Tuesday, January 31, 2012
కొనబోతే కొరివి
- వినియోగదారుడు విలవిల
- దిగుబడి తక్కువ.. డిమాండ్ ఎక్కువ
- దళారులదే రాజ్యం
- రైతుకు దక్కని మద్దతు
- ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
- మార్కెట్‌లో స్టోరేజీల కొరత
- పెరిగిన రవాణా చార్జీలు
- బెండకాయలు కిలో రూ. 40
- వంకాయలు కిలో రూ. 30ఏది కొన్నా జేబుకు చిల్లే
- చుక్కల్లో కూరగాయల ధరలు
చిక్కుడు... కొండెక్కింది..! చింతపండు మరీ పులుపెక్కింది..! కాకరకాయ చేదునే మిగులుస్తున్నది..! ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, ఊర్ల గడ్డ.. ఏ కూరగాయలు తీసుకున్నా భగ్గుమంటున్నాయి. పాలకూర, మెంతికూర, చుక్కకూర.. ఏ ఆకుకూర అయినా ముట్టుకుంటేనే మూర్ఛ వచ్చేలా ఉంది. ఎన్నడూ లేనంతగా మార్కెట్‌లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. పొద్దస్తమానం కాయకష్టం చేసి వాటిని పండించే రైతుకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు. దళారుల రాజ్యంలో ఇటు రైతు, అటు వినియోగదారుడు నిండా మునిగిపోతున్నారు. వారం వ్యవధిలో మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయల ధరలు ఊహించని స్థాయిలో పెరిగి పోయాయి. వంద రూపాయలు తీసుకొని మార్కెట్‌కు పోతే... ఒకటీ, రెండు కూరగాయలు తప్ప ఏమీ కొనలేని పరిస్థితి.
ఇన్నాళ్లు 15 రూపాయలకు కిలో దొరికిన బెండకాయలు ఇప్పుడు రూ.40 పెట్టినా గానీ దొరకడం లేదు. రవాణా చార్జీలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోవడంతో రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. దీనికి కరువు పరిస్థితులూ తోడై దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గి పోవడం తోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటు న్నారు. తాము పంట పండించినా మార్కెట్‌లో అమ్ము కోవడానికి ప్రభుత్వ సహకారం లభించడం లేదని, ఫలితంగా దళారులను ఆశ్రయిస్తున్నా మని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు కూరగాయల ధరలు పెరిగి పోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
(టీ న్యూస్-నెట్‌వర్క్): గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి.. అన్నట్లుంది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 69,42,562 హెక్టార్లలో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు పెరిగిపోతే వాటిని పండించిన రైతులు ప్రయోజనం పొందాలి. కానీ వారికి మద్దతు ధర దక్కడం లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. దళారులు మాత్రమే బాగుపడుతున్నారు. రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కూరగాయాలకు వారే ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 650 వరకు రైతు బజార్లు ఉన్నాయి.
హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ప్రధానమైనవి 16 రైతు బజార్లు ఉన్నాయి. ఏ ఒక్క రైతు బజారులోనూ రైతులు కూరగాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు అప్పటికప్పుడు అమ్ముకొని పోవాల్సి వస్తోంది. లేకుంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైతుల నుంచి టామాటలను కిలోకు ఒక్క రూపాయి చొప్పున దళారులు కొంటారు. వాటిని వినియోగదారులకు రూ. 6 చొప్పున అమ్ముతారు. దళారుల దందా మూలంగా ఇటు రైతులు, అటు వినియోగదారులు మోసపోతున్నారు.
రవాణా చార్జీలు పెరగడం కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పెరిగిన డీజిల్ ధరలు రైతులపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతున్నాయి. పంట వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి దున్నింది మొదలు మార్కెట్‌కు కూరగాయలను తరలించే వరకు డీజిల్ ధరల ప్రభావం వారిపై పడుతున్నది. రైతులు నష్టపోవడానికి ఇదీ ఓ కారణం. రైతులు పండించిన పంటలు బహిరంగ మార్కెట్‌లో వారే ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం కల్పించినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది.
హైబ్రీడ్ విత్తనాలతో రైతుల బేజారు
విత్తనాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రకరకాల కంపెనీల పేరుతో హైబ్రీడ్ విత్తన సంస్థలు పుట్టుకొచ్చాయి. హైబ్రీడ్ విత్తనాల పంటలు ఏపుగా పెరుగుతున్నాయి తప్ప కాత కాయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు కాంప్లెక్స్ ఎరువులు విరివిగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోతున్నది తప్ప పంట దిగుబడి రావడం లేదు. హైబ్రీడ్ విత్తనాలతో వచ్చిన తొలి పంటను రిలయన్స్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తాయి. మలి పంటను తీసుకోవడానికి ఈ సంస్థలు నిరాకరిస్తాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ రైతులు మార్కెట్‌కు తరలించే పరిస్థితి ఏర్పడుతున్నది.
చైతన్యం నింపని సదస్సులు
ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రైతు చైతన్య సదస్సులు రాజకీయ సదస్సులుగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏ కాలంలో ఏయే పంటలు వేయాలి.. ఏ మోతాదులో ఎరువులు వాడాలి.. పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పంటను మార్కెట్‌కు తరలించినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి? దళారుల బారిన పడకుండా పంటను ఎలా విక్రయించుకోవాలి తదితర విషయాల్లో రైతులకు ఈ సదస్సుల ద్వారా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం మొక్కుబడిగా వీటిని నిర్వహించి చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్‌కు ధరల సెగ
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయాయి. మరో 20 రోజుల్లో ఉత్పత్తి పడిపోనుంది. వారం రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కిలోకు సుమారు రూ.15 నుంచి రూ.1 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం పడిపోవడం, కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు వాటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా సరిపడా కూరగాయలు దిగుమతి కావడం లేదు. నగరంలో రోజుకు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 200-300 మెట్రిక్ టన్నులు దిగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ కూరగాయలు లేకపోవడంతో దళారులదే రాజ్యంగా మారుతోంది. వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్‌లో 40 శాతం ధరలను పెంచి వారు సొమ్ము చేసుకుంటున్నారు.
దళారుల ధరలు..
రైతుబజార్లలో ధరలకు సంబంధించి 1999లో ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. వాటి ధరలు సమీపంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ల ధరలకు దగ్గరగా ఉండాలి. ఎస్టేట్ అధికారులు, రైతులు కలిసి నాణ్యత ప్రమాణంగా ధర ఖరారు చేయాలి. కానీ హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఇది జరగడం లేదు. బోయిన్‌పల్లి మార్కెట్‌లోని కూరగాయల రేట్ల ఆధారంగా హైదరాబాద్ నగరంలోని రైతుబజార్లలో ధరలు నిర్ణయిస్తున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే అక్కడ సాధారణంగా ధరలు పెంచుతారు. ఆ ప్రభావం నగరంలోని అన్ని రైతుబజార్లపై పడుతుంది. వాస్తవంగా అక్కడి కూరగాయలకు, రైతుబజార్లలో రైతులు తీసుకువచ్చే వాటికి ఎలాంటి సంబంధం లేదు.
మెదక్‌లో కూర‘గాయాలు’: రాష్ట్ర రాజధాని మెదక్ జిల్లాకు ఆనుకొని ఉండటంతో నగరవాసుల కూరగాయల అవసరాల్లో సింహభాగం మెదక్ జిల్లానే తీరుస్తున్నది. జిల్లాలోని వర్గల్, ములుగు, గజ్వేల్, తూప్రాన్, జగదేవపూర్, తొగుట, గుమ్మడిదల, జిన్నారం వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువ సంఖ్యలో కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ నుంచి ప్రతిరోజూ సుమారు 170 నుంచి 200 టన్నుల కూరగాయలు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. నగరవాసుల అవసరాలు తీరుస్తున్నా స్థానికంగా మాత్రం కూరగాయల రేట్లు మండిపోతున్నాయి.
మహబూబ్‌నగర్, ఖమ్మంలో కష్టాలు
జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితుల్లో లేరు. ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లలో నీటి శాతం తగ్గింది. వాటితో పాటు ఇటీవల ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల కూరగాయలు ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పడిపోయింది. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులకు కూరగాయలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోనూ కూరగాయల ధరలు భగ్గున మండుతున్నాయి. ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్యులు మార్కెట్లో కూరగాయలు కొనలేని దుస్థితి ఏర్పడుతోంది. అంగట్లో అదిరిపోయే ధరలతో సామాన్యుల దిమ్మ తిరుగుతోంది. పూటగడవని కూలీలకు పచ్చళ్ళే పంచభక్షపరమాన్నాలుగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర అందటంలేదు.
ఆదిలాబాద్ అతలాకుతలం
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మార్కెట్లలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత పక్షం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయని వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, వర్షాభావ పరిస్థితులు, సాగు ఖర్చులు పెరగడం, రవాణా చార్జీలు తడిసి మోపెడు కావడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక కొన్ని కూరగాయలు మార్కెట్‌లలో దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. మార్కెట్‌లో క్యాలిఫ్లవర్, తోటకూర, బీరకాయ, గోరుచిక్కుడు, దోసకాయ, చిక్కుడుకాయ లాంటి కూరగాయలు అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే టమాట, ఆనిగపుకాయ, బెండకాయ, కాకరకాయ, ఆకుకూరలైన పాలకూర, మెంతికూర, దిగుబడి 50 శాతం మేరకు తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. మిర్చి, వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, క్యాబేజీ పంట దిగుబడులు చివరి దశకు చేరుకున్నాయి.
కరీంనగర్‌లో తగ్గిన విస్తీర్ణం
కరువు కారణంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2,65 హెక్టార్లు కాగా 700 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. లేబర్ కొరత కారణంగా కూరగాయలు సాగు మాని పత్తిపంట వైపు రైతులు మొగ్గు చూపారు. పత్తిపంటకు గత ఏడాది మద్దతు ధర ఎక్కువ రావడంతో అటువైపు మొగ్గుచూపారు. ఎక్కువ కూరగాయల ఉత్పత్తులు జరిగే కరీంనగర్ మండలాన్నే తీసుకుంటే గత ఏడాది 1500 ఎకరాల్లో సాగు జరిగితే ఈ ఏడాది ఐదు వందల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. బోయినపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో ఏటా ఐదు వందల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే ఈ ఏటా రెండువందల ఎకరాల్లో మాత్రమే సాగుజరిగింది. జిల్లాలో ఒక్క టమాట మినహా అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక వరంగల్, నిజామాబాద్, నల్లగొండతో పాటు సీమాంవూధలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
Take By: T News
నేడు వేతన ఒప్పందం ఖరారు!
- రెండు ప్రధాన డిమాండ్లకు కోలిండియా ఓకే
గోదావరిఖని/ కోల్‌బెల్ట్, : ఏడు నెలలుగా ఊరిస్తున్న బొగ్గు గని కార్మికుల తొమ్మిదో వేతన ఒప్పందంపై మంగళవారం ఎంఓయూ కుదిరే అవకాశముంది. కొంతకాలంగా వేజ్‌బోర్డు చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఓం ప్రకాశ్ జైస్వాల్‌తో జేబీసీసీఐ కోర్‌కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు డిమాండ్లపై సానుకూలత వ్యక్తమైనట్లు ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి ‘టీన్యూస్’కు తెలిపారు. కోల్ ఫీల్డ్ అల 4 శాతం, హెచ్‌ఆర్‌ఏ 2 శాతం పెంచేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. కార్మిక సంఘాలు కోల్‌ఫీల్డ్ అల 5 శాతం, హెచ్‌ఆర్‌ఏ 10 శాతం పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ కొంత పట్టు విడవడంతో చర్చల్లో ప్రతిష్టంభన తొలగినట్లయింది. ఐదు దఫాలుగా కోలిండియా యాజమాన్యంతో జాతీయ కార్మిక సంఘాలు జరిపిన చర్చల్లో 25 శాతం వేతనాల పెరుగుదలపై ఇప్పటికే అవగాహన కుదిరింది. అలాగే ఇప్పుడిస్తున్నఅల శాతం పెంచేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో వేతన ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేసే అవకాశముంది. ఈ లెక్కన సగటున ఓ కార్మికుడికి రూ. 3500 వేతనం పెరిగే అవకాశం ఉంది. సింగరేణి సీఎండీ నర్సింగరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం అధ్యక్షుడు నర్సింహారావు, ఐఎన్టీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీ వెంకవూటావు, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తదితరులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. మంగళవారం తుదిచర్చల్లో పాల్గొని వేతన ఒపందాన్ని ఖరారు చేస్తారని తెలిసింది.
Monday, January 30, 2012
నేడు టెట్ ఫలితాలు and డీఎస్సీ నోటిఫికేషన్ నేడే (TET and DSC)
హైదరాబాద్, జనవరి 29 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే పార్థసారధి సచివాలయంలో మధ్యాహ్నం రెండున్నరకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలను www.aptet.cgg.gov.in లో చూడొచ్చు.
హైదరాబాద్, జనవరి 29 (): డీఎస్సీ-2012 నోటిఫికేషన్ సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 22, 622 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఇటీవల రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) 9569 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసింది. ఇన్ సర్వీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పదోన్నతులు కల్పించింది. ప్రమోషన్లతో భర్తీ చేసిన పోస్టుల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ పోస్టుల స్థానంలో డీఎస్సీలో నేరుగా ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుల సంఖ్య, వివరాలపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నానికల్లా జీవో వస్తే సాయంత్రం లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
డీఎస్సీకి మరో కొర్రి (DSC)
- జీవో నెంబర్ 4 జారీ
- వేలాదిమందికి డీఎస్సీ చాన్స్ లేనట్లే!
- రోజుకో నిబంధనతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు
- ఆ నిబంధనను వెంటనే తొలగించాలి
- టీచర్ అభ్యర్థుల మండిపాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (): అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధన తెస్తూ అభ్యర్థుల ఆశలను అడియాశలు చేస్తోంది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా చేసిన సర్కారు తాజాగా మరో కొర్రీని తెరపైకి తెచ్చింది. బీఈడీలో చదివిన సబ్జెక్టు కచ్చితంగా ఇంటర్‌లోనూ చదవి ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో వేలాది మంది బీఈడీ అభ్యర్థులు డీఎస్సీకి అనర్హులయ్యే అవకాశం ఉంది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులు డిగ్రీలో బీఏ, బీకాంలకు మారి.. బీఈడీలోనూ అవే సబ్జెక్టులు చదివితే.. డీఎస్సీకి అర్హత కోల్పోతారు. దీంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
విద్యాశాఖ మొదటి నుంచి బీఈడీ అభ్యర్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది. కొత్త నిబంధనలు తెస్తూ ఒక్క దెబ్బకు వేల పిట్టలన్న చందంగా టీచర్ పోస్టులకు చాలామందిని దూరం చేస్తోంది. దూరవిద్య విధానంలో డిగ్రీ, బీఈడీ చేసినవారిని టెట్‌కు అనర్హులుగా ప్రకటించింది. దీంతో వారు డీఎస్సీ అవకాశం కోల్పోయారు. తాజాగా ఇంటర్, డిగ్రీ, బీఈడీ ఇలా వరసగా అన్నీ చదివి చివరకు టెట్ నెగ్గినా డీఎస్సీ రాయలేని పరిస్థితి. డీఎస్సీ అభ్యర్థులు బీఈడీలో చదివిన సబ్జెక్టును ఇంటర్‌లోనూ తప్పనిసరిగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తూ 9న విద్యాశాఖ జీవో నెం.4ను జారీ చేసింది. ఇంటర్, బీఈడీల్లో ఒకే సబ్జెక్ట్ చదివినవారే డీఎస్సీకి అర్హులని తేల్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల కారణంగా బీఈడీ అభ్యర్థులు ఇప్పటికే ఎస్‌జీటీ పోస్టులకు దూరమయ్యారు. ఇక వారికి మిగిలింది స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) పోస్టులే. తాజా నిబంధనతో చాలామందికి ఈ పోస్టులు కూడా ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ నిబంధన ఎడ్‌సెట్‌కు ఎందుకు లేదు?
బీఏ, బీకాం, బీఎస్సీ చదివిన వారు సంబంధిత డిగ్రీ సబ్జెక్టులో బీఈడీ చేసుకునే అవకాశం ఉంది. బీఈడీలో చదవబోయే సబ్జెక్టును ఇంటర్‌లోనూ కచ్చితంగా చదవాలనే నిబంధన ఎడ్‌సెట్‌లో లేదు. తాజా నిబంధనను ఎడ్‌సెట్‌కూ వర్తింపచేస్తే చాలామంది బీఈడీ చేసేవాళ్లే కాదు. టెట్ పేపర్‌పై ఆందోళన చేస్తున్న తమకు మరో షాక్ ఇచ్చేలా రాష్ట్రవూపభుత్వం ఈ నిబంధన తెచ్చిందని అభ్యర్థులు మండిపడుతున్నారు.
టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీకి అవకాశమివ్వండి - పీఆర్‌టీయూ డిమాండ్
హైదరాబాద్, జనవరి 29 (టీ న్యూస్): డీఈడీ పాసైన అభ్యర్థులందరికీ టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని పీఆర్‌టీయూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే టెట్ నిర్వహించి డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని సంఘం అధ్యక్షుడు పీ వెంకట్‌డ్డి, కార్యదర్శి పూల రవీందర్ విమర్శించారు.
మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు..
బీఈడీ అభ్యర్థుల పరిస్థితి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్లకే సరిపుచ్చుతామంటున్న ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనతో బీఈడీ అభ్యర్థులను వేధిస్తోంది.
ప్రభుత్వ చెలగాటం
ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులతో చెలగాటమాడుతోంది. జీవో నెం.3ను రద్దు చేసి మా ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపింది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన వారు అనివార్య కారణాలతో డిగ్రీలో బీఏ, బీకాం చేసి టెట్ నెగ్గినా కూడా వారికి డీఎస్సీలో అవకాశం కల్పించలేమని ప్రభుత్వం చెప్పడం దారుణం.
ఈ నిబంధన అర్థం లేనిది
బీఈడీలో చదివిన సబ్జెక్ట్‌ను ఇంటర్‌లో చదవాలనడం అర్థం లేని విషయం. ఇంటర్ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా బీఈడీ చదివే అవకాశం ఎందుకు కల్పించారు. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్ చదివి బీఈడీ చేసిన వారు మళ్లీ ఆర్ట్స్‌లో ఇంటర్‌లో చదవాలా?
వెంటనే తొలగించాలి
బీఈడీలో చదివిన సబ్జెక్ట్‌ను ఇంటర్‌లో చదవాలనే నిబంధనను ప్రభుత్వం వెంటనే తొలగించాలి.
అధికారానికి బడుగులే!
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమూ అంతంతేఎక్కడా దక్కనిదామాషా వాటా
- పార్టీల్లోనూ టికెట్లు కరువే
- మభ్యపెడుతున్న ప్రధాన పార్టీలు
- సంక్షేమ పథకాల కుప్పల్లో కూరుకుపోయిన బలహీన వర్గాలు
- అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే
- పార్టీ జెండా మోయడానికే పరిమితం!
(, హైదరాబాద్)వారికి జెండా మోయడం తెలుసు! తమ నాయకులను అధికారంలోకి తేవడం తెలుసు! పార్టీ కోసం గొంతుచించుకుని అరవగల సత్తా వారిది! నేతలు ఇబ్బంది పడితే తామే ఇబ్బందిపడినట్లు బాధపడే మనస్తత్వం వారిది! ఏళ్ల తరబడి కొన్ని కొన్ని పార్టీలను నమ్ముకుని ఉన్నారు! అగ్రకుల పార్టీ నేతలకూ ఆ విషయం తెలుసు! అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే అంత ప్రేమ! కానీ ఆ ప్రేమ వారితో జెండా మోయించేంత వరకే! ఓట్ల పండగలో వెంట తిప్పుకోవడం వరకే! మహా అయితే అందులో ముఖ్యమైన వారికి ఐదో పదో పదవులు, కొన్ని ప్రయోజనాలు కల్పించడం! అంతవరకే! కానీ వారిలో ఎవరూ ఆ పార్టీలో కీలక స్థానాలకు ఎదగలేరు! ఇక ముఖ్యమంత్రి పదవంటే మాటలా! ఇది దశాబ్దాలుగా రాజకీయ కుల సమరంలో ఎప్పుడూ ఓడిపోతున్న బడుగు వర్గాల కార్యకర్త పరిస్థితి! ఓట్ల పరంగా అధిక సంఖ్యాకులైనప్పటికీ.. అధికార పంపిణీలో మాత్రం చిన్నచూపే! టికెట్లు కేటాయించే దగ్గర మొదలు.. గెలిస్తే కీలక పదవులు కట్టబె అదే వివక్ష! బడుగులకు రాజ్యాధికారం సహించని తత్వమేనన్నది కడుపుమండినవారి విమర్శ! అది అగ్రకుల తత్వమేనన్నది సమాజాన్ని కాచివడపోసిన వారి మాట! ఏది ఏమైనా.. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నాయి! అగ్రకుల పెత్తనంలో కొనసాగుతున్న పార్టీలు వారిని ఆ స్థాయికి తీసుకురావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి! ఇది నగ్న సత్యం!రాష్ట్ర చరివూతలో అప్పుడు ఇప్పుడూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందని పండుగానే ఉంది. ఓట్ల రాజకీయాల కోసం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ఈ పార్టీలే దానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేందుకు చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకోకపోవడం గమనార్హం.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తమ ఆటలు సాగవనేది గమనించిన ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు బీసీలు ఉద్యమాలతో సంఘటితం కాకుండా దృష్టిమళ్ళించే చర్యలకు పాల్పడుతున్నాయన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించినవారిని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నప్పటికీ.. అధిక శాతం ఓట్లున్న బీసీలకు రాజకీయపార్టీలు తగిన రీతిలో టిక్కెట్లు కేటాయించకపోవడం వల్ల ‘పదవుల్లో’ లేకుండా పోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అని రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రకుల పక్షపాత పార్టీలుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ ‘రాజకీయ అధికార’ సామాజిక నేపథ్యమే ఇందుకు నిదర్శనం. 1955 నుంచి 2004 వరకు జరిగిన శాసనసభ, పార్లమెంటు (లోక్‌సభ, రాజ్యసభ) ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థుల కుల నేపథ్యం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. వాస్తవానికి భారత రాజ్యాంగం పౌరులందరికీ ‘రాజకీయ సమానత్వం’ ఇచ్చింది. దీన్ని అన్ని స్థాయిల్లో ఆచరణలో నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలపైనే ఉంది. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రధానంగా చట్టసభల్లో బలహీనవర్గాలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు వారి వారి జనాభా దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లభించకపోవడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలదే బాధ్యతగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సీఎం, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి స్పీకర్, మంత్రులు, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, పార్టీ అధినాయకులు, కేంద్రంలో, రాష్ట్రంలో నియమితులైన మంత్రుల సామాజిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే రాజకీయ సమానత్వం చట్టుబండలైన విషయం బట్టబయలు అవుతుంది.
గత అరవై సంవత్సరాల కాలంలో రాజకీయ నిర్ణయాధికారం అందరికీ సమానంగా రాలేదనేది నగ్నసత్యం. రాజకీయాధికారం సాధించిన కొన్ని అగ్రకులాలు జనాభా రీత్యా అల్ప సంఖ్యాకులైనప్పటికీ వారు తమ చేతుల్లోకి అధికారాన్ని వినియోగించుకుని త్వరితగతిన అభివృద్ధి సాధించగలిగారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థ అంతా ఆ కీలక ‘నిర్ణయాధికారం’ చుట్టూ పరివూభమిస్తున్నది. నిర్ణయాధికారం లేని కారణంగా జనాభా పరంగా 0% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, జనాభాలో సగభాగమైన మహిళలు వెనుకబాటుతనానికి, అసమానతలకు, వివక్షకు, దోపిడీకి నిరంతరం గురవుతున్నారు. ఫలితంగా ఈ వర్గాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి రాజకీయాధికార వ్యవస్థల్లో భాగస్వామ్యంలేక కేవలం ‘ఓటర్లు’గా మిగిలిపోతున్నారు. రాజకీయ నిర్ణయాధికారం కలిగిన కమ్మ, రెడ్డి కులాలకు ప్రస్తుతం కాపులు కూడా జతకలుస్తున్నారు. దీంతో మెజారిటీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు స్వయం నిర్ణయాధికారం, స్వయం ప్రతిపత్తి, రాజకీయ స్వావలంబన, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి వాటిని కోల్పోతున్నారని బడుగు వర్గాల నేతలు విమర్శిస్తున్నారు.
బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్, టీడీపీలు
ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల(బీసీ) కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించాయి. అయితే ఆచరణలో బీసీలైన బలహీనవర్గాలకు ఆయా సంక్షేమ పథకాల ఫలితాలు అందలేదు. సంక్షేమ పథకాలపై వివరీతంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వాలు ఆయా వర్గాల నుంచి గణనీయమైన ఓట్లను రాబట్టుకున్నాయి. కానీ బలహీనవర్గాల జీవితాల్లో ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో బ్యాంకుల జాతీయకరణ, సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ, ఇరవై సూత్రాల అమలు, ఆర్థిక సరళీకృత విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ వెనుకబడిన కులాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి జరగలేదన్నది జగద్విదితం. వివిధ సంక్షేమ పథకాలు అన్నీ నిద్రావస్థలో నిమగ్నమయ్యాయి. ఫలితంగా బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి బయటపడి 192లో ఎన్.టి.రామారావు ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. ఎన్టీర్ తన పార్టీని పటిష్టపరుచుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఓట్ల రాజకీయాల్లో బీసీలు అన్ని పార్టీలకు అవసరమైనప్పటికీ వాస్తవంగా బీసీ జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా లభించలేదు. బీసీల సంక్షేమమే పరమావధిగా ప్రకటించిన టీడీపీ.. అధికార పంపిణీ విషయంలో బీసీలకు మొండిచెయ్యి చూపింది. అందుకే మెజారీటీ బీసీలు టీడీపీకి ప్రత్యామ్నాయంగా మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఓట్ల రాజకీయాలు, అగ్రకులాల ఎత్తుగడల మధ్య బీసీ ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాలు, అధికారమార్పిడితో సమిధలుగా మారి రాజ్యాధికారానికి దూరమయ్యారు.
టిక్కెట్ల కేటాయింపుల స్థాయిలోనే దగా!
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎన్నికల్లో కేటాయించే టికెట్లలో అగ్రతాంబూలం అగ్రకులాలకే దక్కుతున్నదన్నది వాస్తవం. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు మినహా దాదాపు 90 శాతం సీట్లు అగ్రకులాలకే ఇస్తున్నాయి. వాటిల్లో కాంగ్రెస్ సహజంగానే తన ఆధిపత్య కులమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే.. టీడీపీ తన ఆధిపత్య కులమైన కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది. పేరుకు బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ మాటలు చెబుతున్న ఈ రెండు పార్టీలూ తమ తమ సామాజిక వర్గాలకే పదవులు పొందే అవకాశం ఇస్తున్నాయి. పార్టీలు టికెట్ ఇస్తే తప్ప ఎన్నికల్లో పోటీచ చేయలేని ఆర్థిక పరిస్థితులు బీసీలకు మరో ఆటంకం. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశమున్నా బీసీల వద్ద తగినన్ని ఆర్థిక వనరులు, నియోజకవర్గమంతా ఒంటరిగా తిరిగి వ్యక్తిగతంగా ప్రచారం, బలసమీకరణ, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విధాన ప్రకటనలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశాలు కలుగుతున్నాయి.
నైజాం స్టేట్ విలీనం తర్వాత
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు 1956లో అంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1962 ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైంది. 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు, ఆంధ్రవూపాంత ప్రజా ప్రతినిధులతో కలిసి ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ ఏర్పాటైంది. మళ్ళీ ఆతర్వాత 1962లో ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ఒకేసారి సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. 1955లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ద్విసభ్య నియోజకవర్గాలున్నాయి. ఆయా స్థానాల్లో జనరల్ అభ్యర్థితో పాటు అదే నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా ఎన్నుకునే అవకాశం ఉండేది. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ద్విసభ్య 23 అభ్యర్థులు, తెలంగాణ ప్రాంతంలో ద్విసభ్య 21 మంది అభ్యర్థులు కలిపి మొత్తంగా 44 ద్విసభ్య నియోజకవర్గాల నుంచి ఒక సాధారణ అభ్యర్థితో పాటు ఒక ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్ధి గెలిచే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా రూపొందించి 54 శాసనసభ స్థానాలను షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ)లకు రిజర్వు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలకు 10 స్థానాలు అదనంగా పెరిగినప్పటికీ వారికి కొన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంతకు ముందు వరకు ఎస్సీ, ఎస్టీల్లో జిల్లాకు కనీసం ఒక్కరిద్దరికైనా ప్రాతినిధ్యం దక్కేది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో దీనికి గండిపడినట్లయ్యింది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల ఏర్పాటులో స్థానాల గుర్తింపు వల్ల శాసనసభ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగి జిల్లా స్థాయిలో సంఖ్యాపరంగా భిన్నత్వం గోచరిస్తున్నది. మరోసారి నియోజకవర్గాల పునర్విభజన తదుపరి 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాలో న్యాయం జరగలేదనే అభివూపాయం ఇప్పటికీ వ్యక్తం అవుతున్నది. దీంతో అధికార వ్యవస్థలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర పరిమితంగానే ఉంటోంది.
Take By: T News Read more...
Tuesday, January 24, 2012
మన తురుంఖన్ తుర్రేబాజ్‌ఖాన్
- సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ధీశాలి
- నేడు తుర్రేబాజ్‌ఖాన్ వర్ధంతి
ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ రోజులవి! బ్రిటిష్ సర్కారును గడగడలాడించిన సిపాయిల తిరుగుబాటుకాలమది! సిపాయిల తిరుగుబాటంటే ఢిల్లీ, లక్నో, అవధ్, కాన్పూర్, గ్వాలియర్, ఝాన్సీ.. సాధారణంగా కళ్లముందు కదలాడే దృశ్యాలివే! కానీ.. మహత్తరమైన ఆ పోరాటంలో హైదరాబాద్‌కూ ప్రత్యేక స్థానాన్ని కల్పించిపెట్టాడు తుర్రేబాజ్ ఖాన్! ప్రస్తుత కోఠి ప్రాంతంలో ఉన్న నాటి బ్రిటిష్ కోటపై దండెత్తి.. హైదరాబాద్ సత్తా చాటిన యోధుడు! ఆ వీరుడి వర్ధంతి నేడు!
బానిస బంధనాల నుంచి మాతృభూమిని విముక్తం చేయాలన్న ఆకాంక్ష! వలస పాలనపై ఆనాడే పేలిన తూటా! శత్రువు అపారసైనిక పాటవాన్ని కలిగి ఉన్న శక్తి! కొండను ఢీకొనడమేనన్న సంగతి తెలుసు! కానీ.. పరాయి పాలకులను తరిమికొట్టడమే లక్ష్యం! ఆ లక్ష్యం కోసం ఉద్యమించాడు పఠాన్ తుర్రేబాజ్‌ఖాన్! శత్రువుతో పోరాటంలో మరణం అనివార్యమని తెలిసినా.. అరివీరభయంకరుడై సమరాంగణంలోకి దూకాడు! బ్రిటిష్ రెసిడెన్సీపైకి తన అనుచరగణాన్ని ఉరకపూత్తించిన తుర్రేబాజ్‌ఖాన్.. తూప్రాన్ ప్రాంతంలో శత్రువుతో పోరాటంలో బలయ్యాడు!
పఠాన్ తుర్రేబాజ్‌ఖాన్.. పరాక్షికమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి నాయకుడు. ఔరంగాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్‌లో జమేదారు. అప్పటికే బ్రిటిష్ పాలకుల దోపిడీని సహించలేని స్థితికి ప్రజలు చేరుకున్నారు. వివిధ కారణాలతో సిపాయిల్లో సైతం అసంతృప్తి ప్రజ్వరిల్లింది. 1957వ సంవత్సరం వచ్చే సరికి బ్రిటిష్ పాలకులపై దేశవ్యాప్తంగా సిపాయిల్లో తిరుగుబాటు తలెత్తింది. కనీస సమాచార సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే పకబ్బందీ ప్రణాళికతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. యవతీయువకులతో పాటు స్వదేశీ పాలకులు సైతం తెల్లవాడి పాలనపై నిప్పులు కక్కుతున్న రోజులవి. ఆ సమయంలో బానిసత్వం నుంచి విముక్తికి పోరాడేలా తుర్రేబాజ్‌ఖాన్‌కు స్ఫూర్తినిచ్చాడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్!
ఆ ధార్మిక పెద్దల ప్రభావంతో ఫిరంగీలను హతమార్చాలంటూ హైదరాబాద్ నగర గోడలపై ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఆ ప్రకటనలు పెద్ద స్ఫూర్తినే రాజేశాయి. అప్పటికి హైదరాబాద్‌లో నైజాం సంస్థానం కొనసాగుతోంది. ఆ సంస్థానంలోని కొందరు బ్రిటిష్ అధికారులను కొందర సైనికులు హతమార్చారు. ఈ విషయంలో మాట్లాడేందుకు వెళ్లిన రొహిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ అధికారులకు అప్పగించడం సైనికుల్లో మరింత ఆగ్రహం రాజేసింది. వారిని ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయించాలని తిరుగుబాటుదారులు అందరూ నిర్ణయించుకున్నారు. మక్కామసీదులో సమావేశమయ్యారు. మౌల్వీల పిలుపుతో తుర్రేబాజ్‌ఖాన్ హైదరాబాద్ రెసిడెన్సీపై దాడికి ఆ రోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరాడు. మెరికల్లాంటి తన అనుచరులు 500 మందితో కలిసి విరుచుకుపడ్డాడు.
బ్రిటిష్ రెసిడెంట్ కర్నల్ కుత్‌బెర్ట్ డేవిడ్‌సన్ నివాసంపైకి సమీప రెండు ఇళ్లపై నుంచి ఖాన్ అనుచరులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పులు జరిపారు. అక్కడి నుంచి గోడలు బద్దలు కొట్టుకుని ముందుకు ఉరికారు. ఒకవైపు తమ సహచరులు కాల్పులు జరుపుతుండగా.. వారి రక్షణతో పుత్లిబౌలి వద్దకు చేరుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారే దాకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పొద్దున చూసే సరికి ఆ ప్రాంతంలో అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ భీకర పోరులో తుర్రేబాజ్‌ఖాన్ అనుచరులు కూడా కొందరు చనిపోయారు. అయితే చెరలో ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వారు విడిపించలేక పోయారు. ఈ విఫలయత్నంలో తప్పించున్న ఖాన్.. జూలై 22న బ్రిటిష్, నిజాం బలగాలకు పట్టుబడ్డాడు.
ఆయనకు ద్వీపాంతరవాస శిక్ష పడింది. ఆ శిక్ష అమలయ్యేలోగా 1859 జనవరి 18న జైలు నుంచి తప్పించుకున్నాడు. అప్పటికే సిపాయి తిరుగుబాటను బ్రిటిష్ ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. మళ్లీ తిరుగుబాటుకు తుర్రేబాజ్ సమాయత్తమయ్యాడని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన తలకు నజరానా ప్రకటించింది. అయినా ఆయన దొరకలేదు. కానీ.. కుర్‌బాన్ అలీ అనే నమ్మకవూదోహి చేసిన మోసానికి ఆయన ఆచూకీ బ్రిటిష్ సేనలకు తెలిసిపోయింది. తూప్రాన్‌లో తుర్రేబాజ్‌ఖాన్ ఉన్నాడన్న సమాచారంతో ఆ గ్రామంపైకి 1959 జనవరి 24న బలగాలు దండెత్తాయి. విజయమో వీరస్వర్గమో తేల్చుకునే పోరాటంలో చివరకు తుర్రేబాజ్‌ఖాన్ ఒంటరిగా మిగిలాడు.
చుట్టుముట్టిన సేనల నుంచి తప్పించుకోలేక పోయాడు. అయినా శత్రువు కళ్లుగప్పి తప్పించుకునే ప్రయత్నంలో బ్రిటిష్‌తూటాలకు ఒరిగిపోయాడు. ఆయన మృతదేహాన్ని సంకెళ్లతో కట్టి తెచ్చిన తెల్లవాడు.. నేటి కోటీ ప్రాంతంలో ఒక స్తంభానికి వేలాడగట్టారు. ఈ భయంకరమైన చావును చూసి, మరెవరూ బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఉద్యమించరని పాలకులు కలగన్నారు. కానీ.. తుర్రేబాజ్‌ఖాన్ స్ఫూర్తి అనంతర కాలంలో స్వాతంత్య్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చింది. బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడేందుకు దోహదం చేసింది. మౌల్వీ అల్లావుద్దీన్ మంగళంపల్లి వద్ద బ్రిటిష్ సేనలకు పట్టుబడ్డారు. ఆయనకు 1884లో ప్రవాస శిక్ష పడింది. తుర్రేబాజ్‌ఖాన్ వీరోచిత పోరాటానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం 1957లో కోటీ ప్రాంతంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది.
కొత్త నియామకాలలో కాంట్రాక్ట్ కార్మికులకు అవకాశం ఇవ్వాలి: అసదుద్దీన్ ఒవైసీ
టెట్ రద్దు కోసం ఐక్య ఉద్యమాలు
నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని యువజన, విద్యార్థి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. టెట్ రద్దు, ఎస్జీటీలో బీఈడీ అభ్యర్థులకు అనుమతి, వయోపరిమితి వంటి అంశాలపై ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించాయి. ఈ నెల 31న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నాయి. సోమవారం ఏఐవైఎఫ్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేఎల్ గౌతంకుమార్, రాములు యాదవ్, ఎన్ లెనిన్‌బాబు, భాస్కర్, ఎం హన్మేశ్ పాల్గొన్నారు.
Take By: T News
తెలంగాణ నిరుద్యోగకి ఆంద్రా సర్కార్ దగా!
- హత్యాయత్నం కేసులు సహా కొందరిపై పదుల సంఖ్యలో..
- పిడమర్తి రవిపై 151 కేసులు
- ముందుకొచ్చిన 1.16 లక్షల ఉద్యోగాలు
- కేసులున్న ఉద్యోగార్థులకు మొండి చెయ్యే
- చురుకైనవారికీ దక్కని పోస్టులు!
- కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ తాత్సారం
- మరో రెండేళ్లు పట్టే అవకాశం
- ఈలోగా జోరుగా నోటిఫికేషన్‌లు
- హడావిడిగా పరీక్షలకు ఏర్పాట్లు
- పట్టించుకోని టీ ప్రజా ప్రతినిధులు
- ఉద్యోగాలను సీమాంవూధకు తరలించే కుట్ర
- కేసులు ఎత్తేసేదాకా పోరాడుతాం
- తేల్చిచెబుతున్న తెలంగాణ విద్యార్థిలోకం
కళ్లముందు ఆశగా కనిపిస్తున్న లక్షాపదహారువేల ఉద్యోగాలు! వాటిని అందుకునేందుకు పోటీ పడినా.. అడ్డుకుంటున్న కేసులు! ఎత్తివేతకు హామీ ఇచ్చిన కేంద్రం.. ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంది! కేంద్రం ఆదేశాలను పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది! ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రాంత నేతలు.. ఇది తమకు సంబంధించిన విషయం కాదని దులిపేసుకుంటున్నారు! తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ హోం శాఖను నిర్వహిస్తున్నా.. జరిగిన న్యాయం లేదు! నిలదీయాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మనకెందుకుకొచ్చిన వ్యవహారమన్నట్లు చూసీ చూడకుండా పోతున్నారు! మధ్యలో టీ ఎంపీలు కేసుల ఎత్తివేత కోసం నిరసన దీక్షలకు దిగినా..
అది ఉత్తుత్తి దీక్షగా మిగిలిపోయింది! ఉద్యమ శక్తులు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు! చూస్తాం.. చేస్తాం.. ఎత్తేస్తాం.. అన్న మాటలే తప్పించి.. కేసుల ఎత్తివేత ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి! వెరసి.. తెలంగాణ నిరుద్యోగి మరోసారి దగా పడుతున్నాడు! యూనివర్సిటీ దాటుకుని.. ఉపాధి వేటలో పడుతున్న విద్యార్థి.. దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నాడు! 2009 పరిణామాలు మొదలుకుని.. తాజాగా సకల జనుల సమ్మె వరకూ వివిధ సందర్భాల్లో పెట్టిన కేసులు కలవర పెడుతుండగా దాదాపు 9వేల మంది రానున్న 1.16 లక్షల ఉద్యోగాలకు అనర్హులుగా మిగులుతున్నారు! అటు ఉద్యమాన్ని నీరుగార్చడానికి విద్యార్థులపై పుంఖానుపుంఖాలుగా కేసులు తెరిచిన ప్రభుత్వం..
ఇప్పుడు తెలంగాణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగుల నోట్లో మట్టికొ సిద్ధమవుతోంది! ఇన్నాళ్లూ జరిగిన మోసాలను భరించి, ఇక భరించలేక తెగించి కొట్లాడే తత్వాన్ని అలవర్చుకున్న విద్యార్థులు.. తక్షణ సమస్యగా ముందుకొచ్చిన కేసుల ఎత్తివేతపై మరో సమరశీల పోరాటానికి సిద్ధపడుతున్నారు! ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రలపై సమరభేరీ మోగిస్తున్నారు!
హైదరాబాద్, జనవరి 23 (టీ న్యూస్): తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర సర్కార్ మరో ద్రోహం తలపెడుతోందా? లక్షా పదహారువేల ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతూ ఉద్యమాన్ని పలుచన చేయడానికి పావులు కదిపిన ప్రభుత్వం.. అవే ఉద్యోగాలను తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కకుండా కుట్ర చేసిందా? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. వాటిని ఎత్తేయడంలో ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందా? కేసుల సంగతి తేల్చకుండానే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ముగించేసేందుకు హడావిడి పడుతోందా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరించి, దగ్గరపెట్టుకోవడం గమనిస్తే..
కేసులు లేని విద్యార్థుల భవిష్యత్తుతో సైతం ప్రభుత్వం ఆటలాడుకునేందుకు సమాయత్తమవుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని విద్యార్థి నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారని, మరోసారి తెలంగాణకు అన్యాయం చేసేందుకు సర్కారు సిద్ధమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం వారి ఆటలు కొనసాగనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.
దశాబ్దాల ఆరాటమైన తెలంగాణ కోసం జరుగుతున్న మలిదశ పోరాటంలో విద్యార్థులు అగ్రభాగాన ఉన్న విషయం తెలిసిందే. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చటానికి విద్యార్థులు పోలీసుల లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి పోరాటాలు చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వేర్వేరు రూపాల్లో నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకులు విద్యార్థులపై కక్షగట్టారని ఉద్యమక్షిశేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాకుండా చేయటానికి శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని చాపకింది నీరులా అమలు చేస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నవారిపై పోలీసులతో విచ్చలవిడిగా కేసులు నమోదు చేయించారని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఉద్యమంలో ముందుంటున్న ఒక్కో విద్యార్థిపై పది నుంచి ఇరవై వరకు కేసులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
తీవ్రమైనవిగా పరిగణించే రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌తోపాటు ఐపీసీ 324, 332, 333, 149, 353, 149, 120(బీ), 147, 148 రెడ్‌విత్ 149, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం చేశారన్న నేరారోపణలపై 307 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారని వివరిస్తున్నారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో దాదాపు 9 వేల మంది విద్యార్థులపై కేసులు ఉన్నాయని అంచనా. వీటిని అడ్డం పెట్టుకుని పోలీసులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేయటం, బెయిల్ మీద బయటకు రాగానే మరో కేసులో అరెస్టు చూపించి మళ్లీ జైలుకు పంపించటం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని లక్ష్యం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు భాగం కాకుండా చేయాలన్నదేనన్నది సుస్పష్టమని వారు పేర్కొంటున్నారు.
ఇచ్చిన మాట బుట్టలోకి
‘డిసెంబర్ 9 ప్రకటన’ చేసిన రోజునే అప్పటి వరకూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చారు. కానీ మళ్లీ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగింది. ఇదే అంశంలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసనతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు మరోసారి హామీ ఇచ్చింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు కూడా పంపింది. అయితే, ఇక్కడి సీమాంధ్ర పాలకులు మాత్రం ఈ దిశలో అవసరమైనంత వేగంగా చర్యలు తీసుకోవటం లేదు. ఈ విషయమై పోలీసుశాఖలోని సీనియర్ అధికారులతో మాట్లాడితే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినట్టుగానే కేసుల ఎత్తివేత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని కేసులను ఇప్పటికే ఎత్తివేశామని, మిగతావాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు మాత్రం అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావటం లేదు. చట్ట ప్రకారం జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఏడాది.. రెండేళ్లు పట్టొచ్చు..అంతకన్నా ఎక్కువ సమయం కావచ్చని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి కావాలనే ఇలా చేస్తున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా చేయాలన్నదే దీని వెనక లక్ష్యమని ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారాలో ఉద్యోగాల భర్తీకి పరీక్షలను ప్రభుత్వం జరిపిస్తుండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
ఉత్తీర్ణత సాధించినా...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు హాజరై ఉత్తీర్ణత సాధించినా వారికి కొలువులు దక్కే పరిస్థితి లేదు. దీనికి కారణం వారిపై కేసులను ఎత్తివేయకపోవటమే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఎవరైనా ఉత్తీర్ణత సాధిస్తే వారిపై పోలీసులతో ఎంక్వయిరీ జరిపిస్తారు. అందలో వారిపై ఎలాంటి పోలీసు కేసులు లేవని నిర్థారణ అయితేనే ఉద్యోగం ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. నమోదైన కేసుల నుంచి వాళ్లు నిర్దోషులుగా బయటపడితేనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులే పేర్కొంటున్నారు. కేసుల ఎత్తివేత ప్రక్రియను పరిశీలిస్తే ఇప్పట్లో అది పూర్తయ్యేలా కనిపించటం లేదు. ఫలితంగా తెలంగాణకు చెందిన దాదాపు 9 వేలమంది విద్యార్థులు సమర్థత ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
కేసులు లేనివారిని సైతం...
కేసులు ఎదుర్కొంటున్నవారి పరిస్థితి ఇలా ఉంటే కేసులు లేనివారిని సైతం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారమే తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న వేలాదిమంది విద్యార్థుల వివరాలను ప్రభుత్వం ఇంటెలిజెన్స్, స్పెషల్‌వూబాంచ్ విభాగాల సిబ్బందితో సేకరించి పెట్టుకుంది. వీరిలో మరింత క్రియాశీలకంగా ఉన్నవారిని పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తోంది. 2008లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2011లో నిర్వహించిన ఎసై్స రాతపరీక్షల్లో ఉస్మానియా వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులకు ఇదే అనుభవం ఎదురైంది. ఉద్యమం కారణంగా తాము పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం కాలేదని, కొంత గడువు ఇచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులు పలువురు అప్పట్లో డిమాండ్ చేశారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు ఇదే డిమాండ్‌తో సీఎం, హోంమంత్రి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌తోపాటు పలువురిని కలిసి వినతిపవూతాలు సమర్పించారు.
వీరి విజ్ఞప్తులను పట్టించుకోని ప్రభుత్వం పోలీసుల ద్వారా వారి వివరాలను మాత్రం సేకరించింది. ఆ తరువాత జరిగిన ఎసై్స రాతపరీక్షలకు వీళ్లంతా హాజరయ్యారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోవటం గమనార్హం. మార్కుల షీట్ల కోసం అడిగితే మీరంతా డిస్‌క్వాలిఫై అయ్యారన్న సమాధానమే అధికారుల నుంచి వచ్చింది. ఇలా చెబుతూపోతే మరిన్ని ఉదంతాలున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపైనే తెలంగాణవాదులు మండిపడుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగాల ప్రకటనతో...
ఒకవైపు తెలంగాణ ఉద్యమం నుంచి విద్యార్థులను దూరం చేయటానికి వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. నిన్నమొన్నటి దాకా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి లేదంటూ చెప్పుకొచ్చిన పాలకులు తాజాగా వేర్వేరు శాఖల్లో 1.16లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. సాధారణంగా కేసులు ఉంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలకు అనర్హులవుతారు. ఇదే ఆలోచించిన ప్రభుత్వం.. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామంటూనే జాప్యం చేస్తూ.. మరోవైపు ఉద్యోగాల భర్తీకి మాత్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
- మరోసారి ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు
రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థులపై కేసులు ఎత్తేయకపోవటం దారుణం. విద్యార్థులు మళ్లీ ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తి వేయకుండా శాశ్వతంగా ఉద్యోగాలకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. విద్యార్థులపై అక్రమంగా బనాయించిన కేసులు ఇప్పటివరకు ఎత్తేయకపోవటం పట్ల ఉద్యోగాల భర్తీలో సీమాంవూధులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా కుట్ర చేస్తున్నది. అన్నం పెడతాం రమ్మంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి తలుపులు మూసివేసినట్లుగా ఉంది. విద్యార్థులపై పెట్టిన కేసులు భేషరతుగా వెంటనే ఎత్తివేయాలి.
అన్నా టీంపై పెట్టని కేసులు ఇక్కడెందుకు?
అవినీతిపై పోరాడుతున్న అన్నా బృందంపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు దానిని ఒక సామాజిక ఉద్యమంగా పరిగణించే కేసులు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమమూ సామాజిక ఉద్యమమే. అలాంటప్పుడు తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎందుకు పెట్టారు? ప్రభుత్వం ఉద్యోగాలిచ్చే ఆలోచనతో ఉంటే వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి. విద్యార్థులు ప్రజల ఆకాంక్ష కోసం ఉద్య మించారు. అక్రమ కేసుల కారణంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు వీసాలు లభించటం లేదు. వెంటనే కేసులు ఎత్తివేసి వారికి న్యాయం చేయాలి.
వివక్షకు ఇంతకన్నా
నిదర్శనం ఏం కావాలి?
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా వివక్ష ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీలో ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకుండా కుట్రలు చేస్తోంది. దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. కేసులు వెంటనే ఎత్తివేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఉద్యమాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ కుట్ర
తెలంగాణ విద్యార్థులు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదిక 8వ అధ్యాయంలో ఉద్యమాన్ని అణివేత నిర్వహణకు సూచించిన అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందులో భాగంగానే లక్ష ఉద్యోగాలు ఆశ చూపి విద్యార్థులు ఉద్యమాల వైపు చూడకుండా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాపార భాగస్వామ్య సదస్సులో ప్రైవేటు రంగంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కూడా సీమాంధ్ర కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఉద్యోగాలు సీమాంధ్ర విద్యార్థులకే లభిస్తాయి. తెలంగాణ వారికి మిగిలింది ప్రభుత్వ ఉద్యోగాలు మత్రమే. ఆ ఉద్యోగాలు కూడా దక్కకుండా విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా భవిష్యత్తులో ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావని విద్యార్థులను భయవూభాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ దీక్ష సమయంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని ప్రకటించి మూడేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేసులు ఎత్తి వేయటం లేదు.
ఉద్యోగాలతో లింకుపెట్టవద్దు
విద్యార్థులు కేవలం వారి వ్యక్తిగత అవసరాలకు చేసిన ఉద్యమం కాదు. తెలంగాణ ప్రజావూపయోజనాల కోసం వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించింది. ఇది చాలా దారుణం. వెంటనే వారిపై పెట్టిన కేసులు భేషరతుగా ఎత్తివేయాలి. ఉద్యమాల నుంచి విద్యార్థులు ఉద్యగాల వేటలో పడ్డారు. ఉద్యమ కేసులకు ఉద్యోగాలకు లింకుపెట్టవద్దు. కేసులు ఎత్తివేసి తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమన్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Sunday, January 22, 2012
Protest brewing in Kovvada a la Kudankulam
13 policemen killed in ambush, Maoists loot anti-mine van
High security registration plates for new vehicles by April: official
Take By: The Hindu News
చేనేత రుణమాఫీకి వడ్డీల మోత!
-మాఫీ ప్రకటించి రెండేళ్లయినా
- పూర్తి నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- రూ.312 కోట్లలో విడుదలైంది 114 కోట్లే
- వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అంటున్న బ్యాంకులు
హైదరాబాద్, జనవరి 21( ): పాత రుణాలు మాఫీ కావు.. కొత్త రుణాలు అందవు.. వడ్డీల మోతతో బ్యాంకుల హుకూం.. సర్కారు నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులివి. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తున్నామని 2009లో ప్రకటించిన ప్రభుత్వం రెండేళ్లయినా ఆ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. మూడో వంతు నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇదిలాఉండగా ప్రభుత్వం విడుదల చేసే అసలు సొమ్ముతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తేనే రుణాల్ని మాఫీ చేస్తామంటూ బ్యాంకులు నిబంధన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు అంద దీంతో సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
గొప్పగా ప్రకటించి..
చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం 2009లో ప్రకటించింది. ఈ మేరకు 2008, మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సహకార సంఘాలు, ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు, పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న రుణాలను (239 కోట్ల రూపాయలను) వడ్డీ కలిపి (రూ.312 కోట్లు) మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో సుమారు రెండు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం కలిగింది. అయితే రుణ మాఫీని అమలు చేయడంలో సర్కారు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 2009-10 బడ్జెట్‌లో రూ.312 కోట్లను కేటాయించినా నిధులను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో నిధులను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పింది.
తీరా రూ.109 కోట్లను మాత్రం విడుదల చేసింది. 2010, మార్చి నాటికే విడుదల చేయాల్సిన ఈ నిధులు 2011, ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఈ జాప్యాన్ని పట్టించుకోని బ్యాంకులు 2010, ఏప్రిల్ నుంచి వడ్డీ కట్టాలని తేల్చిచెప్పాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రుణమాఫీకి రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మొత్తం రూ.312 కోట్ల రుణమాఫీ నిధుల్లో ఇప్పటివరకు రూ.114 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా నిధుల్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసినా చేనేత బడ్జెట్‌లో పదో వంతు నిధులు కూడా విడుదల చేయకపోవడం చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఇప్పటికే 20 నెలలకు చేరిన వడ్డీ భారం
2010, ఏప్రిల్‌లో విడుదల చేసిన రూ.109 కోట్ల రుణమాఫీ నిధులకు సంబంధించి లబ్ధిదారులు 20 నెలల వడ్డీ చెల్లించాల్సి ఉంది. మిగతా రుణ నిధులు ఎప్పుడు విడుదలవుతాయో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ఒకవేళ ఈ నిధులు త్వరలోనే విడుదలైనా వడ్డీ భారం తడిసిమోపెడు కానుంది. అసలు కంటే వడ్డీ భారం అధికమయ్యే ప్రమాదమూ లేకపోలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పాత రుణాలు మాఫీ కాక ఇటు కొత్త రుణాలు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Take By: T News
ఏప్రిల్‌లో సెట్.. మార్చిలో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 21(): డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పరీక్ష సెట్‌ను ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఈ పరీక్షను స్లెట్‌గా పరిగణించినప్పటికీ ప్రస్తుతం దాన్ని సెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. సెట్ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది.
మార్చిలో సెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహించి మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలోగా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ యూజీసీ అక్రిడేషన్ పొందాల్సి ఉంది. సెట్ పరీక్ష ఏర్పాట్లపై యూజీసీ కమిటీ తనిఖీ చేసి సెట్ పరీక్షకు గుర్తింపు ఇస్తుంది. యూజీసీ గుర్తింపు ప్రక్రియ ఫిబ్రవరికల్లా పూర్తయినా మార్చిలో నోటిఫికేషన్ వెల్లడించేందుకు సెట్ నిర్వహణా కమిటీ చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తోంది.
Take By: T News
తెలంగాణ విద్యార్థిపై కేసుల ఉచ్చు
- కేసుల ఎత్తివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ
- ఇంతవరకూ ఎత్తేసింది లేదన్న విద్యార్థులు
- ఇది ‘శ్రీకృష్ణ’ చీకటి అధ్యాయం అమలే!
హైదరాబాద్, జనవరి 21 () నిరసన కొత్త కాదు. ఆందోళన పాతదే. ఉద్యమాలూ ఈనాటివి కాదు! విద్యార్థులో, కష్టజీవులో, అన్యాయానికి గురైనవారో, దుర్మార్గాలపై కడుపు మండినవారో గతంలో ఏదైనా ఆందోళనకు దిగితే.. ఉద్యమం చేపడితే పరిస్థితి చేయిదాటినా.. అలాంటి పరిస్థితి ఉన్నా అదుపులోకి తీసుకోవడం పరిపాటి! వారిని సాయంత్రం దాకా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి.. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టడం మామూలే! కొన్ని మినహాయింపులు ఉన్నా.. అత్యంత తీవ్రమైన అభియోగాలు నమో దు చేసిన ఉదంతాలు కొన్నే! కానీ.. తెలంగాణ విద్యార్థి విషయంలో మాత్రం పక్షపాతం! కుట్ర! విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా.. ఒకరిమీదో వంద మంది మీదో కాదు.. సుమారు 9వేల మందిపై! విద్యార్థులపై మునుపెన్నడూ నమోదు చేయని సెక్షన్లు..! ప్రదర్శనలో పాల్గొన్నందుకు.. దిష్టిబొమ్మ దహనం చేసినందుకు.. కోపంతో ఓ రాయి విసిరినందుకు! ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా! తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా! ఒక కేసులో అరెస్టయి బయటికి వస్తే.. మరో కేసులో అరెస్టు చేసి జైలుకు పంపేంత స్థాయిలో! ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టేంత గుడ్డిగా..! ఇదీ సీమాంధ్ర పాలకులు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిపై చూపుతున్న వివక్ష! అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకూ ఒక్కరిపైనా కేసులు ఎత్తేయని వైనం!: తెలంగాణ కో సం జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణ కమిటీలోని చీకటి అధ్యాయాన్ని సీమాంధ్ర పాలకులు అమలు చేస్తున్నారా? పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసు ఉన్నతాధికారులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారా? ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వారిపై మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టడం ఉద్దేశపూర్వకమేనా? కేసుల పేరుతో ఇప్పటికీ విద్యార్థులను మానసికహింసకు గురి చేస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామన్న హామీని నెరవేర్చకుండానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా పరీక్షలు జరపటానికి సన్నాహాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
వేర్వేరు డిమాండ్లపై రాజకీయపార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు ఉద్యమాలు చేయటం కొత్తేమీ కాదు. ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఊరేగింపులు, దిగ్బంధనాల ద్వారా డిమాండ్ల సాధనకు వేర్వేరు వర్గాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పరిస్థితులు అదుపుతప్పి శాంతిభవూదతల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. లాఠీచార్జీలు, కాల్పులు, బాష్పవాయువు గోళాల ప్రయోగాలు జరిగాయి. అయినా ఉద్యమకారులపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు పెట్టిన దాఖలాలు వేళ్ల మీద లెక్కబె సంఖ్యలో కూడా లేవని పరిశీలకులు అంటున్నారు. మహా అయితే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవటం.. వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించటం, చీకటి పడేవరకు పోలీస్‌స్టేషన్లలోనే ఉంచి, ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేయటం ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్నది. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగినపుడు మాత్రమే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కేసులు పెట్టేవారు. ఈ కేసులు కూడా ఆయా నిరసనలను ముందుండి నిర్వహించినవారిపైనే ఉండేవి.
తెలంగాణ విద్యార్థులపై కుప్పలకొద్దీ సెక్షన్‌లు
ఉద్యమంలో భాగంగా శాంతియుతంగా ప్రదర్శనలు జరిపినా, ఊరేగింపులు నిర్వహించినా, ధర్నాలు చేసినా మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులపై పోలీసులు వందలాది కేసులు నమోదు చేశారు. ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. పోలీసుల ఈ అణచివేత వైఖరికి పరాకాష్ట ఏమిటంటే ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టటం. ఎస్‌సీ, ఎస్‌టీలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయటానికి అవకాశం లేదని తెలిసి కూడా ఈ కేసులు పెట్టారం ప్రభుత్వం, పోలీసుల కుట్రను అర్థం చేసుకోవచ్చని ఉద్యమనేతలు అంటున్నారు.
జైళ్లలో మగ్గేలా చేస్తూ...
అడ్డగోలుగా విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీటిని అడ్డం పెట్టుకుని విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విచారణ పేరిట పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరిని అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. బెయిల్‌పై విడుదల కాగానే ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేసి కారాగారాల్లోనే మగ్గేలా చేస్తున్నారు. ఇలా విద్యార్థులపై విచ్చలవిడిగా నమోదు చేసిన కేసులపై తెలంగాణ మొత్తం భగ్గుమంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఢిల్లీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇక్కడ నిరాహారదీక్షలు చేశారు. దాంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులపై నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాయి. హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి దశలవారీగా రెండు నెలల్లోనే ఈ ప్రక్రియను ముగిస్తామని స్వయంగా ప్రకటించారు.
అయితే, నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చటం లేదు. ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడగా కేసుల ఎత్తివేత దశలవారీగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి ఎంత సమయం పట్టవచ్చని అడిగితే ఏడాది పట్టొచ్చు... రెండేళ్లు పట్టొచ్చు అని సమాధానం ఇస్తున్నారు.
కేసులను అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యోగాలను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల వల్ల విద్యార్థులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఏ ఉద్యోగాలకైనా దరఖాస్తు చేయొచ్చు. పరీక్షలనైనా రాయవచ్చు. కానీ ఉద్యోగాల నియామకం సమయంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆడిగి, కేసుల పేరుతో నిరాకరించే ఆలోచనలో సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని రకాల కేసులను ఎత్తివేయాల్సిందే.
- గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ కో కన్వీనర్
Take By: T News
Friday, January 20, 2012
UK's first course in women, Islam and the media launched
పోలీస్ శాఖలో 820 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 19 (): పోలీస్ శాఖలోని వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి గురువారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ సీటీ ఎస్సై పోస్టులు 38, వేలిమువూదల విభాగంలో ఎస్8సీటీ ఎస్సై పోస్టులు 17, పోలీస్8 ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ ఏఎస్సై పోస్టులు 29 భర్తీ కానున్నాయి.
అదేవిధంగా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్8సీటీ కానిస్టేబుల్ పోస్టులు 516, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులు 32, ఎస్8సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు 188 భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.apstatepolice.org వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ మాలకొండయ్య తెలిపారు.
Take By: T News
నెరవేరిన చిరు కోరిక
- కేబినెట్‌లో ‘పీఆర్పీ’.. రాష్ట్ర మంత్రులుగా సీఆర్, గంటా
- ప్రమాణం చేయించిన గవర్నర్
- కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కేబినెట్‌లోకి..
- ఐదు నిమిషాల్లో ముగిసిన తంతు
- హాజరుకాని విపక్ష నేతలు
- అధిష్ఠానం దూతగా కేబీ కృష్ణమూర్తి
- శాఖల కేటాయింపులపై తర్జన భర్జన
హైదరాబాద్, జనవరి 19 (): ఎట్టకేలకు చిరంజీవి ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర కొత్త మంత్రులుగా ‘ప్రజారాజ్యం’ తరపున సీ రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలుత రామచంద్రయ్య, అనంతరం శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39కి చేరింది. ఉదయం 11.43కు మొదలైన కార్యక్రమం 11.48 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పలువురు మంత్రులు, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు కేవీపీ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది, డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. విపక్షనేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరవలేదు.
కాగా.. ప్రమాణస్వీకారం ముగిసిందో లేదో కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి పదవులు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ది చేయాలంటే నిధుల కేటాయింపులో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పదవుల ఆశతో ఉద్యమాన్ని నీరుగార్చిన టీ కాంగ్రెస్ నేతలపై ఆ ప్రాంత ఎంపీలు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణవారికి చోటు దక్కపోవడం.. ఈ ప్రాంత నేతలకు చెంపపెట్టులాంటిదని దుయ్యబట్టారు.
వారికి తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా పదవుల చుట్టూ తిరగకుండా ఉద్యమాన్ని నీరుగార్చొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పదవులు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు, గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయిన అనంతరం ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏర్పడిన లోటును త్వరలోనే సర్దుబాటు చేస్తామన్నారు. విస్తరణ జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు సీఎం కిరణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు..
Take By: T News
రాజీవ్ విద్యామిషన్ పోస్టుల భర్తీ..
-ప్రభుత్వానికి ట్రిబ్యునల్ నోటీసులు
-నాలుగు వారాల్లో వివరణకు ఆదేశం
హైదరాబాద్, జనవరి 19 (): రాజీవ్ విద్యామిషన్‌కు సంబంధించిన పోస్టుల భర్తీలో మాధ్యమిక విద్యాశాఖ జారీచేసిన జీవో నెం 7పై రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో నెంబర్ 7ను రద్దు చేయడంతోపాటు, జీవో నెం 3ను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. విద్యామిషన్ ద్వారా భర్తీ చేయాల్సిన సుమారు 9500 పైగా ఉన్న పోస్టులను నేరుగా నియమించేందుకు ప్రభుత్వం జీవో నెం 3 జారీచేసిన తర్వాత, జనవరి 9 వ తేదీన అందుకు విరుద్ధంగా జీవో జారీచేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపించారు.
దగా పడిన ధర్మాస్పత్రి
- ఉన్న స్టాక్‌తోనే పంపిణీ మాయ
- మూలన పడిన విలువైన మెషినరీ
- కార్పొరేట్‌తో సర్కారు దోస్తానా!
- 10% కార్పొరేట్ వైద్యం ఉచితం
- కానీ.. కాగితాలకే పరిమితం
- వర్ధిల్లుతున్న ‘కార్పొరేట్ శ్రీ’
- ఈ పథకంలో రూ.3593 కోట్లు ఖర్చు
- ప్రైవేటు కార్పొరేట్‌కేరూ.2853 కోట్లు
- భారీగా అక్రమాలు..బయటపడేవి కొన్నే
రెండు తెల్లమందు బిళ్లలు.. రెండు ఎర్రగోలీలు! మహా అయితే ఓ సూదిమందు! గత కొన్నేళ్లుగా సర్కారీ వైద్యం తీరిదే! కొన్ని చోట్ల ఇవీ ఉండవు! మారుమూల పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభించినా.. దిక్కులేని పరిస్థితి! ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఏరియా ఆస్పవూతులో, జిల్లా ఆస్పవూతులో గతి! అక్కడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉండటంతో సర్కారీ వైద్యం కునారిల్లుతోంది. కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సేవలో పడిన ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం ధర్మాస్పవూతులను దగా చేస్తున్నది. ప్రభుత్వాస్పవూతుల ఉసురు తీసి.. కార్పొరేట్‌కు ఊపిరిపోస్తున్నది!
ప్రభుత్వ నిండు నిర్లక్ష్యం కారణంగా ధర్మాస్పవూతులు దగా పడుతున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బంది లేక, మందుల్లేక, అధునాతన యంత్రసామగ్రి ఉన్నా.. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించే దిక్కులేక కునారిల్లుతున్నాయి. అదే సమయంలో ఖరీదైన వైద్యానికి పెట్టిందిపేరైన కార్పొరేట్ వైద్యశాలలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అక్కడ వైద్యం ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు గతంలో ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు.. దాంతో కొంతకాలం పాటు ఆ ఆస్పవూతులు ఈగలు తోలుకున్న పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ప్రభుత్వ పుణ్యమాని ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పవూతులను కాపాడేందుకు, పోషించేందుకు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లు స్థాయిలో వాటికి బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు గుప్పెడు రోగాలకు మాత్రమే కోట్లలో ఉంటున్నది తప్పించి.. ప్రజల తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన, ఏరియా, జిల్లా ఆస్పవూతులపైనా ఉండటం లేదని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.
(, హైదరాబాద్)ఈ ఆర్థిక సంవత్సరం మందుల కోసం ప్రభుత్వం రూ.310 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.112కోట్లు గ్రీన్ చానల్ కింద ఇస్తామని నాలుగు నెలలక్షికితం చెప్పింది. ఇప్పటికీ రూపాయి కూడావిడుదలచేయలేదు. మందులు సరఫరా చేసే అనేక సంస్థలు కోర్టు కేసుల్లో ఉన్నాయి.వీటిని పరిష్కరించాలని ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాసినా ప్రభుత్వంగానీ, ఏజీ గానీ శ్రద్ధ పెట్టడం లేదని అధికారులే అంటున్నారు. మందుల పంపిణీలో అవినీతిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మందులు జిల్లా కేంద్రాల్లోని గోడౌన్లలో ఉండడంతో అక్కడికి మందుల కోసం వెళ్లేవారిని రూ.2వేల నుండి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మందులు అయిపోయినా పీహెచ్‌సీల్లోని సిబ్బంది మందులకోసం జిల్లా కేంద్రాలకు వెళ్లడం లేదనే వాదన ఉంది.
ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల కొన్ని సలహాలు కూడా చేశారు.అవి.. 1.మందుల కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా నేరుగా పీహెచ్‌సీల నుండి ఇండెంట్ తెప్పించడం. 2.శస్త్ర చికిత్సకు అవసరమైన సామాక్షిగికి ప్రతినెలా ముందుగానే ఇండెంట్ పెట్టడం. 3.ఆస్పవూతులకు సరఫరా చేసిన మందుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆస్పవూతుల్లో అందే సేవలపై ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఆన్‌లైన్‌లో సమాచారం ఉంచాలి.4.ఆస్పవూతుల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను బోర్డుల రాయాలి. కానీ.. వీటిని ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు.
మూలపడిన మెషినరీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పవూతుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువైన సామాగ్రి ఉంది. ఇందులో రూ.450కోట్ల విలువైన మెషినరీని ప్రస్తుతం వాడటం లేదు.చిన్నచిన్న రిపేర్ల వల్ల ఇవి మూలపడ్డాయి. ఈ బాధ్యత నిర్వహించాల్సిన ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో యంత్రాలు పని చేయక రోగులు ప్రైవేటు ఆస్పవూతులకు వెళ్లి ఆస్తులు కరిగించుకునే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.
కార్పొరేట్‌తో దోస్తానా
సొమ్ములుం ఆస్పత్రి గడప తొక్కనిచ్చేది అన్న రీతిలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పవూతులు వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాగం, పర్యవేక్షణ, తనిఖీ, నిఘా వంటివి ఏమాత్రం లేకపోవడంతో కార్పొరేట్ ఆస్పవూతులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. ఇక్కడ వసూలు చేసే చార్జీలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకే రకమైన రోగానికి, పరీక్షకు పలు ఆస్పవూతులు పలు రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయి. చికిత్సతో రోగం కుదిరినా.. ఈ బిల్లులు చూసి వారి గుండెలు గుభేల్మంటున్న పరిస్థితి ఉందన్నవాదన ఎప్పటినుంచో ఉంది. రాజధాని పరిధిలో దాదాపు 2200ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పవూతులున్నాయి.ఇందులో 1500 ఆస్పవూతులకే అనుమతులున్నాయని తెలుస్తోంది. వివిధ సేవల చార్జీల వివరాలను నోటీసు బోర్డులో పేర్కొనాల్సి ఉంది. చాలా ఆస్పవూతుల్లో ఇవి కనిపించవు.
ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు పొందిన కారణంగా తమ ఆస్పవూతుల్లో పదిశాతం రోగులకు ఉచిత సేవలు అందిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రం ఇస్తాయి. ఇలా రాయితీలు, సబ్సిడీలు పొందిన ఆస్పవూతుల్లో ఏ ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతున్న దాఖలాలు లేవు. అపోలో ఆస్పత్రి సహా అనేకం ఇదే బాటలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రభుత్వం నుండి రూ.200కోట్ల విలువైన భూమిని సాధారణ ధరకు తీసుకుంది. ఇది ట్రస్టు ఆస్పత్రి కనుక తెలంగాణతో పాటు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారూ విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా తెలంగాణ నుండి ఒక్కరు కూడా డైరెక్టర్ కాలేదు. కేర్ ఆస్పత్రి యాజమాన్యం గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ను ఆసరాగా చేసుకుని, అవే ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేస్తూ, ఫౌండేషన్‌కు చూపిస్తూ డబ్బులు దండుకుంటోందనే ఆరోపణలున్నాయి.
కనిపించని తనిఖీలు
ఏటా రాష్ట్రంలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో రూ.7వేలకోట్లకు పైగా ప్రైవేటు ఆస్పవూతుల జేబుల్లోకి వెళ్తున్నాయని అంచనా. కార్పొరేట్ ఆస్పవూతుల వ్యవహారాలను జిల్లా డీఎంహెచ్‌వో తనిఖీ చేయాలి. కొన్ని తనిఖీ బృందాలూ ఉండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ఆస్పవూతిలోనూ తనిఖీలు జరగడంలేదని నిపుణులు అంటున్నారు. నెలనెలా మామూళ్లు అందడంతోనే అధికారులు నిమ్మకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. మందుల షాపుల్లోనూ తనిఖీలు లేవు. నాశిరకం మందుల అమ్మకాలను నిరోధించేందుకు డ్రగ్ కంట్రోల్ అథార్టీ ఉన్నా.. తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో మెడికల్ షాపుల్లో జరిగే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని అంటున్నారు.
కార్పొరేట్ శ్రీ
అందరికీ మెరుగైన వైద్యం పేరుతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ.. కార్పొరేట్ ఆస్పవూతులకు కల్పతరువుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 2007లో ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా కార్పొరేట్ ఆస్పవూతుల్లో ఈగలు తోలుకునే పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ఆరోగ్యశ్రీ రాకతో కార్పొరేట్ ఆస్పవూతులు నేడు ధనికులకంటే పేదలతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.3593కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.2853కోట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పవూతులకు,మిగిలిన రూ.740 కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు బిల్లులు చెల్లించారు. కార్పొరేట్ ఆస్పవూతులకు ఇచ్చిన డబ్బును ప్రభుత్వ ఆస్పవూతుల కోసం ఖర్చు చేసి ఉంటే మళ్లీ ప్రభుత్వ ఆస్పవూతులు జీవం పోసుకునేవని అధికారులు,మేధావులుఅంటున్నారు.ఒకసంస్థ చేసిన సర్వేలో రూ.2వేల కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు ఖర్చు చేస్తే కార్పొరేట్‌కు దీటుగా పనిచేస్తాయని, పూర్తిగా ఉచిత సేవలందించవచ్చని పేర్కొంది.
అయినా.. కార్పొరేట్‌కు దోచిపెట్టడానికే ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ కింద ఇంకెన్ని కోటె్లైనా ఇచ్చేందుకు సిద్ధమని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీలో అక్రమాలకూ అంతూపొంతూ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పవూతులుఅవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి బిల్లులు దండుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాకు హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌పై ఆరోగ్యశ్రీ ట్రస్టు క్రిమినల్ కేసులు పెట్టింది. గాంధీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎన్‌వీఎన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ సెంటర్‌పై ఈ నెల 15న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ ఐపీసీ 406-42కింద క్రిమినల్ కేసు పెట్టారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, అనవసరమైన హెర్నియా శస్త్రచికిత్సలు చేసి ప్రజలను మోసం చేశారని రిపోర్టులో తేలిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆరోగ్యశ్రీ పరిధిలో అనేకం జరుగుతున్నాయి.
సర్కార్ వైద్యం పూర్తిగా నిర్వీర్యం కావడానికి ప్రభుత్వాలే కారణం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కార్పొరేట్ ఆస్పవూతులు ప్రైవేటు రంగంలోకి వచ్చాయి. దీనికి ముందు వైద్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. రాష్ట్రంలో మొదటి పౌరుడు గవర్నర్ నుండి మామూలు వ్యక్తి వరకు ప్రభుత్వ ఆస్పవూతికి వచ్చి అత్యుత్తమ చికిత్స చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ రానురాను కేటాయింపులు తగ్గిస్తూ కావాలనే ప్రభుత్వ వైద్యాన్ని సర్కారు నిర్వీర్యం చేసింది. ప్రభుత్వమే మందులు, పరికరాల కొరత సృష్టించడం మొదలు పెట్టింది. కార్పొరేట్ రంగం ఆవిర్భవించాక ప్రభుత్వ ఆస్పవూతులకు బడ్జెట్ పెంచాల్సింది పోయి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రైవేటు సెక్టార్‌లో ఇన్స్యూన్స్ చేయించి ప్రోత్సహించింది.
తమిళనాడులో ఏ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ ఆస్పవూతుల్లో వైద్యం చేయించుకుంటారు. ఆ పరిస్థితి గతంలో మన రాష్ట్రంలోనూ ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే కావాలని కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తూ సీమాంధ్రవ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త కార్పొరేట్ ఆస్పవూతులొచ్చి కోట్లు దండుకుంటున్నాయి. పేదలకు 20శాతం ఉచితవైద్యం చేస్తామని చెప్పి వచ్చిన వాళ్లు ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. లాబీయింగ్‌తో మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్న డబ్బుతోనే ప్రభుత్వ ఆస్పవూతులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వైద్యం చేస్తామంటే ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? నమ్మకం పోయింది కనుకే ప్రభుత్వ ఆస్పవూతులు నిర్వీర్యం అవుతున్నాయి.