గ్రూప్-1 హాజరు 35 శాతమే...
గ్రూప్-1 హాజరు 35 శాతమే...
హైదరాబాద్, సెప్టెంబరు 5 : పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాల్లోపే గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకయింది. ఆందోళనకారుల నిరసనలతో గందరగోళం మధ్య పరీక్ష ముగిసింది. ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించరాదనే కనీస సూత్రాన్ని ప్రభుత్వం పాటించలేదని ఉపాధ్యాయసంఘాలు మండిపడ్డాయి. జీవన్మరణ సమస్య అయిన పరీక్ష విషయంలో ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరించడంతో నిరుద్యోగులు అష్టకష్టాలుపడ్డారు. బంద్‌కు పిలుపునివ్వడం... ఉద్రిక్త వాతావరణం ఉండటంతో పలువురు పరీక్ష కేంద్రానికి రావడానికి ఇష్టపడలేదు.
మరోవైపు పరీక్ష రాయడానికి వచ్చినవారు అర్ధంతరంగా వెనుదిరగాల్సిన పరిస్థితి. ఓయూ బీఎడ్‌కాలేజీలో 340 మంది అభ్యర్థులకు సెంటర్ కేటాయించగా, అందులో 141 మంది హాజరయ్యారు. ఆందోళనకారులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లి... పరీక్ష రాస్తున్నవారిని బయటికి తీసుకొచ్చి, జవాబు, ప్రశ్నాపత్రాలను తగులబెట్టారు. పరీక్షలు రాసిన వారు 35 శాతం కూడా దాటలేదు.
ఏపీపీఎస్సీ మొండివైఖరి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్-1 విషయం లో ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించకపోవడంతో మునుపెన్నడూలేనివిధంగా ఆందోళనల మధ్య పరీక్ష ముగిసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటికే రెండుసార్లు అర్థంతరంగా పరీక్షలు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ, ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ మొండివైఖరి అనుసరించడంతో ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఉద్రిక్తతల నడుమ పరీక్ష ముగిసింది.
పలు ప్రాంతాల్లో విద్యార్థులు మధ్యలోనే నిష్క్రమించారు. చైతన్యపురిలోని శ్రీచైతన్యకాలేజీలో ఓ విద్యార్థిని తాను పరీక్ష రాయకుండా తోటి విద్యార్థికి చెందిన హాల్‌టికెట్‌ను కూడా చించేసింది. సరూర్‌నగర్ చెరకుతోట కాలనీలోని పరీక్షా కేంద్రంలో మరో అభ్యర్థి నలుగురు విద్యార్థులకు చెందిన హాల్‌టికెట్లు చించారు. హైదరాబాద్‌లో 128 కేంద్రాలను పరీక్షకు ఎంపిక చేశారు. 62 వేల మంది అభ్యర్థులకు గాను 19 వేల మంది దాకా పరీక్షలు రాశారు. మొత్తం గణాంకాలు పరిశీలిస్తే 35 శాతం కూడా దాటకపోగా, ఏపీపీఎస్సీ మాత్రం 45.5 శాతం మంది పరీక్షలు రాశారని ప్రకటించింది.
వారి భవిష్యత్తు మాటేమిటీ
ఓయూ బీఎడ్ కాలేజీతో పాటు చైతన్యపురి, సరూర్‌నగర్‌లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షను సరిగ్గా రాయలేకపోయినవారితో పాటు గందరగోళం మధ్య పరీక్షలు రాసిన జిల్లా అభ్యర్థుల భవిష్యత్తు డైలమాలో పడింది. నెలరోజుల ముందు 90 శాతం మార్కులు వస్తాయని గ్యారంటీ ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాములు అనే నిరుద్యోగి వాపోయారు. గతంలో ఇంటర్వ్యూదాకా వెళ్లి... ఉద్యోగాన్ని మిస్అయి పోయిన అతను... ప్రస్తుతం ప్రిలిమ్స్ దాటుతానా లేదా అనుమానం వ్యక్తం చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరీక్షను రద్దు చేయడమే దీనికి పరిష్కారమని పలువురు సూచిస్తున్నారు.
- Andrajyothi

0 comments:
Post a Comment