నెల్లూరులో బ్లడ్ మాఫియా! blood_mafiya
-ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా బ్లడ్ బ్యాగ్‌ల తరలింపు
-అర్ధరాత్రి పట్టుకున్న స్థానికులు.. విచారణకు ఆదేశించిన కలెక్టర
: నెల్లూరులో బ్లడ్ ఫియా రెచ్చిపోతోంది..! బ్లడ్ బ్యాగ్‌లను
ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటుంది. ఈ దందా
గుట్టు ఆదివారం రాత్రి రట్టయింది. నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా
ఈ మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం అర్ధరాత్రి
100 బ్లడ్ బ్యాగ్‌లను నెల్లూరు ప్రభుత్వాస్పత్రి రక్తనిధి కేంద్రం
టెక్నీషియన్ ప్రదీప్ కుమార్, ఉస్మానియా ఆస్పవూతిలో టెక్నీషియన్‌గా
పనిచేస్తున్న మరగంటి వెంక తరలించుకుపోయేందుకు సిద్ధమయ్యారు. వారిని కొందరు
టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు
అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ
చేశారు.
సరిగ్గా ఏడాది క్రితం నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్
బ్యాంకులో బాలింతకు ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవీ కణాలుండటంతో అప్పట్లో రక్తం
పంపిణీపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు ఏడాదిపాటు సాగిన విచారణ అనంతరం
ఇటీవలే నెల్లూరు రెడ్ క్రాస్‌కు నూతన కమిటీని వేసి, ఆ రక్తనిధి కేంద్రాన్ని
పూర్తిస్థాయిలో సంస్కరించారు.
ఇదే సమయంలో నెల్లూరు ప్రభుత్వాస్పవూతికి
చెందిన బ్లడ్ బ్యాంకు రక్తాన్ని ఆస్పత్రి టెక్నీషియనే తరలించుకుపోవడం,
ఇందుకు ఉస్మానియా ఆస్పత్రి టెక్నీషియన్ కూడా సహకరించడం పలు అనుమానాలు
తావిస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు మాఫియా విస్తరించి ఉండొచ్చని
పలువురు భావిస్తున్నారు. కాగా, పట్టుబడ్డ రక్తం గత నెల 22న చిరంజీవి
పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల నుంచి సేకరించింది.
Take By: T News
0 comments:
Post a Comment