ఉద్యోగ సంఘాల సమ్మె..వాయిదా
- పది డిమాండ్లకు అంగీకరించిన సర్కార్
- టీ ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం
- నేటి నుంచి విధులకు హాజరు
హైదరాబాద్, అక్టోబర్ 24 :తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెను ఉద్యోగులు 42వ రోజున ప్రభుత్వ హామీతో తాత్కాలికంగా వాయిదా వేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 12 గంటలపాటు ఎడతెగని విధంగా సాగిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ప్రభుత్వం ఉద్యోగుల పది డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. మధ్యలో ఒకసారి డిమాండ్లను పరిశీలించే విషయంలో ప్రభుత్వానికి, మంత్రివర్గ ఉప సంఘానికి, ఉన్నతాధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో చర్చలకు బ్రేక్ పడిన ప్రకటించారు. తరువాత ప్రభుత్వమే దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. ఉదయం సచివాలయ సర్వీసెస్ సెక్రటరీ చర్చల కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు స్వామిగౌడ్‌కు, శ్రీనివాస్‌గౌడ్‌కు, దేవీవూపసాద్‌కు, విఠల్‌కు, సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు నరేందర్‌రావుకు ఆహ్వానం పంపారు. మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి చేరుకున్న నాయకులు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపారు.
పలు అంశాలపై అంగీకారం కుదరకపోవడంతో మధ్యలో కొద్దిసేపు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీ చర్చించారు. అనంతరం మరోసారి మంత్రివర్గ ఉప సంఘంతో చర్చలు జరిపిన ఉద్యోగసంఘాల నాయకులు ఉన్నతాధికారుల వైఖరి పట్ల అసహనానికి లోనయ్యారు. చర్చలు ఒకానొక దశలో విఫలమవుతున్నట్లుగానే సంకేతాలందాయి. మధ్యలో మళ్లీ ఉపముఖ్యమంవూతితో సీఎస్ చర్చించిన తరువాత ఉద్యోగుల 10 డిమాండ్లపై ప్రత్యేకంగా డ్రాఫ్ట్‌ను రూపొందించారు. ఈ డ్రాఫ్ట్‌పై ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు, ఉన్నతాధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. మొత్తానికి డ్రాఫ్ట్ రూపొందించకముందు ఒకసారి ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. డ్రాఫ్ట్‌కు ఓకే అంటేనే చర్చలు అని డిమాండ్ పెట్టడంతో అధికారులు అంగీకరించారు. అనంతరం మంత్రివర్గ ఉప సంఘంతో చర్చలు ముగిశాక సీఎం క్యాంప్ కార్యాలయం వేదికయింది. అక్కడ మంత్రివర్గ ఉప సంఘ సభ్యులైన దామోదర రాజనర్సింహతోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరాడ్డి, కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ హాజరయ్యారు.
అక్కడకు చేరుకున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సీఎంతో చర్చలు జరిపారు. దాదాపు గంటలకు పైగా సాగిన చర్చలో సీఎం అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించడంతో అక్కడే డ్రాఫ్ట్‌పై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సంతకాలు చేశారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరిన జేఏసీ ప్రతినిధులు పొలిటికల్ జేఏసీ కార్యాలయానికి చేరుకుని అక్కడ సమ్మె వాయిదా ప్రకటన చేశారు.
కక్షసాధింపు ఉండదు : ఆనం
సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై ఎలాంటి కక్ష సాధింపు ఉండబోదని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణడ్డి చెప్పారు. సీఎంతో చర్చలు ముగిశాక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతిపాదించిన డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రధానంగా ఎవరైనా ఉద్యోగులు పర్సనల్‌గా ఏదైనా కేసులో అరెస్టు అయితే వారిపై కేసుల ఆధారంగా విచారణ చేస్తామని, ఆందోళనలో పాల్గొనకున్నా కేసులు నమోదైనవారిపై కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.
అదే సమయంలో ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పటికే ఉద్యోగులు బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోలేదని, రాబోయే పండుగలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఉద్యోగులకు ఉండే సగంరోజు సెలవుల్లో సమ్మె కాలాన్ని మినహాయించుకుంటామని తెలిపారు. సీఎం సమక్షంలో ఉద్యోగ సంఘాల ఛైర్మన్ స్వామిగౌడ్ సమ్మె విరమణ పత్రాలపై సంతకాలు చేశారని చెప్పారు. మంగళవారం నుంచి అందరూ విధులకు హాజరవుతారని, విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి మొదలైందని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చొరవతోనే ఉద్యోగులు సమ్మె విరమించారని కార్మికశాఖ మంత్రి దానం మీడియాతో చెప్పారు. డిమాండ్లను పరిష్కరించే విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC
0 comments:
Post a Comment