చంద్రబాబూ ఖబర్దార్..
-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ
తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.
సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.
తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.
రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు
Take By: T News
0 comments:
Post a Comment