పది డిమాండ్లకు అంగీకరించిన సర్కార్ - ఇదీ ఒప్పందం
-సమ్మె మాత్రమే ఆగింది... ఉద్యమం ఆగలేదు
- సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తట్టి లేపింది
- సమ్మె ఉధృతం చేసే విధంగా భవిష్యత్తు కార్యాచరణ
- అందుకే తాత్కాలిక వాయిదా: కోదండరాం
జెండాలన్నీ పక్కనపెట్టి ఉద్యమంలో కలిసొచ్చిన సంఘాలన్నింటికీ
ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఎప్పుడు ఉద్యమంలోకి రావాలని
పిలుపునిచ్చినా ఉద్యోగులుగా సంపూర్ణ మద్దతు తెలుపుతాం
- సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తట్టి లేపింది
- సమ్మె ఉధృతం చేసే విధంగా భవిష్యత్తు కార్యాచరణ
- అందుకే తాత్కాలిక వాయిదా: కోదండరాం
జెండాలన్నీ పక్కనపెట్టి ఉద్యమంలో కలిసొచ్చిన సంఘాలన్నింటికీ
ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఎప్పుడు ఉద్యమంలోకి రావాలని
పిలుపునిచ్చినా ఉద్యోగులుగా సంపూర్ణ మద్దతు తెలుపుతాం
1) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి ఉంది. అయితే ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రజల సెంటిమెంట్‌ను ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్రానికి వివరించారు.
2) సహాయ నిరాకరణ సమయంలో కుదుర్చుకున్నట్లుగా తెలంగాణలోని ఉద్యోగాల భర్తీపై రిటైర్డ్ హైకోర్టు జడ్జీ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటుకు అంగీకారం. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అందుబాటులో లేకుంటే రిటైర్డ్ జిల్లా కోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు.
3) సమ్మె సమయంలో ఉద్యోగులపై ప్రయోగించిన ఎస్మాను తొలగించడం. సమ్మె కాలంలో కొన్ని శాఖల్లో ప్రయోగించిన ఎస్మాను అంశాల ఆధారంగా తొలగించడం.
4) ఉద్యోగులపై పెట్టిన క్రిమినల్ కేసుల ఎత్తివేత. ప్రత్యక్షంగా పాల్గొనని కేసులను వెంటనే ఎత్తివేతకు అంగీకారం.
5) జీవో 17జైపకారం ఉద్యోగులపై ప్రయోగించిన నోవర్క్, నోపే పై అడ్వకేట్ జనరల్‌ను సంప్రదించి ఉద్యోగులకు సానుకూలంగా తగిన చర్యలు తీసుకోవడం
6) సమ్మె కాలంలో జరిగిన డిప్యూ బదిలీలను సానుభూతితో వ్యవహరించి వెనక్కి తీసుకోవడం. తిరిగి పాత స్థానంలోనే ఉద్యోగాలు ఇవ్వడం.
7) 13.9.2011నుండి సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు హాఫ్ పే లీవ్ కింద సమ్మె కాలన్ని లెక్కించాలి. జీవో 177 కోర్టు పరిధిలోనిది కనుక అడ్వకేట్ జనరల్ సూచనల అనంతరం హాఫ్ పే లీవ్‌ను మంజూరు చేయడం.
8) సమ్మె కాలంలో లక్షలాది మంది ఉద్యోగులో విధులకు దూరంగా ఉన్నారు కనుక వేతనాలు రాక పండుగలు కూడా జరుపుకోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే పండుగల నేపథ్యంలో ఒక్కొక్క ఉద్యోగికి వారి ఒక నెల వేతనాన్ని అడ్వాన్స్‌గా చెల్లించడానికి అంగీకారం. ఇచ్చిన అడ్వాన్స్‌ను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది తెలంగాణ జెఎసీని సంప్రదించిన అనంతరం నిర్ణయం
9) సమ్మె కాలంలో తొలగించబడిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరిగి విధులకు తీసుకోవడం.
10) మంగళవారం (25.10.011)నుండి ఉద్యోగులు విధులకు హాజరుకావడం
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC
0 comments:
Post a Comment