బాక్సాఫీస్ రికార్డులతో పవన్‌కళ్యాణ్...! ( నేడు పవన్ జన్మదినం)
పవన్‌కళ్యాణ్...
ఈ పేరుకు యూత్‌లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ అందరి చేత శభాష్ అనిపించుకునే నటులు
చాలా అరుదుగా వుంటారు. ఆ కోవలో ముందు వరుసలో వుంటాడు ఈ క్రేజీ కథానాయకుడు.
‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా రంగవూపవేశం చేసి
అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న ఈ కొణిదెల
హీరో ఖాతాలో వున్న విజయాలన్నీ మామూలు విజయాలు కాదు. తమ్ముడు, తొలివూపేమ,
బద్రి, ఖుషి ఇలా ఒక్కొ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా యువత హృదయాల్లో ఆ చిత్రాలకు వున్న స్థానం ఇప్పటికీ చెక్కు
చెదరలేదు. ఇక ఇటీవల వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ సాధించిన అనూహ్య విజయం దాదాపు 12
ఏళ్ళ తర్వాత ఆయన అభిమానుల్లో సంబరాలు నింపింది.
తెలుగు సినీ పరిక్షిశమలోని పాత రికార్డులన్నీ తిరగరాసి, ఆ చిత్రం వందరోజుల మైలురాయి చేరుకున్నా పవన్ మాత్రం ఆ విషయాలన్నీ పట్టించుకోలేదు. సింపుల్‌గా తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా వున్నాడు.ఇదే విజయం ఏ ఇతర హీరోకు లభించినా పరిస్థితి వేరుగా వుండేది. బాక్సాఫీస్ బాద్‌షా అంటూ తొడలు కొట్టుకుంటూ మీడియాలో వీరవిహారం చేసేవారు. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం మరో సినిమాతో అభిమానులను ఎలా అలరించాలనే విషయంపైనే దృష్టిపెట్టాడు. తాజాగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో పవనిజంను చూపి కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పిన పవర్‌స్టార్ త్వరలో కెమెరామెన్ గంగతో రాంబాబుగా మరోసారి తన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. సో.. పవన్ ఇలాగే తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ తెలుగు సినిమా మార్కెట్‌స్థాయిని పెంచే భారీ విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

Take by: T News
0 comments:
Post a Comment