ఆంగ్లంలో హోం మంత్రి.. తెలుగులో రక్షణ మంత్రి!
పోలీసు కానిస్టేబుల్ ప్రశ్నాపవూతంలో అనువాద దోషం
తొలిసారిగా నెగెటివ్ మార్కులు.. సమీప జవాబులే కొన్ని ప్రశ్నలకు దిక్కు
20,429 పోస్టులకు ముగిసిన రాతపరీక్ష.. ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ
తొలిసారిగా నెగెటివ్ మార్కులు.. సమీప జవాబులే కొన్ని ప్రశ్నలకు దిక్కు
20,429 పోస్టులకు ముగిసిన రాతపరీక్ష.. ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ
హైదరాబాద్, జూన్ 17 ():పోటీ పరీక్షల ప్రశ్నావూపతం రూపకల్పనలో అనువాద దోషాలు, కరెక్టు జవాబులేని ప్రశ్నలు.. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకూ తప్పలేదు. 20,429 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షలో తప్పులు దొర్లాయి. 200 ప్రశ్నలతో రూపొందించిన ఈ ప్రశ్నావూపతంలో అక్కడక్కడా అచ్చుతప్పులు, అనువాద దోషాలు కన్పించాయి.
బుక్‌పూట్ సిరీస్ Aలో 30వ ప్రశ్న కింద ఇంగ్లిష్‌లో కేంద్ర హోం మంత్రి ఎవరు? అని అడిగి తెలుగు అనువాదంలో రక్షణ శాఖ మంత్రి ఎవరు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ఆప్షన్లలో.. పీ చిదంబరం, ఏకే ఆంటోని అని ఇద్దరి పేర్లూ ఉండటం గమనార్హం. ప్రతివూపశ్నకు వరుసగా ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో సమాధానం పక్కపక్కనే ఇచ్చినందున దేనిని ఆధారంగా తీసుకొని జవాబు గుర్తించాలో నిర్ణయించుకోలేక అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు.
బుక్‌పూట్ ప్రారంభంలో ఇచ్చిన సూచనల్లో 3 భాషల్లో చిన్న తేడాలుండవచ్చునని, అలాంటపుడు ఇంగ్లిష్ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. దీనినిబట్టి బుక్‌పూట్ సీరిస్ Aలోని 30వ ప్రశ్నను కేంద్ర హోంమంవూతిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు అనువాదంలో రక్షణ శాఖమంత్రి ఎవరు? అని స్పష్టంగా అడిగినందున తెలుగు మీడియం అభ్యర్థులు జవాబుగా ‘ఆంటోనీ’నే గుర్తించారు. మరి, బోర్డు ఈ ప్రశ్నకు ఏ జవాబును పరిగణనలోకి తీసుకుంటుందో తెలపాల్సి ఉంది.
200 ప్రశ్నలు గల ఈ రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కొక్క సరైన జవాబుకు ఒక మార్క్‌ను కేటాయించగా ప్రతి తప్పు జవాబుకు అర మార్క్‌ను నెగెటివ్ మార్కింగ్‌గా తీసివేస్తామని బోర్డు పేర్కొంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
ఒక్క పోస్టుకు ఆరుగురు పోటీ: 2011 అక్టోబర్ 31న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 4.28 లక్షల మంది రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారు. ఇంటర్ కనీస విద్యార్హత కావడం, పోస్టులు 20 వేల వరకు ఉండటంతో అభ్యర్థులు వెల్లువలా దరఖాస్తు చేశారు. అయితే శారీరక సామర్థ్య పరీక్షల్లో 1.28 లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. రాత పరీక్షకు ప్రతి పోస్టుకు ఆరుగురి చొప్పున పోటీపడ్డారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ విధానం లేదు.
ప్రశ్నలకు సరైన జవాబులు కరువు!
రాత పరీక్షా ప్రశ్నాపవూతంలో మూడు, నాలుగు ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులు లేవు. దీంతో అభ్యర్థులు.. ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబు కోసం అన్వేషించి కొంత సమయం పొగొట్టుకున్న తర్వాత సమీప జవాబులను గుర్తించాల్సి వచ్చింది. జీకే విభాగంలో ఆంధ్రవూపదేశ్‌లో ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్య ఎంత? అన్న ప్రశ్నకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రం లో ప్రస్తుత మండలాల సంఖ్య 1128.
అయితే ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్‌లో 1104 ఉంది. 2004-05 గణాంకాల ప్రకారం అధికార గెజిట్‌ను అనుసరించి 1104నే జవాబుగా గుర్తించాలి. అయితే పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్‌లో తాజాగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి చాలామంది అభ్యర్థులు తాజా సంఖ్య 1128 కోసం వెతికారు.
ఇదేవిధంగా మెంటల్ ఎబిలిటీ విభాగంలో సిరీస్ ‘ఎ’ కోడ్‌లో 56వ ప్రశ్న ‘ఒక పనిని-ఎ 15 రోజుల్లో అదే పనిని బి-20 రోజుల్లో చేయగలిగితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు?’ అని ఉంది. దీనికి సరైన సమాధానం 8.57 రోజులు. అయితే ప్రశ్నాపవూతంలో ఇచ్చిన ఆప్షన్లలో 8.5 అని ఉంది.
Take By: T News
0 comments:
Post a Comment