స్వేచ్ఛకోసం ..నెత్తురోడిన మెతుకు సీమ
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
సరిగ్గా
64 ఏళ్ల కిందట ఇదే రోజు మెదక్‌లో మువ్వన్నెల పతాకం రెపరపలాడింది. రజాకార్ల
నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు
అది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. ఏడో నిజాం నవాబు నాటి
కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఎదుట మోకరిల్లిన క్షణం.. తెలంగాణ
వ్యాప్తంగా స్వాతంత్య్ర సంబురాలు మిన్నంటాయి. ఈ పోరాటంలో ‘మెతుకుసీమ’ పాత్ర
మరువలేనిది. రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి మెతుకుసీమ బిడ్డలు చరివూతలో
నిలిచిపోయారు. రాచరికపు బానిస సంకెళ్లు తెంచి పోరాట స్ఫూర్తి
ప్రదర్శించారు. ఇపుడు మళ్లీ అదే సందర్భం. అదే స్ఫూర్తితో ముందడగు వేయాల్సిన
ఆవశ్యకత. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాటఘట్టాలపై
మెదక్, (): 1947 ఆగస్టు 15న దేశం మొత్తం మీద ఓ వైపు సంబురాలు జరుగుతుంటే మరోవైపు ఆంధ్రవూపదేశ్‌లోని తెలంగాణ జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఫర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల ప్రజలు రజాకార్ల వ్యతిరేక పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇండియన్ యూనియన్‌లో విలీనమవ్వడానికి నిజాం నిరాకరించాడు. తన ఆధీనంలోని రాజ్యంలో 1947 ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదని నిషేధాజ్ఞలు విధించాడు. 1946 మే 10, 11వ తేదీల్లో సంగాడ్డి మండలం కంది గ్రామంలో జరిగిన 13వ ఆంధ్రమహాసభలతో ఉత్తేజితులైన ప్రజలు జిల్లావ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. గ్రామాల్లో పండించిన పంటలు, ఆస్తులు దోచుకుంటున్న రజాకార్లను ఎదుర్కోవడానికి గ్రామ గ్రామాన యువకులు, ఆర్యసమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. 1947 జూన్ 16, 17, 18వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ సమావేశాలకు జిల్లా నుంచి తేర్పోల్‌కు చెందిన జె.రామిడ్డి తదితరుల నాయకత్వంలో పలువురు హాజరయ్యారు. ఊరూరా జెండా వందనాలు చేయాలని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌వాదులు జిల్లాలోని కల్పగూర్, అల్లాదుర్గం, శంకరంపేటల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే రజాకార్ల దురాగతాలు పెచ్చుమీరడంతో ఆవేదన చెందిన నాందెడ్ జిల్లా తహసీల్దార్ ఫరీద్‌మీర్జా 1947 జూలై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేయడం ఉద్యమకారులకు మరింత బలాన్నిచ్చింది. 1947 ఆగస్టు 11న జోగిపేటలో బస్వ మాణయ్య అనే నాయకుడి ఇల్లు సోదా చేసి ఆయనను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఆగ్రహం చెంది పోలీస్‌స్టేషన్‌పై దాడికి యత్నించగా, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు ఉద్యమకారులు మెదక్‌ను ఎంచుకున్నారు.
మెదక్‌లో తూటాలకు ఎదురొడ్డి పతాకావిష్కరణ
1947 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, తూటాలకు ఎదురొడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు మెదక్ పట్టణాన్ని ఎంచుకున్నారు. మెదక్ నివాసి గడియారం హన్మంతరావు నివాసంలో ఈ విషయమై రహస్యంగా సమావేశం నిర్వహించి శంకర్‌రావు తోటలో జెండా వందనానికి రంగం సిద్ధం చేశారు. 1947 ఆగస్టు 15న జెండా ఆవిష్కరించిన వారిని కాల్చి చంపుతామని ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు హెచ్చరికలు జారీ చేశారు. రజాకార్ల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ దాదాపు 20 వేల మంది ప్రజలు మెదక్‌లో జెండా వందనానికి హాజరుకాగా, కూచన్‌పల్లికి చెందిన రామాగౌడ్ పతాకావిష్కరణ చేశారు. 1947 సెప్టెంబర్ 2న సంగాడ్డిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు నిర్ణయించారు. మహంకాళి నారాయణ, వెంకయ్య, శంకర్‌ల నాయకత్వంలో సెప్టెంబర్ 2న తెల్లారేసరికి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
సజీవ దహనాలు
1947 సెప్టెంబర్ 4న కోడూర్ గ్రామ పటేల్ రంగాడ్డి రజాకార్ల దురాగతానికి బలవ్వగా, ఖాదిరాబాద్‌లో ఉద్యమకారుడు దుగ్గిశెట్టి విశ్వనాథం తండ్రిని రజాకార్లు సజీవ దహనం చేశారు. రైతు సంగప్ప అనే వ్యాపారిని 1947 అక్టోబర్ 24వ తేదీన రజాకార్లు సజీవ దహనం చేసి చంపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పటాన్‌చెరు మండటం జానకంపేట వాసులు కంది శ్రీనివాస్‌రావు నాయకత్వంలో బాణాలతో పోరాడారు. కంది కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, మచ్చ వెంక గుప్తల ఆధ్వర్యంలో పటాన్‌చెరు, పరిసర గ్రామాల్లో ఉద్యమకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించి పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు, పాటి ఘణపూర్, కిష్టాడ్డిపేట గ్రామాలకు చెందిన వెంకటరత్నం, మల్లయ్యలను అరెస్ట్ చేసి సికింవూదాబాద్ జైల్లో నిర్బంధించారు.
దగ్ధమైన సదాశివపేట
1947 అక్టోబర్ 24వ తేదీ సదాశివపేటలో చరివూతలో మరువలేనిది. ఆ రోజు ఒకవైపు దసరా పండగ సంబురాలను ప్రజలు జరుపుకుంటుండగా..అజాంఖాన్, శంశోద్దీన్‌ల నాయకత్వంలో రజాకార్లు సదాశివపేటపై దాడి చేసి మార్కెట్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను దగ్ధం చేశారు. కిరోసిన్ దుకాణంతో పాటు మొదలుపెట్టిన ఈ దహనకాండకు తన దుకాణానికి తోరణం కడుతున్న సంగప్ప అనే వ్యాపారిని అదే దుకాణంలో వేసి సజీవ దహనం చేశారు.
ప్రేరణనిచ్చిన కలం యోధుడు మాణిక్యరావు
సురవరం ప్రతాప్‌డ్డి ప్రారంభించిన గోల్కొండ పత్రికలో పాత్రికేయుడిగా పనిచేసిన వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. ఫిరోజ్ మీర్జా, బాకర్ అలీమీర్జా, సిరాజుల్‌హాసన్ వంటి ప్రగతి కాముక ముస్లిం మేధావుల మాటలను పెడచెవిన పెట్టిన మత ఛాందసవాద, ఫాసిస్టు భావజాల రజాకార్ల మాటలు విని ప్రజలపై విపరీతమైన దురాగతాలకు, అత్యాచారాలకు పాల్పడ్డ నిజాంపై హైదరాబాద్ స్టేట్ ప్రజల పిలుపు మేరకు ఇండియన్ యూనియన్ సైన్యాలు పోలీస్ యాక్షన్ పేరిట 1948 సెప్టెంబర్ 13న నల్దురుపై దాడి చేసి వశపర్చుకున్నాయి. ఆ తర్వాత వరుసగా భారత సైన్యాలు పురోగమించడంతో నిజాం నవాబు లొంగుబాటును ప్రకటించారు. దీంతో నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. రాచరిక పాలన అంతమైంది.
Take By: T News
0 comments:
Post a Comment