వేలంపాటకు చుక్కరాలదు లాటరీ లక్కే
నేడే నూతన ఎక్సైజ్ పాలసీ
ఆదాయం కోసం ఐదు శ్లాబుల నుంచి ఏడు శ్లాబులకు
మున్సిపాలిటీల్లో లైసెన్స్ ఫీజు పైపైకి
ఏసీబీ సహా ఏ కేసులున్నా అనర్హులే.. తెల్లరేషన్‌కార్డుదారులూ అంతే
ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
ఎకై ్సజ్ పాలసీ ఇక ఏడాదికే పరిమితం
ఆదాయం కోసం ఐదు శ్లాబుల నుంచి ఏడు శ్లాబులకు
మున్సిపాలిటీల్లో లైసెన్స్ ఫీజు పైపైకి
ఏసీబీ సహా ఏ కేసులున్నా అనర్హులే.. తెల్లరేషన్‌కార్డుదారులూ అంతే
ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
ఎకై ్సజ్ పాలసీ ఇక ఏడాదికే పరిమితం
హైదరాబాద్, జూన్ 17 () కొత్త ఆబ్కారీ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేయనుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఎక్సైజ్ కొత్త విధానం అమలు చేయాల్సి ఉన్నందున గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు ఈ కొత్త విధానంపై చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ఎక్సైజ్ కొత్త పాలసీలో ఇప్పటి వరకు ఉన్న బహిరంగ వేలం విధానానికి స్వస్తిపలికి స్థిర లైసెన్సు రుసుము(ఫిక్స్‌డ్ లైసెన్సు ఫీజు), లాటరీ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి కొత్త ఎక్సైజ్ పాలసీపై సోమవారం సాయంవూతానికి ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. ఈనెల 23వ తేదీన లాటరీ పద్ధతిలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
కొత్త పాలసీ అమలు, మద్యం షాపుల ఎంపిక, తదనంతర నిబంధనల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ఆదివారం ఎక్సైజ్ కమిషనరేట్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త పాలసీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని ఆన్‌లైన్ ద్వారానే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం విద్యార్థ్ధులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా వ్యాపారులు మద్యం షాపుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే భర్తీచేయడం, సంబంధిత జిల్లా అధికారులు కూడా ఆన్‌లైన్‌లోనే వాటిని పరిశీలించే అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఏసీబీ దాడులు జరిపి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కొత్త పాలసీ నోటిఫికేషన్‌లో అలాంటి కేసులున్న వ్యక్తులను అనర్హులుగా ప్రకటించడంతోపాటు తెల్లకార్డుదారులను కూడా మద్యం షాపు లు నడిపేందుకు అనర్హులుగా ప్రకటించనున్నారు.
మద్యం వ్యాపారం కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నందున ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు రెండు సంవత్సరాలకు పరిమితమైన ఎక్సైజ్ పాలసీని ఇకపై ఒక ఏడాదికే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని మద్యం షాపులను రిజర్వు చేయాలన్న ప్రతిపాదన ఆదిలోనే అటకెక్కింది.
2001 జనాభా లెక్కల ఆధారంగా మద్యం షాపులసంఖ్యను నిర్ధారించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6596 మద్యం షాపులుండగా, వాటిలో కొన్ని మద్యం షాపులను ప్రయోగాత్మకంగా ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో వేలం పాటల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం చేకూరింది. కొత్త పాలసీ ద్వారా లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఆదాయం అంతంతమావూతంగానే వచ్చే అవకాశం ఉంది.
దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న ఐదు శ్లాబుల సంఖ్యను ఏడు శ్లాబులకు పెంచే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో లైసెన్సు ఫీజులను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎక్సైజ్ విధానం వల్ల ఎమ్మార్పీ రేట్లు ఖాతరు చేయని వ్యాపారులు, మద్యం సిండికేట్లతో రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టను కూడగట్టుకోవడం ఒక ఎత్తయితే, ఏకంగా హైకోర్టు నుంచి అక్షింతలు కూడా వేయించుకుంది. మరోవైపు ప్రస్తుత ఎక్సైజ్ విధానాన్ని ‘కాగ్’ కూడా తప్పుపట్టింది. దీంతో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.
అయితే ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను వాన్‌పిక్ భూముల కేటాయింపులో సీబీఐ అరెస్టుచేయడంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం కిరణ్ ఎక్సైజ్ శాఖ బాధ్యతలను విద్యాశాఖ మంత్రి పార్ధసారధికి అప్పగించారు. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదాను ఖరారు చేసింది.
Take By: T News
0 comments:
Post a Comment