అరుదైన వ్యాధి గుర్తింపు
- దేశంలోనే మొట్టమొదటి ఆపరేషన్
- వర్తించని ఆరోగ్యశ్రీతో రోగి ఆందోళన
- ఆదుకోవాలని తెలంగాణ బిడ్డ వేడుకోలు
హైదరాబాద్ డిసెంబర్ 25 (): అరుదైన వ్యాధితో ఏళ్ల తరబడిగా బాధపడుతున్న నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన రవీందర్‌డ్డి అనే యువకుడికి హైదరాబాద్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఈ వ్యాధి పేరు స్టిఫ్‌మాన్ సిండ్రోమ్. నాలుగేళ్లుగా అప్పులు చేసి దవాఖానల చుట్టూ తిరిగినా ఇది ఏ వ్యాధో అంతుపట్టలేదు.
వ్యాధిపేరు తెలియకపోగా కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లు మడవలేని స్థితిలో నాలుగేళ్లుగా రవీందర్‌డ్డి ఇబ్బంది పడుతున్నారు. చివరకు నగరంలోని ‘సన్‌షైన్’ ఆస్పవూతిలో ఉన్న వెన్నుపూస స్పెషలిస్టు నరేష్‌బాబు పరీక్షలు చేసి ‘‘స్టిఫ్‌మాన్ సిండ్రోమ్’’గా గుర్తించారు. ఈ జబ్బు సోకినవారికి వెన్నుపూసకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానే ఉపశమనం ఉంటుంది. అయితే ఈ మందు గంటకు మించి పనిచేయదు.
ఈ నేపథ్యంలో వెన్నుపూస ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో వెన్నుపూసకున్న ప్రధాన నరానికి నిత్యం సూదిమందు అందేందుకు పొట్టలో ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. ఒక్కసారి నింపితే వంద రోజులకు మందు సరఫరా అవుతుంది. మందు అయిపోతుంటే ఆ మిషన్ ఆలారం మోగిస్తుంది. కాగా రాష్ట్రంలోనే కాక, దేశంలోనే దీనిని మొట్టమొదటి కేసుగా గుర్తించారు.
ఇలాంటి పరికరం అమర్చడం దేశంలోనే మొట్టమొదటి సారి అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయకపోవడంపై పేషెంట్ రవీందర్‌డ్డి, ఆయన కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత ధృక్ఫథంతో సాయం అందిచాలని కోరుతున్నారు. మందు నింపుకునేందుకు ప్రతి వంద రోజులకు రూ.5వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Take By: T News
0 comments:
Post a Comment