పిల్లలకు నేర్పండి...‘పొదుపు’కథలు
పదేళ్ళ
అబ్బాయికి ఓ పది రూపాయలిస్తే ఏంచేస్తాడు? ఏ
చాక్లెట్టో..ఐస్‌క్రీమో..కొనుక్కుంటాడు. లేకపోతే స్పైడర్‌మేన్, సచిన్
టెండూల్కర్ స్టిక్కర్లు కొనుక్కుంటాడు. కొంత మంది బుద్ధిమంతులైన పిల్లలైతే ఆ
పదిరూపాయల్ని తీసుకెళ్ళి తమ కిడ్డీబ్యాంకులో వేసుకుం టారు. అది కూడా
అవన్నీ కూడబెట్టి పెద్ద బ్యాట్ కొనుక్కోవడానికే అయ్యుం టుంది. అలా కాకుండా ఆ
పదిరూపాయలతో ఆ పిల్లవాడు ‘డాడీ..దీంతో ఫలానా షేరు కొంటాను...మూడు నెలల్లో
పదిరెట్లు అవుతుంది’ అన్నాడనుకోండి.
నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో అని ఆ
తండ్రి పుత్రోత్సాహానికి అంతుండదు. కానీ పిల్లలకు ఈ వయసు నుంచే అంతపెద్ద
పొదుపు, పెట్టుబడి మాటలెందుకని అనిపించొచ్చు. కాలం మారింది.
ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు విలువ, పొదుపు అలవాటు, పెట్టుబడి పరిజ్ఞానం తెలియడం చాలా అవసరమని అంటున్నారు పిల్లల మానసిక శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకరైన వారెన్ బఫెట్ తొలి షేర్‌ను 11 ఏళ్ళ వయసులో కొన్నాడట. ‘అబ్బా..ఇంకాస్త చిన్న వయసులో మొదలుపెట్టి ఉంటే మరింత ధనవంతుడయ్యేవాడ్ని కదా’ అని సరదాగా బాధపడుతుంటాడట బఫెట్.
డబ్బు విలువ తెలియజేయడం కన్నా ముఖ్యమైనది పిల్లలలో పొదుపు, పెట్టుబడి అలవాటును ప్రోత్సహించడం. చిన్నప్పుడే అంత పెద్ద అలవాట్లు ఎందుకు అని తల్లిదండ్రులు అనుకోకుండా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేయడం మంచిది.
కిడ్డీబ్యాంక్‌తో పొదుపభ్యాసం
పిల్లలు ప్రీస్కూల్, కిండర్‌గార్డెన్ వయసులో ఉండగానే ప్రాథమిక డబ్బు విలువను అర్థం చేసుకోగల సమర్థత కలిగి ఉంటారని తల్లిదండ్రులు నమ్మాలి. అందుకే అప్పుడే కిడ్డీ బ్యాంక్‌ను ప్రవేశపెట్టాలి. ఆకర్షణీయమైన ట్రాన్స్‌పరెంట్ కిడ్డీ బ్యాంక్ బొమ్మను కొనివ్వండి. అందులో వేసే డబ్బులు బయటికి కనిపించే విధంగా ఉండాలి. అందులో వేసిన డబ్బులు చూపిస్తూ, డబ్బు ఎంతటి విలువైనదో ఎన్ని పనులు చేస్తుందో చిన్నచిన్న ఉదాహరణలతో, మాటలతో కొద్దిగా చెప్పండి. డబ్బు బయటకు కనిపించే కిడ్డీ బ్యాంక్‌లోంచి పిల్లలు డబ్బులు తీసినప్పుడు తగ్గిపోవడం, వేసినప్పుడు పెరగడం చూస్తున్నప్పుడు మీరు చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి. ఆ దశలో డబ్బు విలువను పిల్లలు రాశితోనే ఎక్కువ తక్కువలుగా లెక్కిస్తారు. కాబట్టి డబ్బు తగ్గిపోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. పొదుపు, బ్యాంక్, డిపాజిట్ వంటి పదాలు, వాటి అర్థాలు ముఖ్యంగా చిన్న కథల సహాయంతో చెప్తే పిల్లలకు ఎంతగానో హత్తుకుంటాయి.
కిడ్డీబ్యాంక్ నుండి ఆన్‌లైన్ బ్యాంక్‌కి
పిల్లలు కొద్దిగా ఎదిగి కేజీ చదువులు దాటి ముందుకు వెళ్తూ మేథ్స్ సబ్జెక్టులో బోలెడన్ని లెక్కలు చేస్తున్న దశకు చేరుకున్న సమయంలో పాకెట్ మనీని ఎలాగూ అలవాటు చేస్తారు. పిల్లల అవసరాలకు సరిపడా డబ్బులివ్వడమే కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బులివ్వండి. అలా ఇస్తూ చూద్దాం. ‘దాన్ని నువ్వు ఎంత తెలివిగా పొదుపు చేస్తావో’ అని పరోక్షంగా ఒక ప్రోత్సాహానిచ్చే కామెంట్ కూడా చేయాలి. దాంతోపాటు పిల్లలు చేసే ప్రతి ఖర్చును ఒక పుస్తకంలో రాసే అలవాటును కూడా ప్రోత్సహించండి. ‘ఆ యాభై రూపాయలు ఏం చేశావు’ అని అడిగినప్పుడు పిల్లలు గుర్తుకురాక తడబడుతూ, గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో తెగ ఇబ్బంది పడుతున్న సమయంలో ‘అందుకే అన్నీ ఒక పుస్తకంలో రాస్తే..ఏదీ మర్చిపోవు’ అని చెప్తే పిల్లల మనసులో బలంగా ముద్రించుకుపోతుంది. ఆ మరునాటి నుంచే పిల్లలు కూడా అకౌంట్స్ మెయింటెన్ చేయడం మెదలు పెడతారు. అదే సమయంలో పిల్లల పేరు మీద ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయాలి. అందులో కొంత డబ్బు డిపాటిజ్ చేసి కిడ్డీ బ్యాంక్‌కి, ఈ బ్యాంక్‌కి గల తేడాను పిల్లలకి చెప్పాలి. ‘కిడ్డీ బ్యాంక్‌లో వేసిన డబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈ బ్యాంక్‌లో డబ్బులు వేస్తే పెరుగుతాయి’ అని వారికి వడ్డీ గురించి వివరించాలి. ‘ఆ వడ్డీతో నువ్వు ఏం కొనుక్కున్నా..అసలు అలాగే ఉంటుంది’ అని తేలికైన పదాలతో వారికి శాస్త్రీయమైన పొదుపు పద్ధతుల గురించి చెప్పాలి. వీటన్నింటి నేపథ్యంలో డబ్బు విలువను పిల్లలు పదేపదే తెలుసుకుంటూ ఉంటారు. ఫలితంగా డబ్బు పట్ల నిర్లక్ష్య ధోరణిపోయి, జాగ్రత్త గౌరవం పెంచుతాయి.
పొదుపు నుంచి పెట్టుబడికి
బాల్యంలో డబ్బు విషయాలు పెద్దవాళ్ళ విషయాలుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం పాటిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ నేటి మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో పిల్లలను కుటుంబంలోని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం వీలు పడదు. అయినా, ఇప్పు డు అనేక సందర్భా లలో పిల్లలముందే ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. పైగా ‘బోలెడంత ఫీజులు కట్టి చదివిస్తున్నాం..బాగా చదువు’ అని ఎలాగూ పిల్లలతో అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలా ఆర్థిక విషయాల గురించి నెగెటివ్ భావాలు పెంపొందించే బదులు పాజిటివ్ భావాలు పెంపొందించడం మంచిది కదా..అని సలహా ఇస్తున్నారు పిల్లల వ్యక్తిత్వ వికాస నిపుణులు.
పిల్లలు 7వ తరగతికి వచ్చేసరికే వారి సిలబస్ చూస్తే వారు ఎంతటి కీలకమైన ఆర్థిక పరమైన అంశాలను అభ్యాసం చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆ పనుల నుండే వారికి ఏ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత వస్తాయి. ఒక 50 వేలు డిపాజిట్ చేస్తే ఏయే బ్యాంక్‌లో ఎంత ఆదాయం వస్తుంది. మొదలైన బాధ్యతలు పిల్లలకే అప్పగించాలి. డిపాజిట్లు, పెట్టుబడుల పద్ధతుల గురించి వారితో చర్చించాలి. ముఖ్యంగా వివిధ పెట్టుబడుల పద్ధతుల గురించి, ఎందులో పొదుపు చేస్తే, పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందో..పిల్లలకు వివరించాలి.
ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తున్న తరుణంలో పిల్లలలో కూడా పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కంపెనీలలో షేర్లు మొదలైనవి వారికి కొంత అర్థమవుతాయి. అందులోని సందేహాలను తల్లిదండ్రులు తీర్చాలి. ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి పిల్లలకే పెట్టుబడి నిర్ణయాధికారం ఇవ్వాలి. ‘ఇదిగో ఈ లక్ష రూపాయలు, లేదా ఓ ఇరవై వేలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టమంటావో చెప్పు’ అని తల్లిదండ్రులు పిల్లలని అడిగితే, వాళ్ళు ఆ విషయంపై ఎంతో పరిశోధన, విశ్లేషణ చేస్తారు. ఆ ప్రక్రియలో పిల్లలు ఆర్థిక అంశాల విషయంలో ఎంతో తెలివైన వారుగా రూపుదిద్దుకుంటారు.
కొంత డబ్బుతో ప్రత్యేకంగా పిల్లల సలహామేరకు వారి స్వేచ్ఛా నిర్ణయానుసారం పెట్టుబడులు జరుగుతుంటే ఆ డబ్బు పెరుగుతుంటే ఆ అంశంపై వారికి మరింత ఆసక్తి రావడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. డబ్బుపట్ల విపరీతమైన జాగ్రత్త పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు ఏదైనా అనవసరంగా ఖర్చు చేస్తే పిల్లలే అది వృథా ఖర్చని, వద్దని వారించే స్థితికి వస్తారు.
ఏ వయస్సులో..
ఎలాంటి పొదుపు?
సం॥ వయస్సున్న పిల్లలకు కిడ్డీ బ్యాంక్ పొదుపు అలవాటు చేయండి. పెరిగే, తరిగే డబ్బును చూపిస్తూ డబ్బు విలువ తెలియజేయండి. చిన్న చిన్న పొదుపు లక్ష్యాలు పెట్టండి. 100 రూపాయలు ఎప్పుడూ చేస్తారో అప్పుడు బొమ్మ కొనుక్కోవచ్చు వంటి సరదా లక్ష్యాలు పెట్టండి.
సం॥ వయసు ఉన్న పిల్లల పేరుమీద బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించాలి. ఆపాస్ పుస్తకం, అందులో పేర్లు పిల్లలకి ఆసక్తిగా ఉంటాయి. అప్పుడే బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ పద్ధతులు, వడ్డీ వివరాలు చెప్పాలి. ఆ సమయంలో పిల్లలకు సరిగా అర్థంకాక అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి.
సం॥ వయసు పిల్లలకు అప్పటికే డబ్బు, పొదుపు, పెట్టుబడి అంశాలపై ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. కాబట్టి పొదుపు పెట్టుబడుల విషయంలో వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. వారి వెంట ఉంటూ వాటిని అమలు చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మంచిది? అందుకు కారణాలేమిటో పిల్లల్ని అడగాలి. దాని నుంచి వచ్చే జవాబులు ఎంతో కీలకమైనవి.
సం॥ వయసున్న పిల్లలకు చేతిలో కొంత డబ్బు ఇచ్చి దాని పూర్తి పెట్టుబడి బాధ్యత, ఆ మొత్తాన్ని ఎక్కువ చేసే బాధ్యత వారికే అప్పగించాలి. అది చిన్న చిన్న మొత్తాలుగా ఉండాలి. వారి నిర్ణయాలలో తారుమారై నష్టం సంభవించినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. అది వారికి ఎంతో విలువైన అనుభవం అవుతుంది.

Take By: T News
0 comments:
Post a Comment