భారత్ భేష్
కాబూల్, జూన్ 17: అఫ్గాన్ తాలిబన్ల నుంచి భారత్‌కు ఊహించని ప్రశంసలు
దక్కాయి. ఈ ప్రాంతంలో భారత్ ప్రాముఖ్యమైన దేశం అని అఫ్గాన్ తాలిబన్లు
కొనియాడారు. అఫ్గాన్‌లో భారీగా సైనిక ప్రమేయం పెరగాలని కోరుతున్న అమెరికా
ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని, అగ్రదేశం డిమాండ్లను నిరాకరించిందని
మెచ్చుకున్నారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో అఫ్గాన్‌లోని
భారతీయులపై దాడులకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబన్ ఉగ్రవాద
సంస్థ ఇలా ప్రశంసలు కురిపించడం గమనార్హం.
‘అఫ్గాన్ల ఆకాంక్షలు,
సంప్రదాయాలు, స్వేచ్ఛ కోసం వారు పడే తపన భారత్‌కు బాగా తెలుసు. అమెరికాను
సంతృప్తి పరచడం కోసం వారు తమ దేశాన్ని ఉపవూదవంలోకి నెట్టివేయడం అహేతుకం’
అని తాలిబన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా రక్షణ కార్యదర్శి
లియాన్ పెనెట్టా ఇటీవల భారత పర్యటనకు వచ్చి, విదేశీ సైనిక బలగాలు
వైదొలగనున్న 2014 నాటికి అఫ్ఘాన్‌లో భారత్ విశేష పాత్ర పోషించాలని
పట్టుబట్టారని, అయితే భారత్ అందుకు ఒప్పుకోకుండా ఆయనను ఉత్త చేతులతో
తిప్పిపంపిందని ఒంటికన్ను ఉగ్రవాది ముల్లా ఒమర్ నేతృత్వంలోని తాలిబన్ సంస్థ
పేర్కొంది.
భారత్‌లో మూడు రోజులు గడిపిన పెనెట్టా.. తమ భారాన్ని భారత్‌పై
మోపి, అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి
విఫలమయ్యారని విమర్శించింది. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలకు
వ్యతిరేకంగా తాలిబన్లు పోరాటం కొనసాగిస్తున్నారు. 2001లో తాలిబన్ పాలకులను
గద్దె దించిన నాటినుంచి ఈ పోరు కొనసాగుతున్నది. అమెరికా డిమాండ్లకు భారత్
తలొగ్గలేదని విశ్వసనీయ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందిందని తాలిబన్లు
పేర్కొన్నారు. గొడ్డలిపెట్టును భారత్‌పై పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తున్న
విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.
పోలియో ప్రచారంపై తాలిబన్ల నిషేధం
ఇస్లామాబాద్:
పాకిస్థాన్‌లోని ఉత్తర వజిరిస్థాన్ గిరిజన ప్రాంతంలో పోలియో వ్యతిరేక
ప్రచారంపై పాక్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ నిషేధం విధించింది. ఈ ప్రాంతంలో
అమెరికా డ్రోన్ దాడులు ఆపేవరకు పోలియో వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకుంటామని
తాలిబన్ ఫ్యాక్షన్ గ్రూప్ కమాండర్ హఫీజ్ గుల్ బహదూర్ స్పష్టంచేశాడు.
0 comments:
Post a Comment