ఉద్రిక్తతల మధ్య గ్రూప్-1
హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ఃగ్రూప్-1 పరీక్షల వివాదం తెలంగాణా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. పరీక్షలను అడ్డుకుంటామని ఆది నుంచి చెబుతూ వచ్చిన నేతలు అక్క డక్కడ అడ్డుకునేందుకు యత్నించారు. ముందస్తు పోలీసు పహారా మధ్య పరీక్షలు ఎట్టకేలకు ముగిశాయనిపించారు. ఎపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో తెలంగాణా వాటా ప్రకటించేంతవరకు పరీక్షలు నిర్వహించరాదనీ, గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న తెలంగాణా వాదులు తాజాగా పరీక్షల నాడు తెలంగాణా ప్రాంతంలో ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు పరీక్షల నిర్వహణ ఉండగా, ఉదయం నుంచే ఆందోళనల పర్వం ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి రణరంగంగా మారింది. తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, మందా జగన్నాథంతో పాటు పలువురు తెలంగాణా నేతలు విద్యార్థులకు మద్ధతు ప్రకటించడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. ఉదయం నుంచి ఉస్మానియా యూనివర్శిటీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినా బీఇడీ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కొందరు పరీక్షా పత్రాలను తీసుకుని బయటకు వచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అయితే వాటిపై 2010 పరీక్షా పత్రాలని ఉన్నప్పటికీ, ఎపీపీఎస్పీ వర్గాలు మాత్రం అది పాత పరీక్షా పత్రం అంటూ కొట్టిపడేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్ళవర్షం కురిపించడంతో పోలీసులు ఆందోళనకారులను నిరోధించేందుకు బాష్పవాయు ప్రయోగం చేశారు. అదే సమయంలో విద్యార్థులకు మద్ధతుగా వచ్చిన గుత్తా, మందా, వివేక్, మధుయాష్కీలను పోలీసులు అరెస్టు చేసి బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉస్మానియా యూనివర్శిటీ వద్ద తూర్పు మండలం డీసీపీ మహేశ్‌చంద్ర లడ్డా, జాయింట్ కమిషనర్ అమిత్‌గర్గ్, ఎస్‌బీ జాయింట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఏబీవీపీ కార్య కర్తలు పుల్లారెడ్డి కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో పిడీఎస్‌యూ ర్యాలీ నిర్వహించగా, నల్గొం డలోని మహాత్మాగాంధీ కళాశాల, గౌతమి కళాశాల వద్ద టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వ హించారు. హైదరాబాద్‌లోని తార్నాక, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో ఉన్న బిగ్‌బజార్ షోరూమ్‌పై ఆందోళనకారులు రాళ్ళతో దాడిచేశారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో బస్సులపై రాళ్ళురువ్వారు. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మూడంచెల భద్రత
ఎపిపిఎస్సీ గ్రూప్ -1 పరీక్షలు యధావిధిగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా వచ్చారు. 1.90 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, కేవలం 61వేల మంది వరకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు ముందస్తుగానే హైదరాబాద్‌లో నాయిని నర్సింహారెడ్డిని, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ నాయకులను గృహనిర్బంధం చేశారు. కరీంనగర్ జిల్లాలో పరీక్షాకేంద్రాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న గంగుల కమలాకర్, విజయరమణారావు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను అడ్డుకుని, అరెస్టు చేశారు. పోలీసులతో తోపులాట సమయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ పెదవికి గాయమైంది. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకులు విజయరామారావు, ప్రభాకర్‌లను పోలీసులు ముందస్తుగానే గహ నిర్భంధంలో ఉంచారు. నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, సంగారెడ్డి పరీక్షా కేంద్రంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును, ఆదిలాబాద్‌లో తెలుగుదేశం శాసనసభ్యుడు జోగిరమణలను అరెస్టు చేశారు. మంచిర్యాలలో అరవిందరెడ్డి, కావేటి సమ్మయ్యలను గృహనిర్భంధంలో ఉంచారు. వరంగల్ ఎంపీ రాజయ్య, ఎంఎంల్‌ఏ వినయభాస్కర్‌లను అరెస్టు చేశారు.బాధ్యులపై చర్యలు : ఖాన్
ఉస్మానియా యూనివర్శిటీ బిఇడి కళాశాల వద్ద జరిగిన పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ ఎ.కే.ఖాన్ స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలోని బీఇడి కళా శాల మినహా మిగిలన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాం తంగా ముగిసినట్లు చెప్పారు.యువకుడి ఆత్మహత్యాయత్నం
గ్రూప్-1 పరీక్షల వాయిదా కోరుతూ మెదక్ జిల్లా నారా యణఖేడ్ మండల పరిధిలోని పలుగు తండాలో శనివారం అమరణ నిరాహార దీక్షకు దిగిన రవిందర్‌నాయక్ అనే యువకుడు ఆదివారం ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నిం చాడు. శనివారం తనంతట తానుగా పాఠశాల భవనంలోకి వెళ్లి నిర్బంధించుకొని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన అతన్ని అధికారులెవరు పట్టించుకోకపోవడంతో తండాలోని గిరిజనులు ఆదివారం దీక్షను మాన్పించడానికి ప్రయత్నిం చారు. దాంతో అతను కొడవలితో ఆత్మహత్యాయత్నానికి పూనుకోగా చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతడిని గిరిజనులు జూకల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథ మ చికిత్స చేయించి 108కు సమా చారం అందించగా నారాయణ ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. ప్రభుత్వాస్పత్రికి చేరు కున్న రవిందర్‌నాయక్‌ను ఆస్పత్రిలోనే పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవిందర్‌నాయక్‌ను టీఆర్‌ఎస్ ఇంచార్జి ఎం. భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మారుతి పటేల్, పండరియాదవ్ తదిత రులు పరామర్శించారు.మహబూబ్‌నగర్‌లో బంద్ పాక్షికం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎపిపిఎస్‌సి గ్రూప్ 1 పరీక్షలు పోలీసుల పహార నడుమ ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చెదురు మదరు సంఘటనలు మినహా 10 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలను నిలిపి వేయా లని కోరుతూ విద్యార్థి జెఎసితో పాటు టిఆర్‌ఎస్, టిడిపి, బాజాపా ఇచ్చిన తెలంగాణ బంద్ జిల్లాలో పాక్షికంగా జరిగింది. బంద్ ప్రభావం జిల్లా కేంద్రంలో కనిపించగా ఇతర ప్రాంతాల్లో పెద్దగా కనిపించలేదు. బంద్ సందర్బంగా ఉద యం నుంచే పోలీసులు గట్టి బందోభస్తు ఏర్పాటు చేశారు. గ్రూఫ్ 1 పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా నిర్వహిం చేందుకు జిల్లా కలెక్టర్ పురుషోత్తం రెడ్డితో పాటు ఎస్పీ జి.సు దీర్‌బాబులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా లో గ్రూఫ్ 1 పరీక్షకు 4,171 మంది అభ్యర్థులు హాజరు కావా ల్సి ఉండగా 1904 మంది అభ్యర్థులు మాత్రమే హాజరైనట్లు జిల్లా కలెక్టర్ పురుషోత్తం రెడ్డి అధికారికంగా వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు నిరసనగా పాలమూరు జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్ డిగ్రీ కళాశాలలో పరీక్షకు హాజరైన పురేందర్‌నాథ్ అనే విద్యార్థి తన హాల్ టికెట్‌తో పాటు జవాబు పత్రాన్ని కూడా చించి వేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీకాంత్ అనే అభ్యర్థి పరీక్ష రాసేది లేదంటూ చేయి కోసుకున్నాడు. జడ్చర్లలో ఒక విద్యార్థి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా ఉదయమే పోలీసులు టిఆర్‌ఎస్ నేతలు విఠల్‌రావు ఆర్యా, బెక్కెం జనార్దన్‌తో పాటు విద్యార్థి జెఎసి నాయకులను అరెస్టు చేశారు.కరీంనగర్ నిరసనల వెల్లువ
గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఆది వారం కరీంనగర్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు వెల్లువె త్తా యి. కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి శ్రేణులు నిర్వహించిన ఆందోళనలతో జిల్లా కేంద్రం అట్టుడికిపోయింది. ఈ సందర్భంగా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ముందు జాగ్రత్త చర్యగా శని వారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ విధించారు. పరీక్ష నిర్వ హణ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అభ్యర్థులు శనివారం రాత్రే జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలో 13 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా, 36.3 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజర య్యారు. మొత్తం 7,282 మంది దరఖాస్తు చేసుకోగా 2,633 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ంలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహించి, లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాటలో కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు విజయర మణారావు, గంగుల కమలాకర్‌లతో పాటు టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్, బిజెపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.ఖమ్మంలో ప్రశాంతం
ఖమ్మం , మేజర్‌న్యూస్: ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన గూప్-1 పరీక్షలు స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 23 మంది పరీక్షా కేంద్రాలలో 43.3 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 5529 మంది అభ్యర్థులకు గాను 2398 మంది పరీక్షలకు హాజర య్యారు. పరీక్షలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు తదితర ప్రాంతాల్లో 200 మంది న్యూడెమొక్రసి, పిడిఎస్‌యూ, టిఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.నల్గొండ జిల్లాలో ..
నల్లగొండ, మేజర్‌న్యూస్: పోలీసుల పహార నడుమ జిల్లా కేంద్రంలో పరీక్ష తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరిగింది. నల్లగొండ కేంద్రంగా 5556 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా 2494 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారు. గ్రూప్-1 పరీక్ష విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలువురు అభ్యర్ధులు పరిక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద తమ హాల్ టికెట్లను చింపివేశారు. లిటిల్‌ఫ్లవర్ జూనియర్ కళాశాల సెంటర్‌లో 38 మంది అభ్యర్ధులు మినహా మిగిలిన వారు పరీక్షను బహిష్కరించారు. మిర్యాలగూడకు చెందిన జెల్ల రామ్మోహన్ స్థానిక విద్యాగ్రామర్ పరిక్షా కేంద్రంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆత్మహాత్య యత్నం చేయడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర అసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. పరిక్షను సజావుగా నిర్వహించేందుకు శనివారం రాత్రి తెరాస, తెలంగాణ అనుకూల పార్టీలు, విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు మందస్తు అరెస్టులు చేశారు.- Suryanews
0 comments:
Post a Comment