణ వ్యతిరేకులపైన, సమైక్యవాదులపైన, అవహేళన చేసివారిపైన ఉద్యమ దృష్టి ఉంటుందని చెప్పారు. ఒక్క తెలంగాణ ఉద్యోగిపైనైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, తెలంగాణ ఉద్యోగులందరూ ఎదిరిస్తారని హెచ్చరించారు. కోచైర్మన్ సీ విఠల్ ఒక్క తెలంగాణ అంశంపైనే కోర్ కమిటీ ఎనిమిది సార్లు సమావేశం కావడమే, తెలంగాణ సకల జనుల సమ్మె సాధించిన ఘన విజయమని ఆయన పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వబోమని ప్రకటిస్తే వెను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి కోమటిడ్డి వెంకటడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవికి, ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేసిన తనకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదన్నారు.
కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 25 : టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. సమ్మె వాయిదా ప్రకటించిన అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమ్మెకు సహకరించినందుకు కేసీఆర్‌కు జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను కలిసిన వారిలో జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవివూపసాద్ ఉన్నారు.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet,
Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,
0 comments:
Post a Comment