ఉద్రిక్తతల నడుమ గ్రూప్ 1 'పరీక్ష'
ఉద్రిక్తతల నడుమ గ్రూప్ 1 'పరీక్ష'
(సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్) తెలంగాణ ప్రాంతానికి 42 శాతం వాటా కేటాయించకుండా పరీక్ష నిర్వహించరాదన్న డిమాండ్‌తో టిఆర్ఎస్‌తో పాటు జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్‌లు ఆందోళనకు దిగాయి. పరీక్షను అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేత హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ,జేఏసీ పశ్చిమ కన్వీనర్ అశోక్‌కుమార్ తదితరులను ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు అరెస్టు చేశారు.
ఇటువంటి పరిస్థితులవల్లే ఈ పరీక్షలకు కేవలం 43.67 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ, కేరీ బాప్టిస్ట్, భారతీయ విద్యామందిర్, కరుణా హైస్కూలులో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాలలో 1550 మంది అభ్యర్థులకుగానూ 677 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరయిన వారిలో భారతీయ విద్యామందిర్ కేంద్రంలో అభ్యర్థి బిలోక్‌చంద్ ఓఎంఆర్ షీట్‌పై జై తెలంగాణా నినాదాలు రాసి బయటకు వచ్చారు.
సెయింట్ ఆంథోని కేంద్రంలో అభ్యర్థి, మెదక్ మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన లంబాడీ శ్రీనివాస్ ప్రశ్నాపత్రాలను చించి బయటకు వచ్చారు. కరుణా హైస్కూల్ కేంద్రంలో అభ్యర్థులు బి.కిషన్, సతీష్‌లు తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వనందుకు నిరసనగా పరీక్ష రాయకుండానే వచ్చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ టి.విజయకుమార్, ఎస్పీ సుందర్‌కుమార్ దాస్‌ల ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించిన తర్వాతే పరీక్షా కేంద్రాల మార్గాల వైపు పోలీసులు అనుమతించారు.
పరీక్ష కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు, డాగ్‌స్క్వాడ్, అంబులెన్స్‌లను కూడా ఏర్పరిచారు. అయినా పరీక్షను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే టి.హరీష్‌రావు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి ఆటోలో వచ్చారు. కరుణా స్కూలు కేంద్రం సమీపంలో ఆటో దిగి, జై తెలంగాణ నినాదాలుచేస్తూ కేంద్రంలోకి పరుగులు తీస్తుండగా పోలీసులు అడ్డుకుని, ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందే తెల్లవారుజామునే టీఆర్ఎస్, జేఏసీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంద్రకరణ్, సంగారెడ్డి రూరల్, సంగారెడ్డి టౌన్, చిద్రుప్ప పోలీస్ శిక్షణా కేంద్రాలలో ఉంచారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ఏపీపీఎస్‌సిీ పరీక్షను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఐబి నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా, కొత్త బస్టాండ్ వద్ద ర్యాలీ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు ధర్నా, రాస్తారోకో చేశారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో డీసీసీ ప్రదాన కార్యదర్శి బొంగుల రవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శేక్ సాబేర్, ప్రదాన కార్యదర్శి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు శివరాజ్, కసిని శ్రీకాంత్, కసిని విక్రాంత్‌రెడ్డి , పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్‌యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
43.67 శాతం మంది హాజరు
జిల్లాకేంద్రంలో కొనసాగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 పరీక్షకు 43.67 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. నాలుగు కేంద్రాలలో మొత్తం జిల్లాలో 1550 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 677 మంది పరీక్ష రాశారు. మరో 873 మంది గైర్హాజరయ్యారు. కరుణ హైస్కూల్‌లోని ఏ కేంద్రంలో 300కు 132 మంది హాజరు కాగా, బి సెంటర్‌లో 300 మందికి 149 మంది హాజరయ్యారు. అలాగే మరో సెంటరయిన సెయింట్ ఆంథోనీస్ స్కూల్ ఏ సెంటర్‌లో 300 మందికి 120, బి కేంద్రంలో 300 మందికి 120 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
0 comments:
Post a Comment