No Telangana resolution in Assembly: Kiran

21న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు
- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు
()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను
కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద
ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్
అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో
తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు
కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం
లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన
వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు
ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్
అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన
నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు
వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర
ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ
పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని
తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని
నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం
గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు
భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్
షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి
అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు
రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ
తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ
చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.
ఈ సమావేశం
సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను
నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల
సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ
అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి
కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో
తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం.
కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో
సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర
హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు
సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం
వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు
సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం
ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల
విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి,
టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి,
బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని
ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు
చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
అదే
సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో
సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన
మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ
దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర
ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె
దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే
తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని
చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష
సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే
విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి
సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం
తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం
నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ
జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న
భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం
జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్
మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం
చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి?
అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన
రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన
నాకు మంచి మిత్రుడు.
ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం
వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది
కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని
చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా
విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014
ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని
అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా
ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు
20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును..
కేసీఆర్ కలిశారు.
కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు
చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే
చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై
త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన
వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి
హాజరవడం విశేషం.
నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత
రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి
సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి
ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్
నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే
వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను
అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.
ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం
ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం
నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని
ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి
తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు
జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల
సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు.
ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి,
విషయాలు వివరించినట్లు సమాచారం.
అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు
వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన..
ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా
వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి
ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే
సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ
గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త
ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ
నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద
వ్యాఖ్యానించారు.
‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66
ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత
చెప్పడం గమనార్హం
Take BY: T News
The messages are send at the lightning fast speed without any
advertisement attached to it. The other ways to earn through ULTOO is by
referring a friend you get payed Rs 1 for every friend referral.
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
హైదరాబాద్,
సెప్టెంబర్ 16 ):
1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు
తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో
మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే
పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ
స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో
దోబూచులాడాయి..!
బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం
నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని
గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..!
దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న
తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు
జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!
దేశానికి
స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు
పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు
కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ
తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం
కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను
అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన
తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది.
నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు
జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు
ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం
మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన
రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన
దినమా, విద్రోహ దినమా..
ఇదీ చరిత్ర...
బ్రిటిష్
పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్
యూనియన్‌లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు
రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా
చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో
తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు
తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్
కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం
ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం
చేయాల్సిందేనని నినదించారు.
ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట
కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు
ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే
ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట
సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ
ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు
ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు
అమరులయ్యారు.
గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల
ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా
విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం
మంత్రి సర్దార్ వల్లభాయ్‌ప హైదరాబాద్‌ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు
వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ
సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి
వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి
పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా
హైదరాబాద్‌ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్‌కు ఏడాదిపాటు హైదరాబాద్‌ను
పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్‌ప ఆశచూపించారు.
ఆ క్రమంలో
జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948
సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను
ఇండియన్ యూనియన్‌లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి
సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల
రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ
ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ
ప్రమాణం చేయించారు.
ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో
నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు
పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు
కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్‌లో
1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
‘సమైక్య’ కుట్ర..:నిజాం
నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు.
ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంవూధలో కలిపేశారు.
దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట
తెలంగాణను అణచివేస్తూనే ఉంది.
Take By: T News
-ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా బ్లడ్ బ్యాగ్‌ల తరలింపు
-అర్ధరాత్రి పట్టుకున్న స్థానికులు.. విచారణకు ఆదేశించిన కలెక్టర
: నెల్లూరులో బ్లడ్ ఫియా రెచ్చిపోతోంది..! బ్లడ్ బ్యాగ్‌లను
ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటుంది. ఈ దందా
గుట్టు ఆదివారం రాత్రి రట్టయింది. నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా
ఈ మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం అర్ధరాత్రి
100 బ్లడ్ బ్యాగ్‌లను నెల్లూరు ప్రభుత్వాస్పత్రి రక్తనిధి కేంద్రం
టెక్నీషియన్ ప్రదీప్ కుమార్, ఉస్మానియా ఆస్పవూతిలో టెక్నీషియన్‌గా
పనిచేస్తున్న మరగంటి వెంక తరలించుకుపోయేందుకు సిద్ధమయ్యారు. వారిని కొందరు
టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు
అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ
చేశారు.
సరిగ్గా ఏడాది క్రితం నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్
బ్యాంకులో బాలింతకు ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవీ కణాలుండటంతో అప్పట్లో రక్తం
పంపిణీపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు ఏడాదిపాటు సాగిన విచారణ అనంతరం
ఇటీవలే నెల్లూరు రెడ్ క్రాస్‌కు నూతన కమిటీని వేసి, ఆ రక్తనిధి కేంద్రాన్ని
పూర్తిస్థాయిలో సంస్కరించారు.
ఇదే సమయంలో నెల్లూరు ప్రభుత్వాస్పవూతికి
చెందిన బ్లడ్ బ్యాంకు రక్తాన్ని ఆస్పత్రి టెక్నీషియనే తరలించుకుపోవడం,
ఇందుకు ఉస్మానియా ఆస్పత్రి టెక్నీషియన్ కూడా సహకరించడం పలు అనుమానాలు
తావిస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు మాఫియా విస్తరించి ఉండొచ్చని
పలువురు భావిస్తున్నారు. కాగా, పట్టుబడ్డ రక్తం గత నెల 22న చిరంజీవి
పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల నుంచి సేకరించింది.
Take By: T News
CELL PHONE = CASH MACHINE
The next paradigm shift in
advertising is SMS Texts.
We need your help now!
Expanding at a great rate.
Get paid daily from day one
by placing free ads and help
others to do the same... Join Free
http://fastrupee.TextCashNetwork.com
![]() |
You have not participated at the forum. Use the forum before you use this widget! |
Blog Directory Blog Topsites
Blogs Blog Tools Allie Marie
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP