ఢిల్లీలో తెలంగాణపై ముగిసిన కాంగ్రెస్ సారధ్య బృందం ప్రదర్శనలు
ఢిల్లీలో తెలంగాణపై ముగిసిన కాంగ్రెస్ సారధ్య బృందం ప్రదర్శనలు
హైదరాబాద్,మేజర్‌న్యూస్ :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ క్షేత్ర స్థాయి సమాచారంతో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బృంద ం కార్యక్రమాలు ఆదివారంతో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ప్రదర్శనతో ముగిశాయి. మూడు రోజుల కార్యక్రమాలు బాగా జరగడంతో తమకు సంతృప్తి నిచ్చాయని పీసీసీ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బృందం నేతలు జి.నిరంజన్, రాపోలు ఆనంద భాస్కర్, ఎస్.లక్ష్మినారాయణ, ఎస్.నర్సింహ్మరెడ్డి తెలిపారు. మూడవ రోజు ఆదివారం సారధ్య బృందం నేతలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేయాలని, తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆ తరువాత వీరు గాంధీ స్మృతి వద్దకు వెళ్ళి నివాళులర్పించారు. ఆ తరువాత గ్రూప్-1 పరిక్షలపై నిరసన తెలియజేస్తున్న విద్యార్ధులపై రాష్ట్రంలో జరిగిన లాఠీ చార్జీని వీరు ఖండిస్తూ, పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గాంధీ స్మృతి వద్ద ప్రదర్శన నిర్వహించారు. మూడు రోజుల పాటు తెలంగాణ కోసం ఢిల్లీలో ప్రదర్శనలు, పార్టీ పెద్దలతో భేటీలు నిర్వహించిన అనంతరం సారధ్య బృందం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తురంతో ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయలు దేరనున్నది.
-Suryanews
0 comments:
Post a Comment